బ్యానర్ : అరుంధతీ మూవీస్,         సినిమా : సుడిగాడు నటీనటులు : అల్లరి నరేష్, మోనాల్ గజ్జార్, బ్రహ్మనందం, కోవై సరళ, జయప్రకాష్ రెడ్డి తదితరలు  నిర్మాత : చంద్రశేఖర్ డి.రెడ్డి,   దర్శకత్వం : భీమనేని శ్రీనివాసరావు ఇటీవల కాలంలో కామెడీ చిత్రాలకు అల్లరి నరేష్ కేరాఫ్ అడ్రాస్ గా మారాడు. అతనికి ఒకప్పుడు వరస హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టున్న దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు జత కలిసాడు. ఇద్దరి కాంబినేషన్ లో సుడిగాడు సినిమా రూపుదిద్దుకుంది. ఇక దీనికి ఒక టికెట్ పై వంద సినిమాలు అంటూ ప్రచారాన్ని ఊదరకొట్టారు. దీంతో అందరి దృష్టి సుడిగాడు సినిమా మీద పడింది. ఈ సుడిగాడు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి సుడిగాడు సంగతేంటో చూద్దాం.  చిత్రకథ : సుడిగాడు చిత్ర కథ చెప్పాలంటే కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే ముందు నుంచి చిత్ర యూనిట్ చెబుతున్నట్లు ఈ సినిమా  స్ఫూఫ్ ల ప్రధానంగా నడుస్తోంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒకొక్కసారి కేవలం  స్ఫూఫ్ ల కోసమే ఈ సినిమా తీసారనిపిస్తుంది. సినిమా ఎంత సేపు ఆ కోణంలోనే సాగుతుంది. ఇక చిత్రకథ గురించి చెప్పుకోవాలంటే.. ఇందులో హీరో అమ్మ కడుపు లో నుంచే సిక్స్ ప్యాక్ తో బయటకి వస్తాడు. అంత చిన్న వయస్సు లోనే విలన్ గ్యాంగ్ మనుషులను  చంపుతాడు ( ఎలా చంపుతాడు అనేది తెర మీద చూడాలి). దీంతో విలన్ గ్యాంగ్ హీరో గురించి వెతుకుతుంటుంది. అఖరికి ఆ విలన్ గ్యాంగ్ ను ఎలా చంపుతాడనేది చిత్రకథ. హీరో గారు ప్రేమలో పడటం.. ఆ ప్రేమను ఎలా గెలిపించుకున్నాడన్నది ఉపకథ. నటీనటుల ప్రతిభ : అల్లరి నరేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్ర ఇచ్చినా పండించే సత్తా ఉన్న నటుడు. ఇక తనకు అలవాటైన కామెడీ హీరో పాత్ర ఇస్తే ఊరుకుంటాడా.. చింపి అవతల పారేస్తాడు. ఈ సినిమాలోనూ అదే చేసాడు. కామెడీ, డాన్సులతో పాటు ఈ సినిమాలో ఫైట్లు కూడా బాగా చేశాడు. అయితే ఇలాంటి కథలు ఎంచుకునే ముందు ఒక్కసారి అల్లరి నరేష్ ఆలోచిస్తే బాగుంటుంది. తన మార్కెట్ పెంచుకోవడానికి అల్లరి నరేష్ కృషి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సుడిగాడు సినిమాలతో అల్లరి నరేష్ ఆశలు తీరవు. ఇక మోనాల్ గుజ్జార్ విషయానికి వస్తే తన వరకూ బానే చేసింది. హీరోయిన్ కు పెద్దగా ప్రాముఖ్యత లేని సినిమా ఇది. బ్రహ్మనందం నవ్వులు పంచాడు. జఫ్పా రెడ్డి గా బ్రహ్మానందం తన మార్కు కామెడిని జనానికి చూపించాడు. కోవై సరళ ఓకే. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు : ఫోటో గ్రఫీ, మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. కామెడీ సినిమాలో ఇంత కంటే గొప్ప మాటలను ఆశించలేం. నిర్మాతలు సినిమా బాగా రావడానికి తమ వంతు కృషి చేశారు. ఇక దర్శకత్వం విషయానికి వస్తే వరస సూపర్ హిట్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భీమినేని శ్రీనివాసరావు చాలా కాలం విరామం తరువాత ఈ సుడిగాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఆయన తన ప్రతిభను నమ్ముకోకుండా అల్లరి నరేష్ మీద ఆధారపడినట్లు అనిపిస్తోంది. అలాగే ఈ సినిమాను  స్ఫూఫ్  లప్రధానంగా సాగించాలని ఆయన ఎక్కువ కష్టపడ్డారు. దానికి కంటే ఒక మంచి కథ తయారు చేసుకోవడానికి ఆయన శ్రమపడితే బాగుంటును. సినిమాలో ప్రారంభం లో సన్నివేశాలు కొంచెం అతిగా అనిపిస్తాయి. తొడ కొట్టడం నేర్పించే స్కూల్ సన్నివేశం బావుంది. అలాగే రియాల్టీ షో ల మీద సాగిన పేరడీ సీన్ ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే ఈ సీన్ మరింత హుందాగా చిత్రీకరిస్తే బావుండును. హైలెట్స్ : అల్లరి నరేష్ నటన, కొన్ని కొన్ని కామెడీ దృశ్యాలు, పాటలు. డ్రాబాక్స్ : కొత్తగా అనిపించని కామెడీ, సాధారణంగా సాగే సన్నివేశాలు, ఒక పూర్తి స్థాయి సినిమా చూస్తున్న ఫీలింగ్ రాకపోవడం. చివరగా..: ఒకే టికెట్ పై వంద సినిమాలు చూపించడానికి ట్రై చేయకుండా ఒక టోకెన్ మీద ఒక ఫుల్ మీల్స్ పెడితేనే కామన్ మ్యాన్ కు ఇష్టం.       for english review ; http://www.apherald.com/Movies/ViewArticle/3039/Sudigadu-Review---Over-dose-of-comedy 

మరింత సమాచారం తెలుసుకోండి: