Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 11:02 am IST

Menu &Sections

Search

2.0 మూవీ రివ్యూ

- 3.5/5
2.0 మూవీ రివ్యూ READ THIS MOVIE REVIEW IN ENGLISH

మంచి

  • రజిని
  • అక్షయ్ కుమార్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్

చెడు

  • అక్కడక్కడ స్లో అవడం మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్
ఒక్క మాటలో: విజువల్ గ్రాండియర్ గా 2.ఓ..!

చిత్ర కథ

హటాత్తుగా సెల్ ఫోన్స్ అన్ని మాయవుతున్నట్టుగా గమనించిన రాష్ట్ర హోం శాఖ అర్జెంట్ మీటింగ్ ఎరేంజ్ చేస్తుంది. సెల్ ఫోన్స్ మాయవడానికి గల కారణాలేంటో కనిపెట్టాలని అనుకుంటారు. సైంటిస్ట్ వసీకర్ (రజినికాంత్) తన రోబో అసిస్టెంట్ వెన్నెల (ఎమీ జాక్సన్) కూడా హోం మినిస్టర్ మీటింగ్ లో పాల్గొంటారు. అయితే తన ఫోన్ ద్వారా అసలు ఫోన్లన్ని ఎలా మాయవుతున్నాయని కనిపెట్టాలనుకున్న వసీకర్ పక్షి రాజు (అక్షయ్ కుమార్)ను గుర్తిస్తాడు. అసలు ఎవరీ పక్షి రాజు..? ఎందుకు మనుషుల మీద పగ పట్టాడు..? వసీకర్ తన చిట్టితో పక్షి రాజు పని ఎలా పట్టాడు అన్నదే సినిమా కథ.

నటీనటుల ప్రతిభ

వసీకర్, రోబో రెండు పాత్రల్లో రజిని అదరగొట్టాడు. తన స్టైల్ తో అలరించిన రజిని ప్రీ క్లైమాక్స్ లో డిఫరెంట్ వేరియేషన్స్ లో కూడా మెప్పించాడు. చివర్లో 3.ఓ చిట్టి రోబో చేసిన కామెడీ బాగుని. సినిమాలో పక్షి రాజుగా అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించారు. తన గెటప్ అదిరిపోయింది. ఇక ఏమీ జాక్సన్ రోబోగా కనిపించడం విశేషం. మిగతా పాత్రలన్ని బాగానే చేశారు.

సాంకేతికవర్గం పనితీరు

నిరవ్ షా సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. విజువల్ గ్రాండియర్ గా 2.ఓ ఇంత అద్భుతంగా వచ్చేందుకు ప్రధాన కారణం కెమెరా వర్క్. ఇక వి.ఎఫ్.ఎక్స్ కు పెద్ద పీఠ వేశారు. గ్రాఫిక్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. రెహమాన్ సంగీతం బిజిఎం లో బాగా హైలెట్ అయ్యింది. శంకర్ స్టోరీ, స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా రాసుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని తెలుస్తుంది.

చిత్ర విశ్లేషణ

రోబో సీక్వల్ గా వచ్చిన 2.ఓ ఎన్నో భారీ అంచనాలతో వచ్చింది. సెల్ ఫోన్స్ వల్ల పక్షులు నాశనం అవుతున్నాయని పక్షి రాజు దాన్ని అదుపు చేయాలని చూస్తాడు. కాని అలా కుదరక సెల్ టవర్ కే ఉరి వేసుకుని చనిపోతాడు. అప్పుడే మనుషుల మీద పగ పెంచుకుంటాడు పక్షి రాజు. అలా పక్షి రాజు నుండి మనుషులను కాపాడేందుకు చిట్టి ఏం చేశాడు అన్నది సినిమా.


రోబో సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమా అందుకే అందులో వావ్ ఫ్యాక్టర్స్ ఎంజాయ్ చేశారు. అయితే ఆ సినిమా సీక్వల్ గా వచ్చిన 2.ఓ పై భారీ అంచనాలున్నాయి. సెల్ టవర్ ఫ్రీ క్వెన్సీ వల్ల మనుషులు ఎలాంటి ఇబ్బందిలు ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పిన కథ ఓకే అనిపిస్తుంది.  


ఎంచుకున్న కథకు కథనం బాగానే ఉన్నా గ్రిప్పింగ్ గా నడిపించడంలో కాస్త వెనుకపడ్డాడు శంకర్. విఎఫెక్స్ ఎఫెక్ట్స్ మాత్రం మనం చూస్తుంది హాలీవుడ్ సినిమానా అన్న రేంజ్ లో ఉంటాయి. శంకర్ టెక్నికల్ గా ఈ సినిమాను చాలా అడ్వాన్సెడ్ గా తీశారు. సినిమా మొత్తం ఒకే రకమైన అంశం మీద నడిపించడం ప్రేక్షకులకు నచ్చలేదు. లీడ్ పెయిర్ రొమాన్స్, ఎంటర్టైనింగ్ లాంటి అంశాలు లేకపోవడం మైనస్.   


టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో పాటుగా విజువల్ వండర్ గా 2.ఓ వచ్చింది. రజిని ఫ్యాన్స్ కు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. కథని అర్ధం చేసుకుని.. కనెక్ట్ అయిన వారికి మాత్రం సినిమా బాగా నచ్చుతుంది. క్లైమాక్స్ లో శంకర్ తన క్రియేటివిటీతో అందరిని సర్ ప్రైజ్ చేశారు.

కాస్ట్ అండ్ క్రూ

3 / 5 - 2547
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS

Bollywood

View all