ఫస్ట్ హాఫ్ లో కామెడీ ,అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ ఫస్ట్ హాఫ్ లో కామెడీ ,అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ సెకండ్ హాఫ్ ,లాజిక్స్ లేకపోవడం ,క్లైమాక్స్

విక్కీ(వరుణ్ సందేశ్)- వీడికి ఉన్న అమ్మాయిల పిచ్చి వల్ల షాపింగ్ లకి గట్రా విచ్చలవిడిగా డబ్బులు తగలెట్టి రికవరీ వాళ్ళకి కట్టలేక తప్పించుకొని పరుగులు తీస్తుంటాడు. రాజీవ్ అలియాస్ రాజు(సందీప్ కిషన్) ఏమో హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి అందరి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఓ రైటర్ కమ్ డైరెక్టర్ రాజుని రెమ్యునరేషన్ కి బదులు నువ్వే ఎదురుగా 20 లక్షలు ఇస్తే హీరో అయిపోవచ్చని అంటాడు. హరీష్(నవీన్) కి ఏమో మరదలు సమస్య. మామని ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి డబ్బు కావాలి. ఇక బన్ను(రాకేష్) - బొద్దుగా ఉండే బంనికి డబ్బు పరంగా పెద్ద సమస్యలు లేకపోయినా ఒక అమ్మాయిని పడగొట్టడం కోసం అర్జంట్ గా సిక్స్ ప్యాక్ తెచ్చుకోవాలనుకుంటాడు. దాని కోసం ఓ పెద్ద అమౌంట్ కావాల్సి వస్తుంది. కట్ చేస్తే వెళ్ళు నలుగురు ఫ్రెండ్స్. ఈ నలుగురు డబ్బు కోసం ఓ బ్యాంకు దోపిడీకి ప్లాన్ చేస్తారు. ఆక్కడి నుండి కథ ఎలా మలుపులు తిరిగింది. ఈ నలుగురు ఫ్రెండ్స్ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనేది మీరు వెండితెర పైనే చూడాలి..

ఈ చిత్రంలో కీలక పాత్రలలో ఒకరిగా నటించిన వరుణ్ సందేశ్ అమ్మాయిల కోసం ఖర్చు చేసి రికవరీ ఏజెంట్ల నుండి తప్పించుకు తిరిగే పాత్రలో బాగానే నటించారని చెప్పాలి. ఇక హీరో అయిపోదామని వచ్చి చిన్న చిన్న పాత్రలు వేసుకునే పాత్రలో సందీప్ కిషన్ బాగా నటించారు కొన్ని సన్నివేశాలలో అయన చూపించిన ఎనెర్జి మరియు ఈజ్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. అమాయకమయిన పాత్రలో నటించిన నవీన్ మరియు రాకేశ్ ప్రేక్షకులను బాగానే నవ్వించారు. తనికెళ్ళ భరణి ,హేమ వారి స్థాయిలో నటించి ఆకట్టుకున్నారు , పోలిస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన దేవ్ కట్ట ఆ పాత్రకు సరిగ్గా సరిపోయారు . చెవుల పిల్లి పాత్ర పోషించిన రిషి మువ్వ బాగా నవ్వించారు.

కథ కొత్తదేం కాదు ఇప్పటికే చాలా చిత్రాలలో చూసిందే ,సెటైరికల్ గా రాసిన కొన్ని డైలాగ్స్ బాగున్నాయి ఈ రెండింటిలో ఆకట్టుకోకపోయినా దర్శకుడు సిరాజ్ కల్ల దర్శకత్వం విషయంలో పాస్ మార్కులు వేయించుకున్నారు , ఇక కథనం విషయానికి వస్తే కథ మొదలయిన పది నిమిషాలకే దొంగతనం మొదలవుతుంది అక్కడ నుండి సింగల్ లొకేషన్ లో నే మిగిలిన సన్నివేశాలన్నీ నడుస్తుంది . కథనం అయితే బానే ఉంది కాని మొదటి అర్ధ భాగంలో ఉన్న వేగం రెండవ అర్ధ భాగం లో ఉండదు . ఈ విభాగం మీద ఇంకొంచెం దృష్టి సారించాల్సింది . లుకాస్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది . మహేష్ శంకర్ అందించిన సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయింది . సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు ఎడిటర్ కత్తెర తప్పించుకున్నాయి , వీటి మీద దృష్టి పెట్టి కత్తిరించి ఉంటె బాగుండేది .సింగల్ లొకేషన్ సినిమా అయినా క్వాలిటీ పరంగా నిర్మాతలు రాజీ పడలేదు.

"డార్క్ కామెడీ" ఈ జోనర్ లో చిత్రాలు తీయడం చాలా కష్టం , కాని ఆ జోనర్ లోనే చిత్రాలను తెరకెక్కించే రాజ్ & డి కె ఈ చిత్రాన్ని నిర్మించారు. కాని సమస్య ఏంటంటే ఈ చిత్రం వీరి దర్శకత్వం లోనే వచ్చిన "షోర్ ఇన్ ది సిటీ" చిత్రాన్ని పోలి ఉంటుంది. అంతే కాకుండా ఈ చిత్రంలో గతంలో వచ్చిన "మనీ మనీ మోర్ మనీ" మరియు "ఎటాక్ ది గ్యాస్ స్టేషన్ " వంటి చిత్రాల ఛాయలు కనిపిస్తుంది . ఫస్ట్ హాఫ్ కాస్త ఆసక్తి కరంగానే సాగినా రెండవ అర్ధ భాగం వచ్చేసరికి బాగా నెమ్మదిస్తుంది . క్లైమాక్స్ అయితే అసలు బాగోలేదు చిత్రాన్ని ఎక్కడో ఒక చోట ముగించాలి కాబట్టి ముగించారు అనిపిస్తుంది . మీరు డార్క్ కామెడి ప్రియులు అయితే ఒకసారి చూసి ఎంజాయ్ చెయ్యగలరు లేదంటే వెళ్ళడం వెళ్ళకపోవడం మీ ఇష్టం .....

VarunSandesh,Sundeep Kishan,Melanie Kannokada,Siraj Kalla,Krishna DK,Mahesh Shankarడి ఫర్ దోపిడీ : B ఫర్ బాధితుడు P ఫర్ ప్రేక్షకుడు

మరింత సమాచారం తెలుసుకోండి: