మెయిన్ ప్లాట్, పతాక సన్నివేశాలు, సినిమాటోగ్రఫీమెయిన్ ప్లాట్, పతాక సన్నివేశాలు, సినిమాటోగ్రఫీమ్యూజిక్, స్క్రీన్ ప్లే, కాస్టింగ్
ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న గుణ (కార్తికేయ) అమ్మనాన్నలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఇక సెల్ ఫోన్ షాప్ నడిపించే గీత (అనఘ)ని చూసి ఇష్టపడతాడు గుణ. ఆమెను తొలిచూపులోనే ప్రేమించిన గుణ ఆమె ప్రేమ కోసం వెంటపడతాడు. ఒంగోలులో పెద్ద మనిషిగా ఉంటున్న రాధా (ఆదిత్య మీనన్)తో గుణకు మంచి రిలేషన్ ఉంటుంది. గుణ ఫ్రెండ్ ఒకరు రాధాతో గొడవ పెట్టుకోవడం వల్ల గుణ ఇబ్బందుల్లో పడతాడు. ఊహించని విధంగా గుణ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. గుణ జైలుకెళ్లడానికి కారణాలు ఏంటి..? తన శత్రువులను వెతికే క్రమంలో గుణ ఏం తెలుసుకున్నాడు..? ఈ సమస్యల నుండి గుణ ఎలా బయటపడ్డాడు అన్నది సినిమా కథ.  



ఆరెక్స్ 100 సినిమాతో తనకో ఐడెంటిటీ తెచ్చుకున్న కార్తికేయ గుణ పాత్రలో మెప్పించాడని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం లవర్ బోయ్ గా కనిపించిన కార్తికేయ సెకండ్ హాఫ్ లో యాంగ్రీ యంగ్ మెన్ గా కనిపించాడు. అయితే ఎమోషనల్ సీన్స్ లో కాస్త తడబడినట్టు అనిపిస్తుంది. యాక్షన్, ఫైట్స్ అంతా ఓకే. హీరోయిన్ అనఘా పర్వాలేదు అనిపించింది. రంగస్థలం మహేష్ కు సినిమాలో మంచి పాత్ర పడ్డది. ఆదిత్య మీనన్ తన పాత్రకు న్యాయం చేశాడు. నరేష్, హేమ, శివాజి రాజా పాత్రలు ఎప్పటిలానే అలరించాయి.



చేతన్ భరధ్వాజ్ పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. కథ పాతదే కథనం కూడా అదేలా నడిపించడంతో దర్శకుడిగా అర్జున్ జంధ్యాలకు తక్కువ మార్కులు పడ్డాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.  



ఆరెక్స్ 100తో కమర్షియల్ హిట్ అందుకున్న కార్తికేయ ఆ తర్వాత వచ్చిన హిప్పీ సినిమాతో ఢీలా పడ్డాడు. గుణ 369 అంటూ సూపర్ పాజిటివ్ ప్రీ రిలీజ్ బజ్ తో వచ్చాడు కార్తికేయ. సినిమా కథ రొటీన్ గానే ఉంది. కథనంతో దర్శకుడు ఏదైనా మ్యాజిక్ చేశాడా అంటే అది లేదు. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగించిన దర్శకుడు సెకండ్ హాఫ్ యాక్షన్ డ్రామాగా తీశారు. 


కార్తికేయ తన పరిధి మేరకు మెప్పించినా కథ, కథనాలు ఆకట్టుకోలేకపోవడంతో సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. దర్శకుడు మొదటి సినిమా కాబట్టి అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని పాత్రల ప్రవర్తన వాటి చిత్రీకరణ కూడా డిజప్పాయింట్ చేస్తుంది. ముఖ్యంగా విలన్స్ విషయంలో దర్శకుడు ఇంకాస్త వర్క్ చేయాల్సింది. 


సినిమా మెయిన్ ప్లాట్ బాగున్నా దాన్ని రొటీన్ సినిమాగా తెరకెక్కించాడు దర్శకుడు అర్జున్ జంధ్యాల. మొత్తానికి ఈ సినిమాతో పక్కా హిట్టు కొడుతున్నా అని కాన్ఫిడెంట్ గా చెప్పిన కార్తికేయకు పెద్ద షాక్ ఇచ్చారు ఆడియెన్స్. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే అంశాలు ఉన్నాయి. 



కార్తికేయ, గీత, సాయి కుమార్, అర్జున్ జంద్యాలకార్తికేయ 'గుణ 369'.. రొటీన్ సినిమా గురూ..!

మరింత సమాచారం తెలుసుకోండి: