టాలీవుడ్ కి లక్ష్మీ కల్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చి  ఎన్నో బంపర్ హిట్ లు   కొట్టింది అందాల భామ కాజల్. అందం చందం కలగలిపిన అద్భుతమైన నటి కాజల్ పాపా. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్  గా  కొనసాగుతోంది. మామూలుగా అయితే హీరోయిన్ల హవా ఇండస్ట్రీ లో  కొన్నాళ్ళు మాత్రమే నడుస్తుంది కానీ కాజల్ మాత్రం... టాలీవుడ్ కి  ఎంట్రీ ఇచ్చి పదేళ్లకు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి  తన క్రేజ్ తగ్గలేదు. అటు కుర్ర హీరోలతో ఇటు సీనియర్ హీరోలతో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది కాజల్. ఎంతోమంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నప్పటికీ... కాజల్ కి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది . ఇప్పటికే అందరూ టాప్ హీరోల సరసన మెరిసింది కాల్ ఈ అమ్మడు . 



 కాగా తాజాగా తెలుగు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పక్క మెరిసి మెప్పించింది . కాగా ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ సరసన ఇండియన్ 2 సినిమాలో నటిస్తోంది. ఒకప్పుడు కమలహాసన్, సెన్సేషనల్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న మూవీ ఇండియన్ 2. ఈ సినిమాలో  కమల్ హాసన్ సరసన కాజల్ నటిస్తోంది. అయితే కాజల్ ఏదైనా సినిమా చేస్తుందంటే... ఆ సినిమాలో అందాల బొమ్మగా కాజల్  కనిపిస్తుందని   ఎక్స్పెక్ట్ చేస్తారు అభిమానులు . 



 కానీ ప్రస్తుతం కాజల్ పాపా డి గ్లామరస్ గా  కనిపించడానికి రెడీ అవుతుంది. అయితే హీరోయిన్లు నటన పరంగా  ఎలాంటి రిస్క్ చేయమన్నా చేస్తారు కానీ... డి గ్లామర్ రోల్ లో  నటించమని అడిగితే మాత్రం కాస్త వెనకడుగు వేస్తారు. కానీ కాజల్ మాత్రం ముందడుగు వేసింది. ఈ విషయంలో కాజల్ రిస్కు చేస్తుందని  టాక్ వినిపిస్తోంది. కమలహాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ టు మూవీ లో నటిస్తున్న కాజల్ సినిమాలో  లో 60 ఏళ్ల బామ్మల కనిపించనుందని పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. ఒక వేళ ఈ వార్తే నిజమైతే కాజల్ కాస్త రిస్క్ చేస్తున్నట్లే అవుతుంది . అంతే కాకుండా కాజల్ ఇప్పుడు వరకు ఎప్పుడూ కనిపించనంత కొత్త లుక్ తో కనిపించనున్నట్లు సమాచారం. కాగా కాజల్ మరో వైపు వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు సిద్ధం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: