నితిన్, సమంత, మిక్కి మ్యూజిక్నితిన్, సమంత, మిక్కి మ్యూజిక్కథ ముందే తెలిసి పోవడం, స్లో నేరేషన్

ఆనంద్ విహారి (నితిన్) అలియాస్ నందు కల్వపూడిలో నివసిస్తూ తన కుంటుబంతో ఉంటుంటాడు. అనసూయ రామలింగం (సమంత) మహా లక్ష్మి (నదియా) రామలింగం (నరేష్) ల ఏకైక పుత్రిక. అనసూయ మంచి కోసం ఎప్పుడు తన కంట్రోల్ లో ఉంచే ప్రయత్నంలో తనకు నచ్చని విధంగా ప్రవర్తిస్తుంది మహాలక్ష్మి. అయితే ఈ క్రమంలోనే తనకు ఏం పని రాదని తేల్చుకుని పెళ్లి చేద్దామని ఫిక్స్ అవుతుంది. ఇక ఆ క్రమంలోనే ఓ పెళ్లిఫిక్స్ చేస్తే దాన్ని కాస్త రామలింగం సహాయంతో తప్పించుకుని ఓ పది రోజులు నందు వాళ్లింట్లో ట్రిప్ వేస్తుంది. ఇక ఆ జర్నీలో నందుని అనసూయ ఇష్టపడుతుంది. ఇక ఓ పక్క పల్లెం వెంకటేష్ (రవు రమేష్) తన కూతురు నాగవల్లి (అనుపమ పరమేశ్వరన్) నందుని ఇష్టపడ్డదని అతనితో నిశ్చితార్ధానికి రెడీ అవుతాడు. మరి అసలు మహాలక్ష్మి ఎందుకు నందు ఫ్యామిలీని దూరం చేసుకుంది..? రామలింగం ఎందుకు నోరు మెదపలేదు..? చివరకు నందు, అనసూయల లవ్ స్టోరీ ఏమైంది అన్నది అసలు కథ.  


త్రివిక్రమ్ సినిమాలో పాత్రలన్ని చాలా సహజంగా నడుస్తాయి. తన మార్క్ డైలాగులతో ఆకట్టుకునే ప్రయత్నం చేసే  త్రివిక్రమ్ నితిన్ ను చాలా సింపుల్ గా చూపించాడు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నితిన్ సినిమాలో చాలా కూల్ అండ్ ప్లెజెంట్ లుక్ తో కనబడ్డాడు. ఇక డైలాగుల్లోని ఫీల్ ను నితిన్ పలికిన విధానం సూపర్. అఆ సినిమాకు ముఖ్య పాత్ర అంటే అనసూయ అదే మన సమంత.. సినిమా ఆమె మనోగతంతో స్టార్ట్ అవుతుంది. సో సినిమా మొత్తం చెప్పాలంటే సమంతదే అన్నమాట.


అనసూయగా బబ్లీగా.. క్యూట్ గా.. అందం అభినయంతో మరోసారి తనకు తాను కేక అనిపించుకుంది సమంత. ఇక మహాలక్ష్మిగా నదియా తన మార్క్ నటనతో ఆకట్టుకోగా.. నరేష్ కూడా పాత్ర పరిధి మేరకు పర్వాలెదనిపిచుకున్నాడు. ఇక పల్లెం వెంకటేష్ గా రావు రమేష్ తన మార్క్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. సినిమాలో నాగవల్లిగా అనుపమా హాఫ్ సారీస్ లో అదరగొట్టింది. మొదటి సినిమా అయినా సరే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని పాత్రకు అందం వచ్చేలా చేసింది. మిగతా పాత్రల్లో ప్రవీణ్, అజయ్, పోసానిలు పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

అఆ సినిమాను కలర్ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు 24 విభాగాల్లో పనిచేసిన వారు తమ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. తన పెన్ పవర్ తో మరోసారి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసిన త్రివిక్రమ్ పర్వాలేదనిపించుకోగా సినిమాకు మ్యూజిక్ అందించిన మిక్కి జే మేయర్ సినిమాకు ప్రాణంగా నిలిచాడు. ఇక కెమెరా మన్ నటరాజన్ సుబ్రమనియన్ పనితనం బాగుంది. తెర మీద పల్లెటూరి అందాలను చూపించిన విధానం బాగుంటుంది. ఇక ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వర రావు వర్క్ అవుట్ పుట్ బాగానే ఉన్నా సినిమా ఇంకాస్త ట్రిం చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక సినిమా నిర్మాత కె.రాధాకృష్ణ అలియాస్ చినబాబు సినిమా ప్రతి ఫ్రేంలో రిచ్ గా కనిపించేలా చేసి ప్రొడక్షన్ వాల్యూస్ లో పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు.  

 త్రివిక్రమ్ శ్రీనివాస్  సినిమా అనగానే మనలోని కొన్ని పాత్రలు తెర మీద ఆవిక్షరించబడతాయని ఆడియెన్స్ లో ఒక అనుభూతి ఉంటుంది. తన మాటలు తన సన్నివేశాలు ఎలాంటి కథ అయినా సరే మనదే అన్న విధానాన్ని రూపం దాల్చుతాయి. అయితే అఆ విషయంలో  త్రివిక్రమ్ చాలా చిన్న లైన్ అనుకున్నాడని చెప్పాలి. సాధారణం తన కథలన్ని ఓకే లైన్ లా ఉండేవే అయినా అఆ విషయంలో సినిమా స్టార్ట్ అయిన కొద్ది సేపటికే ఆడియెన్స్ కు సినిమా కథ మొత్తం అర్ధమవుతుంది.   


మహాలక్ష్మిని ఓ బిలినియర్ గా చూపించి ఆమెకు ఒకానొకప్పుడు నందు తండ్రి సాయం చేయబట్టే ఆమె అంత స్థాయికి వెళ్లగలిగింది అన్నది చూపించాడు. అయితే మహాలక్ష్మికి తన పొలం తాకట్టు పెట్టి మరి డబ్బు ఇచ్చిన కృష్ణమూర్తి మళ్లీ తిరిగి డబ్బులడగగా రెండు నెలలంటూ దాటవేస్తుంది. ఊళ్లో పరువు పోతుందని తెలిసి కృష్ణమూర్తి ఆత్మహత్య చేసుకుంటాడు. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు బలం. అదిగాక పక్కన వాళ్లను సంతోష పెట్టినప్పుడు కన్నా మన వాళ్లను బాధపడకుండా చూసుకోవాలన్నది హీరో క్యారక్టరైజేషన్. అయితే ఇదే విషయాన్ని అనసూయ తనని ప్రేమిస్తున్నానని తెలిసి తన దగ్గరకు రాగా తన చెల్లి భాను గుర్తు చేస్తే వెళ్లి హీరోయిన్ ను తీసుకెళ్లడం ఎక్కడో గురి తప్పినట్టు అనిపిస్తుంది.  


ఓవరాల్ గా సినిమా ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దటంలో  త్రివిక్రమ్ కాస్త పట్టు తప్పాడని చెప్పాలి. ఎప్పుడూ త్రివిక్రం సినిమాలో పంచ్ లు కూడా సినిమాలో తక్కువే అయినట్టు ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాదు సినిమా అంతా స్లోగా రన్ అవుతుందనే ఫీల్ కలుగుతుంది. అయితే సినిమా ఫుల్ రన్ ఆడియెన్స్ ను సాటిస్ఫైడ్ చేస్తుంది. అయితే స్క్రీన్ ప్లేలో ఇంకాస్త గ్రిప్ ఉండి ఉంటే సినిమా సూపర్ గా ఉండేది.  


సమ్మర్ సినిమాల్లో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా ఉంటుందనడంలో సందేహం లేదు కాని  త్రివిక్రమ్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ అందించడంలో కాస్త లోటు జరిగింది.


Nithin, Samantha Ruth Prabhu, Anupama Parameswaran,Trivikram Srinivas,S. Radha Krishna,Mickey J Meyer.దిద్దుబాట్లున్నా త్రివిక్రమ్ 'అఆ' అందమైన ఆహ్లాదకరమైనది..!

మరింత సమాచారం తెలుసుకోండి: