సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘బాద్ షా’. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా ఆడియోను ఆదివారం విడుదల చేశారు. మరి ఈ పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం..!   1) సైరో సైరో.. [ గానం : రంజిత్, రాహుల్ నంబీర్, నవీన్ సాహిత్యం : క్రిష్ణ చైతన్య ]  ఉత్సాహంగా సాగే ఈ ‘సైరో సైరో..’ పాటతో ఈ ఆల్బమ్ తో ప్రారంభమయ్యింది. ఆకట్టుకునే గాత్రం, ఊషారు అయిన సంగీతం తో ఈ గీతం సాగుతుంది. సాహిత్యం ఫరవ్వాలేదనిపిస్తుంది. శ్రీను వైట్ల చిత్రీకరణ, జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు ఈ పాటకు మరింత ఆదరణ లభించే విధంగా చేస్తాయని సులువుగానే అంచనా వేయవచ్చు.  2. డైమండ్ గర్ల్.. [ గానం : శింబు, సుచిత్ర సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి ] తమిళ హీరో శింబు గానం చేయడం ఈ పాట ప్రత్యేకత. మ్యూజిక్ బాగున్న ఈ పాటకు సాహిత్యం, గాత్రాలు దెబ్బకొట్టాయి. తమిళంలో హీరోగా మంచి గుర్తింపు ఉన్న శింబు పాడవల్సిన స్థాయిలో ఈ పాట లేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ డాన్సులు, కాజల్ అందాలు ఈ పాటకు ఆదరణ దక్కే విధంగా చేసే అవకాశం ఉంది. 3) బాద్ షా టైటిల్ సాంగ్ [ గానం: హేమచంద్ర, షెఫలీ  సాహిత్యం : విశ్వ]  ‘బాద్ షా’ సినిమాకు తగిన టైటిల్ సాంగ్  ఇది. ఎస్.ఎస్.థమన్ ఈ సాంగ్ లో తన విశ్వరూపం చూపించాడు. విశ్వ అద్భుతమైన సాహిత్యం ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నోళ్లలో పాటగా ఇది వచ్చింది. చిత్రీకరణతో ఇది మరింతగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ పాట ఫీమేల్ వాయిస్ ప్రధానంగా సాగుతుంది. దీంతో ఈ పాట ఒక ఐటెం సాంగ్ ల కూడా అనిపిస్తుంది. ఇదే పాటను ఒక ప్రముఖ గాయకుడు అలపిస్తే ఈ పాట మరింత హెచ్చుస్థాయిలో వచ్చేది. రజనీకాంత్ ‘బాషా’ టైటిల్ సాంగ్ లా కలకల కాలం నిలచి ఉండే అవకాశం ఉండేది. ఈ గేయ రచయిత విశ్వ గతంలో అలపించిన మహేష్ బాబు ‘అతడు’ టైటిల్ సాంగ్ కూడా మంచిగా అదరణ పొందింది. విశ్వతో పాడించినా ఈ బాద్ షా టైటిల్ సాంగ్ ఇంకొంక విధంగా వచ్చేదేమో...    4) బంతి పూల జానకి [గానం: దిలేర్ మహందీ, రనైనా రెడ్డి , సాహిత్యం : రామజోగయ్య శాస్ర్తి ] ‘బంతి పూల జానకి... అంత సిగ్గు దేనికి.. ’ వినగానే ఆకట్టుకునే పాదాలు ఇవి. పాటలో మరింత జోష్ రావాలి. అయితే పాటలో అంతగా జోష్ రాలేదు. సంగీతం కూడా సాధారణంగా ఉంది. గతంలో ఎన్టీఆర్ కు దిలేర్ మహందీ పాడిన ‘రబ్బరు గాజలు..’ పాట స్థాయిలో ఈ కొత్త గీతం లేదు.   5) వెల్ కమ్ కనకమ్ [ గానం : సౌమ్య రావు, జస్పీత్ జాజ్, సాహిత్యం :భాస్కర భట్ల]   బాద్ షా సినిమాల ఐటెమ్ సాంగ్ ఇది. ఐటెమ్ సాంగ్ బాగున్నా ఎస్.ఎస్.ధమన్ పాత పాటలను గుర్తుకు తెస్తుంది. సాహిత్యం మాత్రం మాస్ ను ఆకట్టుకునే విధంగా ఉంది. చిత్రీకరణ తో ఈ పాట మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. 6) రంగోలి రంగోలి [గానం : బాబా సెహగల్, మన్సి, సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి ] జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అలరించే విధంగా ఈ పాట ఉంది. మాస్ పదాలతో ఊషారుగా సాగుతుంది. సంగీతం, గాత్రం కూడా పాటకు సరిగ్గా సరిపోయాయి. చిత్రీకరణతో వెండితెర మీద  మరింతగా ఆకట్టుకోవడం ఖాయం. చివరిగా... బొద్దుగా ముద్దుగా ఉండే థమన్ కి మా మీడియా మిత్రులు పెట్టిన పేరు ‘‘డబ్బారేకుల సుబ్బారాయుడు’’. అది తనకు తగ్గ పేరేనన్నట్లుగా థమన్ కూడా తన ప్రతి సినిమాలొనూ బీట్ కి ప్రాధాన్యమిస్తూ పాటల్ని స్వరపరుస్తున్నాడు. బాద్ షా సినిమాకు థమన్ ఇచ్చిన పాటలు బావున్నాయి. కనీసం మూడు పాటలయితే వింటుంటేనే పాదం కదిలించి డాన్స్ వేయలన్పించే విధంగా ఉన్నాయి. అయితే ప్రతీ పాట బీట్ ప్రాధాన్యంగా సాగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ ఈ పాటలకు ప్రాణం పోసి సూపర్ హిట్ అన్పించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ అన్ని పాటలు, లేదా వాటిలో మెయిన్ బీట్ ఇంతకు ముందు, థమన్ పాటలలో ఎక్కడో ఒకచోట విన్నట్లుంటుంది. థమన్  ఈ డిక్ చిక్- డిక్ చిక్ సంగీతంతో పాటు కొత్తగా ఏమయినా ప్రయత్నించకపోతే మాత్రం రానున్న కాలంలో మనుగడ కష్టతరం.      

మరింత సమాచారం తెలుసుకోండి: