కథ , విజయ్ దేవరకొండ యాక్టింగ్కథ , విజయ్ దేవరకొండ యాక్టింగ్కథనం , క్లైమాక్స్ మిస్సింగ్, ఎంటర్టైన్మెంట్

రోజు మొత్తం వీడియో గేమ్స్, చాటింగ్ అంటూ కంప్యూటర్ ముందే గడిపే నిఖిల్ అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటాడు. అయితే మరోపక్క గేమ్ డిజైనర్ అయిన రాగమాలిక (శివాని సింగ్) హింసతో కూడిన ఆటలను కాకుండా కొత్తగా ప్రయత్నించాలని చూస్తుంది. స్నేహితుల చాటింగ్ ద్వారా రాగమాలిక నిఖిల్ కు పరిచయం అవుతుంది. అయితే వారిద్దరు కలుసుకోవడం మాత్రం ఓ గేమ్ లా సాగుతుంది. ఆమెను కలవాలనుకునే నిఖిల్ కు కొన్ని క్లూస్ ఇస్తుంది రాగమాలిక. ఇక ఆమెను వెతికేందుకు వెళ్లిన నిఖిల్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు..? నిఖిల్, రాగమాలిక ఎక్కడ కలిశారు..? అన్నది సినిమా కథ.

ప్రస్తుతం హీరోగా సూపర్ ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ తన కెరియర్ స్టార్టింగ్ డేస్ లో ఉన్నప్పుడు ఒప్పుకున్న సినిమా ఇది. అందుకే ప్రస్తుతం ఉన్న విజయ్ దేవరకొండలా కాకుండా కాస్త సన్నగా కనిపిస్తాడు. ఇక తన యాక్టింగ్ ప్రూవ్ చేసుకునేంత గొప్ప పాత్ర ఏం కాదని చెప్పొచ్చు. ఇక శివాని సొంగ్ కూడా సోసోగానే చేసింది. మిగతా పాత్రలన్ని కూడా ఏదో చేశామంటే చేశామన్నట్టు ఉన్నారు. 

సినిమాటోగ్రఫీ సినిమాకు కాస్త బెటర్ అనిపిస్తుంది. డైరక్టర్ శ్రీధర్ మర్రి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తగినట్టుగా కథ రాసుకున్నా దాన్ని తెర రూపం దాల్చడంలో విఫలమయ్యాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నాసిరకంగానే కానిచ్చారు. మ్యూజిక్ అక్కడక్కడ బాగుంది. ఎడిటింగ్ కూడా అంతగా ఏం లేదు.

ఏ మంత్రం వేసావె టైటిల్ చూస్తే ఇదో లవ్ స్టోరీ అని చెప్పేయొచ్చు. అయితే ఇందులో ప్రస్తుతం మనిషి తన జీవితంలో కంప్యూటర్, గేమింగ్ వంటి వాటికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడో చూపించారు. అయితే దర్శకుడు ఎంచుకున్న కథ కాస్త కొత్తగా ఉన్నా దాన్ని తెరకెక్కించిన విధానం మాత్రం రొటీన్ గా అనిపిస్తుంది. ఏమాత్రం లాజికల్ గా కాని.. ఎక్సైటింగ్ గా కాని స్క్రీన్ ప్లే ఉండదు.

సినిమా మొదలైన కొద్ది నిమిషాలకే దర్శకుడి పనితనం అర్ధమవుతుంది. కేవలం విజయ్ దేవరకొండ కోసం తప్ప ఈ సినిమా చివర దాకా చూడాలనుకునే వారి సంఖ్య కూడా తక్కువే అని చెప్పొచ్చు. కథ, కథనాలు ఎక్కడ ఆడియెన్స్ కు కనెక్ట్ అవ్వవు సరికదా సాగదీత స్క్రీన్ ప్లేతో సినిమా నడిపించారు. కనీసం ప్రొడక్షన్ వాల్యూస్ అయినా కనులను ఇంపుగా ఉంటాయంటే అవి కూడా నాసిరకంగా సాగాయి. 

మొత్తానికి మంచి ఫాం లో ఉన్న విజయ్ ఈ సినిమా రిలీజ్ ఆడ్డుకుంటే బాగుండేది. అనవసరంగా ఈ సినిమా చూశాక అతని మీద ఉన్న ఇంప్రెషన్ పోయేలా చేస్తుంది. తన కెరియర్ మొదట్లో చేసిన సినిమా కాబట్టే అతను ఈ సినిమా ప్రమోషన్స్ కు కూడా అటెండ్ అవలేదు. ఫైనల్ గా విజయ్ మంత్రం మాత్రం ఫలించలేదు.
Vijay Deverakonda,Shivani Singh,Shridhar Marri,Abdus Samadవిజయ్ దేవరకొండ ఏ మంత్రం వేయలేకపోయాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: