సినిమాటోగ్రఫీ,అచ్చు మ్యూజిక్, యావరేజ్ గా అనిపించే నవీన్ చంద్ర, రీతు వర్మల పెర్ఫార్మన్స్సినిమాటోగ్రఫీ,అచ్చు మ్యూజిక్, యావరేజ్ గా అనిపించే నవీన్ చంద్ర, రీతు వర్మల పెర్ఫార్మన్స్ టికెట్ తీసుకొని సినిమాకి వెళ్లి మిమ్మల్ని మీరే బలి చేసుకోవడం, తాత ముత్తాతల నాటి స్టొరీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, డైరెక్షన్

సినిమా ఓపెనింగ్ షాట్ మన హీరోయిన్ బిందు(రీతు వర్మ) సూసైడ్ చేసుకోవడానికి రైల్వే ట్రాక్ పై ట్రైన్ కి ఎదురుగా వెళుతుంది. అక్కడి నుండి కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్.. హైదరాబాద్ టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్టు కొడుకు వైష్ణవ్(నవీన్ చంద్ర). వైష్ణవ్ మరో రెండు నెలల్లో అమెరికా వెళ్లాలని ఖాళీగా తిరుగుతున్న సమయంలో బిందుతో పరిచయం ఏర్పడుతుంది. మాములుగా అమ్మాయిలంటే అస్సలు ఇష్టం లేని వైష్ణవ్ బిందుతో కూడా అలానే ఉంటాడు. కానీ కొద్ది రోజులకి వైష్ణవ్ కి బిందు అంటే ఇష్టం ఏర్పడుతుంది. అదే తరుణంలో అసలు చదువంటే ఇష్టం లేని బిందు కూడా మెల్ల మెల్లగా వైష్ణవ్ ప్రేమలో పడుతుంది. ఒకరోజు బిందు తన ప్రేమని వైష్ణవ్ కి చెబుతుంది కానీ వైష్ణవ్ మాత్రం తనకి నో చెప్పి అమెరికా వెళ్ళిపోతాడు. అసలు వైష్ణవ్ బిందుని ఎందుకు రిజెక్ట్ చేసాడు? దాని వెనుక గల కారణాలు ఏమిటి? సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిన బిందు బతికిందా? లేదా? అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే...

అందాల రాక్షసి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర ఆ తర్వాత కూడా పూర్తి మాస్ పాత్రలే చేసాడు. కానీ ఈ సినిమా కోసం నవీన్ చంద్ర తనని తానూ మార్చుకున్నాడు. లుక్స్ పరంగా చాలా స్టైలిష్ గా, హన్డ్సం గా కనిపిస్తాడు. నటన బాగానే ఉంది కానీ తన గత సినిమాల్లో లాగా పెర్ఫార్మన్స్ లో ఏదో ఉంది అనుకునేంత అయితే లేదు. రీతు వర్మ చూడటానికి నవ్వితే క్యూట్ గా, నవ్వకపోతే ఓకే చూడొచ్చు మరీ అంత బాడ్ గా ఏం లేదు అనే రేంజ్ లో ఉంది. రిచా పనత్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఈ పాత్ర వల్ల కథకి దమ్మిడి కూడా ఉపయోగం లేదు. దానికి తోడు ఆ హీరోయిన్ డైలాగ్స్, ఎక్స్ ప్రెషన్స్ వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక కీలక పాత్ర చేసిన సితార పాత్రకి పావలా చెయ్యమ్మా అంటే రూపాయి పావలా చేసేయడం వల్ల ఆమె సీన్స్ చూడలేక కళ్ళు మూసేసుకుంటారు.

ఈ మధ్య కాలంలో వస్తున్న చిన్న సినిమాల్లో దాదాపు కామన్ గా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బాగుంటున్నాయి. సేం టు సేం ఇందులో కూడా ఆ రెండే సినిమాకి మెజల్ హైలైట్స్. నిర్మాత ఖర్చు పెట్టి పర్మిషన్ తీసిచ్చిన ప్రతి రూపాయికి గ్రాండ్ విజువల్స్ తో సినిమాటోగ్రాఫర్ న్యాయం చేసాడు. అచ్చు పాటలు బాగున్నాయి, అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగా ఇచ్చి చాలా చోట్ల సినిమాని నిలబెట్టడం కోసం ప్రయత్నించాడు. ఎడిటర్ ఏదో తీసారు ఏదో ఎడిట్ చెయ్యాలి అన్న ఆలోచనతో చేసినట్టున్నాడు. సెకండాఫ్ లో ఏకంగా నిద్రపోతూ చేసినట్టున్నాడు అందుకే సినిమా కూడా నిద్రపోయింది. దాంతో ఆడియన్స్ కూడా థియేటర్ లో నిద్రపోతున్నారు. నిర్మాణ విలువలు మాత్రం బాగా రిచ్ గా, గ్రాండ్ గా ఉన్నాయి.

చివరిగా చెప్పాల్సింది ఈ సినిమాకి సూత్రదారుడైన డైరెక్టర్ సత్య గురించి.రాసుకున్న కథలో కొత్తదనం లేకపోగా దానికి ఓ మెసేజ్ జోడించాడు. దాంతో అదే న్యూ స్టొరీ అనేసుకున్నాడు. దానికి నిర్మాత ఓకే చెప్పడంతో ఆ ఆతృతలో స్క్రీన్ ప్లే ని గాలి కొదిలేసాడు. ఇక డైలాగ్స్ సాలలు బాలేవు. డైలాగ్స్ ఆయన రాయడం బదులు హీరో హీరోయిన్ కి సీన్ ఇదని చెప్పి ఆ టైం లో రియలిస్టిక్ గా యేమని పిస్తే అవి మాట్లాడుకోండి అని వదిలేసినా ఇంకా బెటర్ డైలాగ్స్ వచ్చేవేమో.. ఇవన్నీ చెత్తగా ఆన్నా నిజంగా డైరెక్షన్ బాగుంటే సినిమా ఈ రేంజ్ లో వచ్చేది కాదు. కావున డైరెక్టర్ గా కూడా ఫెయిల్ అయ్యాడు. సినిమా ఫ్లాప్ లిస్టులో చేరింది.

ఇటీవల ఓ స్టార్ హీరో చెప్పినట్టు మన దగ్గర ఐదు, నుంచి ఆరు కంటే ఎక్కువ కథలు లేవు ఉన్న వాటిని తిప్పి తిప్పి తీస్తుంటాం అని, సేం టు సేం ఈ సినిమాది అదే పరిస్థితి. మా తాత ముత్తాతల కాలం నాటి కాన్సెప్ట్ కి ఏదో ఒక మెసేజ్ ని తగిలించేసి తీసిన సినిమా ఇది. ఇంతోటి గొప్ప కథని ఆసక్తి కరంగా కూడా చెప్పకుండా సాగదీసి సాగదీసి టీవీ సీరియల్ చేసేసాడు. డైరెక్టర్ సత్య హీరో లుక్, నాకు ఈ టెక్నీషియన్స్ కావాలని నిర్మాత హీరో మీద పెట్టిన ప్రెజర్ లో కొంతఅన్నా ఆయన తీసుకొని కథ స్క్రీన్ ప్లే దైలాస్గ్ మీద పెట్టుంటే బాగుండేది. కథకి అవసరమై చెత్త కామెడీ పెట్టినా ఆడియన్స్ కాస్తో కూస్తో భరిస్తారెమొ కానీ కథకి అవసరం లేకుండా సెపరేట్ ట్రాక్ వేసి సొల్లు కామెడీ చేస్తే మాత్రం తెరలు చించెయాలనిపిస్తుంది. ఈ మూవీలో కామెడీ అలానే ఉంటుంది.

మాములుగా సినిమా బోరింగ్ కొట్టడం వేరు, ఈ సినిమా సెకండాఫ్ చూస్తె బోరింగ్ అనే పదమే తలదించుకునే రేంజ్ లో ఉంటుంది. అలాగే హీరో హీరోయిన్ ద్వారా ఆనందానికి గురవుతున్నాడు అందుకే అతను ఆ అమ్మాయి ప్రేమలో పడ్డాడు అనడానికి ఒక్క ప్రూఫ్ కూడా సినిమాలో లేదు. ఈ మధ్య చాలా సినిమాల్లో బాగుంటున్న సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ తప్ప ఇంకేమీ ఈ సినిమాలో లేవు. ఈ సినిమాకి వెళ్ళడం కంటే హాయిగా ఏ సూపర్ హిట్ మూవీని ఇంకోసారి చూడొచ్చు. దాని వల్ల ఎంటర్ టైనింగ్ ఉంటుంది అలాగే నీ డబ్బు కూడా సేవ్ అవుతుంది.

Naveen Chandra,Rithu,Satya,P Vajrang,Achuనా రాకుమారుడు - పాత కథకి అతకని కొత్త రంగులు..

మరింత సమాచారం తెలుసుకోండి: