చివర్లో రివీల్ అయ్యే ట్విస్ట్స్ , విశాల్ , కేథరిన్ ల మధ్య వచ్చే కొన్ని సీన్స్చివర్లో రివీల్ అయ్యే ట్విస్ట్స్ , విశాల్ , కేథరిన్ ల మధ్య వచ్చే కొన్ని సీన్స్ సింపుల్ స్టొరీ లైన్ , సాగదీసిన కథనం , స్లో అండ్ స్టడీ అన్నట్టు సాగే నేరేషన్ , ఎడిటింగ్ , స్టార్ట్ లో విలనిజంకి ఇచ్చిన బిల్డప్ ఆ తర్వాత లేకపోవడం , హీరో , విలన్ మధ్య వచ్చే సమస్య చాలా సింపుల్ గా ఉండడం , ట్రైలర్ లోనే ఇంటెన్స్ ఉంది సినిమాలో లేకపోవడం

అమెరికాలో జాబ్ చేసే కమల్(విశాల్) తను ప్రేమించిన అమ్మాయి మల్లీశ్వరి(కేథరిన్)ని పెళ్లి చేసుకోవడం కోసం తన సొంత ఊరైన వైజాగ్ కి వస్తాడు. తన పెళ్లికి ముహూర్తం సెట్ చేస్కొని తన పెళ్లి పనులు పూర్తి చేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే అదే ఊరిలో చేపల బిజినెస్ చేస్తూ అందరి దృష్టిలో గొప్పవాడుగా చెలామణి అవుతూ తన చీకటి గురించి తెలిసిన వారందదరినీ చంపే రౌడీనే సాంబ(మధుసూదన్ రావు). ఆముద పెళ్లి బిజీగా ఉన్న టైంలో సాంబని ఎవరో దారుణంగా చంపేస్తారు. ఇక్కడ అసలైన ట్విస్ట్.. ఆ సాంబని మర్డర్ చేసింది కమల్ అని కేసు ఫైల్ చేస్తాడు. కమల్ తనకేం సంబంధం లేదని చెప్పినా వినకుండా పోలీసులు కమల్ ని అరెస్ట్ చేయాలనుకుంటారు. అలాగే మరోవైపు సాంబ మనుషులు కమల్ ని చంపడానికి ప్లాన్ చేస్తారు. ఇక అక్కడి నుంచి కమల్ ఏం చేసాడు? ఎలా తనని తానూ ఆ కేసు నుంచి రక్షించుకున్నాడు? అసలు సాంబ కేసులో కమల్ ని ఇరికించడానికి గల కారణం ఏంటి? వాళ్ళిద్దరికీ ఏమన్నా పాత గొడవలు ఉన్నాయా? ఇంతకీ సాంబని చంపింది ఎవరు అనే విషయాలను మీరు వెండితెరపై  తెలుసుకోండి..    

ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ తమిళ్ కావడం వలన ఎక్కువగా తమిళ్ యాక్టర్స్ ఇందులో కనిపిస్తారు. కావున అందులో తెలిసన వాళ్ళ గురించి, లీడ్ రోల్స్ చేసిన గురించి చెబుతా.. విశాల్ లుక్ పరంగా కాస్త స్టైలిష్ గా కనిపించే ప్రయత్నం చేసాడు. కానీ అది ఎక్కువ సేపు లేకపోవడం వలన ఓ నాలుగైదు సీన్స్ తర్వాత ఎప్పటిలానే కనిపిస్తాడు. ఇక పెర్ఫార్మన్స్ పరంగా చెప్పుకునేలా, కొత్తగా ఏమీ చేయలేదు. ఇప్పటి వరకూ తను చేసిన పాత్రలకి బాగా దగ్గరిగా అనిపించే పాత్రనే చేసాడు. మొత్తంగా తనకిచ్చిన పాత్రకి ఓకే అనిపించాడు. ఇక హీరోయిన్ గా చేసిన కేథరిన్ ని ది బెస్ట్ అనిపించేలా చూపించిన సినిమా ఇదనె చెప్పాలి. తను చూడడానికి ఎంత క్యూట్ గా ఉందో, లవ్ ట్రాక్ లో అంతే క్యూట్ హావభావాలను పలికించి ఫస్ట్ హాఫ్ లో అందరినీ తనవైపు ఆకర్షించుకుంది. ఫస్ట్ హాఫ్ తర్వాత కేథరిన్ అస్సలు కనిపించదనే చెప్పాలి. కథ పరంగా తన పాత్రకి ప్రాధాన్యత లేదు. విలన్ గా చేసిన మధుసూదన రావు బాగా చేసాడు. అలాగే అతనికి సపోర్ట్ గా చేసిన నటీనటులు కూడా ఓకే అనిపించారు. మైం గోపి, శ్రీజిత్ రవి, పవన్ తదితరులు తమ తమ పాత్రల్లో ఓకే అనేలా చేసారు.  

విశాల్ ఈ మధ్య తన బ్యానర్ లో నాలుగు నెలలకి ఓ సినిమా వచ్చేలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అందులో మెయిన్ గా ఫాలో అవుతున్నది, చాలా సింపుల్ స్టొరీ లైన్ తీసుకొని దానిని స్క్రీన్ ప్లే తో మేజిక్ చేసి చెప్పాలనుకోవడం. ఇలా ట్రై చేస్తున్నప్పటి నుంచీ విశాల్ యావరేజ్ సినిమాలు ఇస్తున్నాడే తప్ప పక్కా హిట్ అనేలా ఒక సినిమా కూడా ఆడియన్స్ కి అందించలేదు. ఇప్పుడు అదే పంధాలో చేసి, బిలో యావరేజ్ గా నిలిచినా సినిమానే 'కథకళి'. ఈ సినిమా కోసం ఎంచుకున్న స్టొరీ లైన్ మరియు కథ చాలా సింపుల్.. కథలో హీరోయిజంని ఎలివేట్ చేసే అంశాలు లేవు,  అలాగే కథ మొదట్లో చూపిన విలనిజంని హాయ్ లెవల్ కి తీసుకెళ్ళే సీన్స్ లేవు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా స్క్రీన్ ప్లే ని రాసుకున్నాడు. అలాగే కథ మొత్తాన్ని ఒక మర్డర్ చుట్టూ తిప్పాడు. కావున తన దగ్గర ఉన్న ఒకే ఒక్క సస్పెన్స్ పాయింట్ ని చివరి దాకా దాచుకోవాల్సి వచ్చింది. ఆ దాచుకున్న థ్రిల్ బానే ఉన్నప్పటికీ, చివరి 5 నిమిషాల్లో ఇచ్చే థ్రిల్ కోసం మిగతా గంట 50 నిమిషాల పాటు బోరింగ్ గా సినిమాని చూడడటం చాలా కష్టం కదా.. అంత చిన్న లాజిక్ డైరెక్టర్ పాండ్య రాజ్ ఎలా మిస్ అయ్యాడో.. ఇక సినిమా మొదలు పెట్టిన విధానం బాగానే ఉన్నా ఆ తర్వాత బోరింగ్ గా ముందుకు తీసుకెళ్ళాడు. లవ్ ట్రాక్ కేథరిన్ వలన ఓ మోస్తరుగా అనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి కథలో మిస్ లీడ్స్ ఎక్కువ ఇవ్వడం కోసం డైరెక్టర్ చాలా పాట్లు పడి చాలా సబ్ ప్లాట్స్ ని తీసుకు వచ్చాడు. కానీ ఏ ఒక్క సబ్ ప్లాట్ కూడా ఆడియన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేయలేకపోయింది. డైరెక్టర్ చివర్లో రివీల్ చేసే ఒక్క ట్విస్ట్ తెలిసినదే అయినా కాస్త పరవాలేదనిపిస్తుంది. అది తప్ప సినిమాలో మిగతా ఏ పార్ట్స్ ఆడియన్స్ ని సినిమాకి హుక్ చేయలేవు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో విశాల్ ఇమేజ్ కి ఫైట్స్ ఉండాలి కాబట్టి ఫైట్స్ పెట్టారు. కానీ అప్పటి వరకూ అస్సలు గొడవలకి పోనీ విశాల్ ఎలా అంతమంది  కొడతాడో అనేదానికి అస్సలు లాజిక్ ఉండదు.  థ్రిల్లర్ కి సరైన కథనం లేకపోవడం మరియు నేరేషన్ చాలా బోరింగ్ గా, స్లోగా ఉండడం వలన ఆడియన్స్ అస్సలు సినిమాకి కనెక్ట్ అవ్వరు. డైరెక్టర్ గా కూడా పాండ్యరాజ్ సక్సెస్ కాలేకపోయాడు.    


ఇక మిగిలిన  డిపార్ట్ మెంట్స్ లో బాలసుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. నైట్ ఎఫెక్ట్స్ షాట్స్ ని బాగానే షూట్ చేసాడు. హిప్ హాప్ తమిజ సాంగ్స్ జస్ట్ ఓకే, కానీ నేపధ్య సంగీతం మాత్రం సూపర్బ్ అని చెప్పాలి. ఎప్పటికప్పుడు తన మ్యూజిక్ తో సినిమాకి మంచి ఊతం ఇచ్చాడు. ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్ అస్సలు బాలేదు. శశాంక్ వెన్నెలకంటి డైలాగ్స్ బాగానే ఉన్నాయి. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నిర్మాణ విలువలు బాగున్నాయి.  


ఓ రివెంజ్ డ్రామాని సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రెజెంట్ చేద్దాం అని చేసిన ప్రయత్నమే ఈ 'కథకళి'. రివెంజ్ డ్రామా అంటే రొటీన్ అయిపోతుందని దానిని థ్రిల్లర్ ఫార్మాట్ లో కొత్తగా చెప్పాలనుకోవడంలో తప్పులేదు. కానీ ఆలోచన ఎంత కొత్తగా ఉందో అంతే కొత్తగా, ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా కథ - కథనం కూడా ఉండాలి కదా.. ఈ లాజిక్ మిస్ అవ్వడంతో సినిమా కాస్తా బాక్స్ ఆఫీసు వద్ద బోళ్తా పడింది. తమిళంలో ఈ సంక్రాంతికే వచ్చి తమిళ ఆడియన్స్ ని మెప్పించేలేకపోయిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కూడా మెప్పించలేక చతికిలపడింది. సంక్రాంతికి రిలీజైన సినిమాని 2 నెలలు ఆలస్యంగా తెలుగువారి ముందుకు తీసుకువచ్చిన విశాల్ 'కథకళి'తో తెలుగులో మరో పరాజయాన్నిఅందుకున్నాడు.  

Vishal,Catherine Tresa,Pandiraj,Hip Hop Tamizhaకథకళి - థియేటర్లో ఆడియన్స్ గాజు ముక్కల మీద డాన్స్ చేసినట్టే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: