విజయ్ దేవరకొండ సినిమాటోగ్రఫీ సత్య రాజ్విజయ్ దేవరకొండ సినిమాటోగ్రఫీ సత్య రాజ్ స్టోరీ, స్క్రీన్ ప్లే మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్
ముఖ్యమంత్రి వాసుదేవ్ (నాజర్) ఓ కేసు విషయమై జెలుకి వెళ్లాల్సి రాగా రెండు వారాల కోసం తన కొడుకు వరుణ్ (విజయ్ దేవరకొండ)ని సిఎం చేస్తాడు. రెండు వారాల పాటు సిఎంగా ఇంట్లో ఉండి రాష్ట్రాన్ని నడిపించిన సిఎం అనుకోకుండా వాసుదేవ్ కు శిక్ష పడిందని తెలుసుకుని అసలైన రాజకీయ నాయకుడిగా మారుతాడు. ఈ క్రమంలో తండ్రి మీద కొందరు ఎటాక్ చేస్తారు. ఇక వరుణ్ సిఎంగా పూర్తిస్థాయి బాధ్యతలతో పాలన సాగిస్తాడు.

ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ వారు వరుణ్ ను టార్గెట్ చేయడం ప్రజల్లో అతని మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలిగేలా చేస్తుంది. దాన్ని నుండి కూడా తెలివిగా తప్పించుకున్న వరుణ్ తండ్రి వాసుదేవ్ వేల కోట్ల డబ్బు గురించి తెలుసుకుంటాడు. అసలు ఆ డబ్బు ఎక్కడిది..? ఎవరి దగ్గర ఉంది..? సిఎంగా తండ్రికి వ్యతిరేకంగా మారిన వరుణ్ ఏం చేశాడు అన్నదే సినిమా కథ. 

సినిమా సినిమాకు కొత్తదనం చూపించే విజయ్ దేవరకొండ నోటా కథ ఎంచుకోవడం గొప్ప విషయం. ఇక వరుణ్ పాత్రలో విజయ్ తన ప్రతిభ కనబరిచాడు. తనదైన స్టైల్ లో విజయ్ నటించి మెప్పించాడు. అయితే దర్శకుడు హీరో పాత్రని ఇంకా బాగా రాసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక సినిమాలో నాజర్, సత్యరాజ్ పాత్రలు అలరించాయి.


అయితే నాజర్ కు సెకండ్ హాఫ్ లో వేసిన మేకప్ సరిగా అనిపించదు. సత్యరాజ్ సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక మెహ్రీన్ కౌర్ ఎందుకు ఈ సినిమాలో ఉందో అర్ధం కాదు. చిన్న పాత్రలో ఆమె అసలేమాత్రం అవసరం లేదు అనిపిస్తుంది. ప్రతిపక్ష నాయకుడు కూతురు కళగా నటించిన అమ్మాయి బాగా చేసింది.

సామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే కాని ఉన్న రెండు పాటలు పెద్దగా అలరించలేదు. సినిమాటోగ్రఫీ సంతాన కృష్ణన్ బాగానే వర్క్ అవుట్ చేశాడు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ సినిమాకు కావాల్సిన స్క్రీన్ ప్రెజెన్స్ వచ్చేలా చేశాడు. ఇక కథ అందించిన షాన్ కరప్ప స్వామి బలమైన కథ రాయలేదు. దర్శకుడు ఆనంద్ శంకర్ కూడా కథ, కథనాలు విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.  

పొలిటికల్ థ్రిల్లర్ మూవీస్ అనగానే లీడర్, భరత్ అనే నేను సినిమాలు రిఫరెన్స్ గా తీసుకుంటారు. అయితే నోటా అంటూ విజయ్ కొత్తగా వస్తాడు అనుకుంటే పేలవమైన కథ, కథనాలతో వచ్చాడు. తండ్రి వారసత్వాన్ని అందుకుని సిఎంగా మారిన హీరో ఎలా తన ప్రస్థానం సాగించాడు అన్నది సినిమా కథ. 


కథ, కథనాలు అన్ని తమిళనాడు రాజకీయాలకు సంబందించినట్టుగా ఉంటాయి. సినిమాలో మొదటి భాగ కాస్త ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లినట్టు అనిపించినా సెకండ్ హాఫ్ పూర్తిగా ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది. సినిమాలో విజయ్ ను కూడా దర్శకుడు సరిగా వాడుకోలేదని చెప్పుకోవచ్చు. 


ముఖ్యంగా సత్య రాజ్ చెప్పే ఫ్లాష్ బ్యాక్ సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. సినిమా రన్ టైం ఇంకాస్త టైట్ స్క్రీన్ ప్లే ఉండి ఉంటే బాగుండేది. పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన నోటా సగటు సిని ప్రేక్షకుడిని కూడా మెప్పించడంలో విఫలమైందని చెప్పొచ్చు. 
Vijay deverakonda,Mehreene Pirzada,Anand shankar,K.E. Gnanavel Raja,Sam csవిజయ్ నోటా.. మెప్పించలేని ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: