బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ హోటల్ టాస్క్ గురువారంతో పూర్తి అయింది. ఈ హోటల్ కి వచ్చిన గెస్ట్ లు అందరూ హౌస్ ని ఎమోషనల్ కి గురి చేశారు. అయితే ఈ గెస్ట్ వారి కంటెస్టెంట్స్ కి హౌస్ లో ఉండాల్సిన జాగ్రత్తలు చెప్తూ, బాగా ఆడాలని కోరుకున్నారు. అయితే ఈ విధంగా సూచనలు చేసిన వారిలో ముఖ్యంగా
రాహుల్ అమ్మగారు ప్రముఖంగా నిలిచారు. బిగ్ బాస్ హౌస్ కి గెస్ట్ గా వచ్చిన
రాహుల్ అమ్మ టాస్క్ ల విషయంలో అతన్ని హెచ్చరించడంతో పాటు, బయట అతనికి ఉన్న ఫాలోయింగ్ గూర్చి కూడా చెబుతుంది.
అయితే
రాహుల్ టాస్క్ లు ఆడడని అందరికీ తెలుసు. అదే విషయాన్ని
రాహుల్ అమ్మ గుర్తు చేస్తూ, టాస్క్ లు బాగా ఆడాలని పదే పదే గుర్తు చేసింది. అదే విధంగా అవతలి వారితో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండమని కోరింది. ముఖ్యంగా టాస్క్ లలో బాగా పర్ఫార్మ్ చేయాలనీ, అవతలి వారితో ఇష్టం ఉన్నట్టు మాట్లాడకూడదని, అటువంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పింది.
ఇక బయట
రాహుల్ కి చాలా ఫాలోయింగ్ ఉందని, బాగా ఆడాలని, టైటిల్ విన్నర్ నువ్వే అవుతావంటూ తన మనసులోని మాటను తలియజేసింది. అయితే వాళ్ల అమ్మ అన్ని సూచనలు ఇస్తున్నా
రాహుల్ గేమ్ గురించి మాట్లాడద్దు నేను చూసుకుంటాను అని చెప్తూ ఆమెని సముదాయించాడు. ఇక ఇంటి సభ్యులతో
రాహుల్ గురించి చెప్తూ,
రాహుల్ చాలా మంచివాడు. మనసులో ఏది పెట్టుకోకుండా బయటకి మాట్లాడేస్తాడు.
ఏదైనా తప్పు చేసుంటే ఏమీ అనుకోకండని అంటుంది. మొత్తానికి
రాహుల్ వాళ్ల అమ్మ
రాహుల్ బిగ్ బాస్ విన్నర్ కావాలంటే ఏమేం చేయాలో చెప్పి వెళ్ళింది. మరి
రాహుల్ ఆ విషయాల్ని పట్టించుకుని వాటిని పాటిస్తాడా లేదా చూడాలి.