దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం రాజశేఖర్ తో కల్కి సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు వచ్చిన ఈ సినిమా ట్రైలర్స్ అన్ని విభిన్నంగా ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి. చూడబోతుంటే ఈ యువ దర్శకుడు మరో హిట్ కొట్టేలా ఉన్నాడు.


 ఈ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు బాలకృష్ణ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు.
'బాలకృష్ణ గారు అద్భుతమైన నటుడు. కెరీర్ ఆరంభంలో ఎన్నో కథాంశాలతో సినిమాలు చేశారు. అయితే ఈమధ్య ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయారు. ఫ్యాన్స్ వాళ్ళ కావచ్చు. నా దగ్గర ఆయనకోమ్మా ఓ క్రేజీ స్క్రిప్ట్ ఉన్నది. ఇప్పటివరకు అయన చేయనిది, తెలుగులో కూడా అటువంటి రానిది. 


ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటె తప్పకుండా చేస్తా' అని ప్రశాంత్ వర్మ అన్నారు. దీనితో అభిమానులు ఈ సినిమా జరగాలని కోరుకుంటున్నారు. అయితే బాలయ్య ఈ వయసులో ఆ సాహసం చేస్తాడా? అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: