టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకధీరుడుగా పేరు తెచ్చుకున్న ఎస్ఎస్ రాజమౌళి తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ గురించి ఆ మద్య ఓ ప్రెస్ మీట్ లో రాజమౌళి మాట్లాడుతూ..తెలుగు నేలపై ఇద్దరు మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కి సంబంధించిన కథ అని చెప్పారు. అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రాంచరణ్, కొమురం భీమ్ గా యంగ్ టైగర్
ఎన్టీఆర్ నటిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఎన్నో రకాల కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఆ మద్య షూటింగ్ సమయంలో
రామ్ చరణ్ వ్యాయాం చేస్తుండగా కాలు కి గాయం కావడం కారణంగా నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇది జరిగిన కొద్ది రోజులకే
ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో ఆయన కూడా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి ఇద్దరు పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. గతేడాది నవంబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్‌లో వేసిన పెద్ద సెట్లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లపై భారీ యాక్షన్స్ సీన్స్ చిత్రీకరించారు రాజమౌళి.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ రాజమౌళికి ఎంతో అచ్చొచ్చిన..ఇష్టమైన ప్రదేశం బల్గేరియాలో జరుపుకుంటోంది. జూనియర్
ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. తాజాగా షూటింగ్ స్పాట్ లో తీసుకున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాహుబలి మూవీకి పనిచేసిన టీం ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం కష్టపడుతోంది. బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. సెంథిల్
కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.