స్క్రీన్ప్లే,డైరెక్షన్,మ్యూజిక్ & సినిమాటోగ్రఫీస్క్రీన్ప్లే,డైరెక్షన్,మ్యూజిక్ & సినిమాటోగ్రఫీ ఫస్ట్ హాఫ్,హారర్ సన్నివేశాలు లేకపోవడంరచయిత అవ్వాలన్న ఆశయంతో ఉన్న యువకుడు జేబిన్ (అశోక్ సెల్వన్). తనకి ఇష్టం లేకపోయినా తండ్రి కోసం వ్యాపారం చేసి అందులో నష్టపోతాడు జేబిన్ అదే సమయంలో జేబిన్ తండ్రి(నాజర్) మరణిస్తారు . అయన చనిపోయాక అతని లాయర్ ద్వారా జేబీ కి భీమునిపట్నంలో ఒక విల్లా ఉందన్న విషయం తెలుస్తుంది. ఆ విల్లాను అమ్మి తన కష్టాల నుండి బయటపడాలని జేబిన్ ఆ విల్లా చేరుకుంటాడు.ప్రేయసి ఆర్తి (సంచిత శెట్టి) తో పటు అక్కడే ఉంటున్న జేబిన్ తన రెండవ రచనను అదే వీళ్ళలో చెయ్యాలని నిర్ణయించుకుంటాడు అదే సమయంలో వీరువురికి కొన్ని అనుకోని కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. ఆ సంఘటనలు ఏంటి? జేబిన్ రెండవ నవల పూర్తి చేసాడా? విల్లా లో ఏమయ్యింది? విల్లా వెనకనున్న రహస్యాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.అశోక్ సెల్వన్ ఈ చిత్రంలో చాలా బాగా నటించారు కొన్ని సన్నివేశాలలో అతను పండించిన ఎమోషన్ సరిపోకపోయినా సన్నివేశానికి కావలసినంత అయితే ఇవ్వగలిగారు. సంచిత శెట్టి నటనాపరంగా ఉన్నంతసేపు బాగానే నటించింది కాని ఆమె పాత్రా చాలా పరిమితం అయ్యింది. కాని హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలు అంత ఆకట్టుకోలేదు. నాజర్ మరియు వీర సంతానం ఉన్న సన్నివేశాలలో చాలా బాగా చేశారు. మిగిలిన నటీనటవర్గం చాలా తక్కువ ఉన్న వాళ్ళందరు వారి పాత్రలకు న్యాయం చేసారు.ఈ సినిమాకి సాంకేతిక అంశాలు అన్ని హైలెట్స్ అనే చెప్పాలి. దీపన్ చక్రవర్తి అందించిన స్క్రీన్ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. మొదటి చిత్రమే అయినా దర్శకుడు ఈ చిత్రాన్ని హేండిల్ చేసిన విధానం అద్భుతం అని చెప్పుకోవాలి.సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చిత్రానికి కావలసిన మూడ్ ని దీపక్ కుమార్ చిత్రం ఆసాంతం మైంటైన్ చేసారు. సస్పెన్స్ థ్రిల్లర్ అనగానే సంగీతం ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ చిత్రానికి సంగీతం అందించిన సంతోష్ నారాయణ్ తన పాత్రను చాలా బాగా నిర్వర్తించారు. అయన అందించిన సంగీతం చిత్రానికి ప్రధాన బలం. శశాంక్ వెన్నెలకంటి అందించిన డైలాగ్స్ సన్నివేశానికి సరిగ్గా సరిపోయాయి. ఎడిటర్ లియో జాన్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది చిత్రం ఎక్కడా కూడా బోర్ కొట్టదు మొదలయిన దగ్గర నుండి చిత్రం పరిగెడుతుంది. గ్రాఫిక్స్ వర్క్ కూడా బాగుంది నిర్మాతలు చిత్రం కోసం చాలా తెలివిగా ఖర్చు పెట్టారు .ముందుగా ఇది "పిజ్జా" చిత్రం లా హారర్ చిత్రం కాదు . ఈ చిత్రం పిజ్జా చిత్రంతో అసలు సంభంధం లేని మరో థ్రిల్లర్ చిత్రం. పిజ్జా చిత్రంలో ఉన్నదీ ఈ చిత్రంలో లేనిదీ హారర్ పాళ్ళు, పిజ్జా చిత్రంలో మొదటి నుండి చివరి వరకు హారర్ సన్నివేశాలు ఉంటాయి ఈ చిత్రం ఆసాంతం ఒక్క హారర్ సన్నివేశం కూడా ఉండదు. ఈ చిత్రంలో ఉన్నదీ పిజ్జాలో లేనిదీ.. తెలివైన సన్నివేశాలు. ఈ చిత్రం రెండవ అర్ధ భాగంలోని సన్నివేశాలు వేగంగానూ మరియు చాలా తెలివిగాను సాగుతుంటాయి .ఇదే ఈ చిత్రంలో వచ్చిన మరో సమస్య, దర్శకుడు తెలివైన వాడే కదా అని ప్రేక్షకుడు కూడా తెలివైన వాడు అనుకుంటే ఎలా? రెండవ అర్ధ భాగంలో అయన చెప్పిన ఫిజిక్స్ క్లాసు చాలావరకు ఆర్ట్స్ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టి ఉంటుంది. కాని ఆయా సన్నివేశాల్లో దర్శకుడి పాయింట్ ఆఫ్ వ్యూ మరియు అయన చెప్పిన అంశాలు చాలా బాగున్నాయి. ఇటు దయ్యాలను అటు సైన్స్ ను దర్శకుడు బ్యాలెన్స్ చేసిన విధానం సూపర్బ్ . చివరి వరకు ప్రేక్షకుడిని టెన్షన్ లో కూర్చోబెట్టడం లో దర్శకుడు విజయవంతం అయ్యాడు. దర్శకుడికి అన్ని టెక్నికల్ అంశాలు కూడా అలానే కలిసి వచ్చాయి. అసలే చిన్న సినిమా ఇందులో దర్శకుడు కథ మొదలు పెట్టడానికి కాస్త సమయం తీసుకోడంతో ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గా అనిపిస్తుంది నటీనటులు కూడా వారి స్థాయి మేరకు చిత్రానికి చాలా తోడ్పడ్డారు. ఇది పిజ్జా సిక్వేల్ కాదు ఈ చిత్రానికి పిజ్జా చిత్రానికి ఎటువంటి సంభంధం లేదు, ఇది హారర్ కాదు థ్రిల్లర్ చిత్రం ఈ మూడు పాయింట్స్ మనసులో పెట్టుకొని చుసిన వారిని కచ్చితంగా సంతృప్తి పరిచే చిత్రం . థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళందరు తప్పక చూడవలసిన చిత్రం ఇది.Ashok Selvan,Sanchita Shetty,Deepan Chakravarthy,C.V. Kumar,Santhosh Narayananపిజ్జా 2 : విల్లా :ఇది హారర్ పిజ్జా కాదు థ్రిల్లర్ విల్లా

మరింత సమాచారం తెలుసుకోండి: