Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 6:51 pm IST

Menu &Sections

Search

కొరియర్ బాయ్ కళ్యాణ్ : రివ్యూ

- 1.5/5
కొరియర్ బాయ్ కళ్యాణ్ : రివ్యూ READ THIS MOVIE REVIEW IN ENGLISH

మంచి

  • సినిమాటోగ్రఫీ
  • ఆర్ట్ వర్క్

చెడు

  • సందర్భం పాడు లేకుండా వచ్చే సాంగ్స్
  • ఎడిటింగ్
  • అనవసరమైన రొమాంటిక్ సీన్స్
  • థ్రిల్స్ లేని థ్రిల్లర్ కథాంశం
  • డైలాగ్స్
  • డైరెక్షన్
  • స్లో నేరేషన్
  • స్పూర్తిగా తీసుకున్న హాలీవుడ్ స్టొరీ లైన్

చిత్ర కథ

పికె అలియాస్ పనిలేని కళ్యాణ్(నితిన్) ఎలాంటి పని పాటా లేకుండా ఫ్రెండ్స్ తో కలిసి ఆవారాగా తిరుగుతూ ఉంటాడు. కొరియర్ బాయ్ గా పనిచేసే పికె ఫ్రెండ్స్ నాసా ఓ ఒక రోజు తను వెళ్ళలేక ఒక కొరియర్ డెలివరీ చెయ్యమని నాంపల్లి పంపుతాడు. ఆ ఏరియాలో పికె మన హీరోయిన్ కావ్య(యామి గౌతమ్)ని చూసి ప్రేమలో పడతాడు. ఇక తనని రోజూ కలవడం కోసం అదే కొరియర్ ఆఫీస్ లో కొరియర్ డెలివరీ బాయ్ గా చేరి రోజూ కావ్య వెంటపడుతూ తనని ప్రేమలో పడేస్తాడు. ఈ కథని కాసేపు పక్కన పెడితే సైంటిస్ట్ అయిన అశుతోష్ రాణా 10 సంవత్సరాల నుంచి మానవ కణాలపై పరిశోధన జరుపుతూ ఉంటాడు. ఆ రీసర్చ్ కోసం ఒక 60 మంది గర్బినిలపై రీసర్చ్ చేస్తుంటాడు. ఆ రీసర్చ్ గురించిన కొన్ని సీక్రెట్ వివరాలను ఓ సామాన్యుడు సమాజ సేవ చేస్తూ ప్రజల తరపున పోరాడే సత్యమూర్తి(నాజర్) దృష్టికి తీసుకెళ్లాలని ఆధారాలను కొరియర్ చేస్తాడు. ఆ కొరియర్ మన హీరో పికె చేతికి వస్తుంది. అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది. అశుతోష్ రాణా తనని కాపాడుకోవడం కోసం ఏమేమి చేసాడు.? ఈ అవాంతరాలను అన్నీ ఎదుర్కొని పికె, సత్యమూర్తి చివరికి ఆ మోసాన్ని కనుక్కున్నారా.? లేదా అన్నదే మిగిలిన కథాంశం.?


నటీనటుల ప్రతిభ

ఈ కొరియర్ బాయ్ కళ్యాణ్ అనే సినిమాలో మీరు గుర్తుంచుకోదగిన పాత్రలు అనేవి ఏవీ లేవు. ఒకటి రెండు పాత్రలు తప్ప మిగతా అన్నీ ఉన్నాయంటే ఉన్నాయి అనేలా ఉన్నాయి. మొదటగా హీరో విషయానికి వస్తే కోల్ అండ్ జాయబుల్ టీనేజ్ కుర్రాడిగా నితిన్ మంచి నటనని కనబరిచాడు. తనకిచ్చిన పాత్రలో తన మార్క్ చూపెట్టుకున్నాడు. ఇక చెప్పుకోవాల్సింది నెగటివ్ షేడ్స్ లో కనిపించిన అశుతోష్ రాణా.. తనకి ఇచ్చిన సైంటిస్ట్ పాత్రలో చాలా చక్కని నటనని కనబరిచాడు. తన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. ఈ రెండు పాత్రల క్యారెక్టరైజేషన్స్ మాత్రమే కాస్ట్ క్లియర్ గా ఉన్నాయి. మిగతా ఏ పాత్రలకి సరైన క్లారిటీ లేదు. ఇక హీరోయిన్ యామి గౌతమ్ కి చెప్పుకోదగిన లెంగ్త్ పాత్ర లేదు. ఉన్నంతలో బాగానే చేసింది. ఇక నాజర్, సూర్య, సురేఖ వాని, హర్షవర్ధన్, సత్యం రాజేష్, రవిప్రకాష్, సప్తగిరిలు ఎదో తన పాత్రల పరిధిమేర నటించి వెళ్ళిపోయారు.  

సాంకేతికవర్గం పనితీరు

ముందుగా కొరియర్ బాయ్ కళ్యాణ్ అనే సినిమా కథ ఇంగ్లీష్ మూవీ ‘ప్రీమియం రష్’.. అందులో డెలివరీ బాయ్ ఒక విలువైన ప్యాకేజీ డెలివరీ ఇవ్వడానికి వెళ్తాడు కానీ అక్కడ తెలియనిది ఏమిటి అంటే ఆ ప్యాకేజీలో బ్లాక్ మార్కెట్ కి సంబందించిన కొన్ని కోట్ల మనీ డీటైల్స్ ఉంటాయి.. దానికి మార్పులు చేర్పులు చేసి, ఓ బోరింగ్ ప్రేమకథని జోడించి మనకు అందించాడు డైరెక్టర్ ప్రేమ్ సాయి. దాంతో సినిమా సాగదీయబడి చూసే ఆడియన్స్ కి బోర్ కొట్టేలా చేసింది. ఇక అసలు విషయంలోకి వెళితే ఈ సినిమాని మెయిన్ సూత్రధారి అయిన ప్రేమ్ సాయికి డైరెక్టర్ గా ఇది మొదటి సినిమా.. అలాంటప్పుడు ఓ స్ట్రాంగ్ స్టొరీని తన మొదటి సినిమాకి ఎంచుకుంటారు. కానీ మన డైరెక్టర్ ప్రేమ్ సాయి మాత్రం చాలా సింపుల్ గా ఒక కాపీ స్టొరీని ఎంచుకున్నాడు. ఇలాంటి కథలని మనం ఇప్పటికే చాలా చూసాం, తమిళంలో కూడా తీసారు కాబట్టి ఆ ప్రకారం చూసుకుంటే తమిళంలో దాదాపు 70% సినిమాలు ఇదే ఫార్మాట్ లో వస్తుంటాయి. కావున ప్రేమ్ సాయి మొదటి సినిమా కథ విషయంలో ఇలాంటి సింపుల్ అండ్ మోడిఫైడ్ కాపీ స్టొరీని ఎంచుకోవడం అతను చేసిన మొదటి తప్పు.. సరే ఇలాంటి కథలకి కథనం మరియు నేరేషన్ అనేదే ప్రధానం. ఆ విషయంలో అయినా సరైన కేర్ తీసుకున్నాడా అంటే అదీ లేదు.. తూ బోరింగ్ కథనం, అనవసరపు రొమాంటిక్ ట్రాక్, దానికి తోడు నవ్వించలేకపోయిన కామెడీ. వీటన్నిటితో పాటు ఎక్కువైన సాంగ్స్.. ఓవరాల్ గా కథలో అతని దగ్గర ఉన్న స్ట్రాంగ్ పాయింట్ సెకండాఫ్ లో వచ్చే ఓ 20 నిమిషాల చేజ్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ మాత్రమే సినిమాకి సేవ్ పాయింట్ కూడా.. మిగతా అంతా సినిమాకి పెద్దగా హెల్ప్ కాని డమ్మీ పీస్ లాంటిదనమాట.. ఇక సినిమా ఫ్లో విషయంలోకి వెళితే సినిమా మొదలై పాత్రల పరిచయం అయిన తర్వాత ఎదో సాగుతోంది అంటే సాగుతోంది అన్నట్టు ముందుకు వెళుతుంటుంది. దానికి తోడు పాటలు వరుసగా వస్తూ ఉంటాయి. సినిమా నిడివి మొత్తమా 104 నిమిషాలు. అందులో సుమారు 30 నిమిషాలకి పైనే పాటలు ఉన్నాయి. మొదటి అర్ధ భాగంలో ఊ అంటే ఓ పాట, ఆ అంటే ఓ పాట.. చూసే ఆడియన్స్ ఏమో ఎందుకురా అయ్యా అన్ని పాటలు కథలోకి వెళ్ళవయ్యా అని దీనంగా తెరవైపు చూస్తుంటారు. ఇక సెకండాఫ్ లో కాట్స కథలోకి వెళ్ళడం క్లైమాక్స్ లో వచ్చే చేజింగ్ ఎపిసోడ్ వల్ల ఆడియన్స్ కాస్త రిలాక్స్ ఫీలింగ్ కి వచ్చి సినిమాలో ఇన్వాల్వ్ అవుతారు. అలా అనిపించే లోపే హడావిడిగా క్లైమాక్స్ కి తెచ్చి ముగించేసారు.  ఓవరాల్ గా కథ - కథనం – నేరేషన్ విషయంలో ప్రేమ్ సాయి అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. ఇక డైరెక్టర్ గా అయితే సినిమాలోని పాత్రలను ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడంలో ఫెయిల్ అయ్యాడు. నటీనటుల నుంచి నటనను రాబట్టుకోవడంలో కాస్త సక్సెస్ అయ్యాడు. వీటన్నిటితో పాటు డైరెక్టర్ రాసుకున్న డైలాగ్స్ కూడా అస్సలు బాగాలేవు.


సత్య పోన్మర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అతని విజువల్స్ బాగుండడం వలనే ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ చాలా వరకూ బెటర్ గా ఫీలవుతారు. వరుసగా పాటలు వచ్చి ఇబ్బంది పెట్టినా పాటలని షూట్ చేసిన విధానం, చూపించిన విజువల్స్ మాత్రం సూపర్బ్ గా ఉన్నాయి. అలాగే అతని విజువల్స్ ఆడియన్స్ కి రియలిస్టిక్ ఫీలింగ్ ని కలిగిస్తాయి. కార్తీక్- అనూప్ రూబెన్స్ అందించిన సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. కానీ సినిమాలో ప్లేస్ మెంట్ మిస్ అయ్యింది. ఇక సందీప్ చౌత అందించిన నేపధ్య సంగీతం సినిమా ఫ్లోకి పెద్దగా సింక్ అవ్వలేదు. ఆర్ట్ వర్క్ చాలా చాలా బాగుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చెప్పుకునే స్థాయిలో లేదు. ఉన్నదే షార్ట్ సినిమా దాన్ని ఇంకా షార్ట్ చేయాల్సింది. ముఖ్యంగా సాంగ్స్ ని చాలా వరకూ కట్ చేసి ఉండచ్చు.  ‘ఫోటాన్ కథాస్’ ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే కానీ చెప్పుకునేంత స్థాయిలో లేవు.  

చిత్ర విశ్లేషణ

మామూలుగా ఒక రొమాటిక్ థ్రిల్లర్ తీయాలి అంటే రెండు విధానాలు ఉన్నాయి.. అందులో మొదటిది.. హీరో – హీరోయిన్ మధ్య రొమాంటిక్ అండ్ ఎంటర్టైనింగ్ లవ్ ట్రాక్ రాసుకొని, దానికి మాంచి కామెడీని జోడించి చివర్లో యాక్షన్ ఎపిసోడ్స్ మరియు థ్రిల్స్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసి ముగించడం లేదా పాత్రలని చాలా డిఫరెంట్ వేలో రాసుకొని వాటిని ప్రజంట్ చేస్తూ సీరియస్ గా కథలోకి తీసుకెళ్ళి రాసుకున్న పాత్రల చుట్టూ ఒక డేంజరస్ వలయాన్ని సృష్టించి అక్కడ స్టన్నింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ మరియు థ్రిల్స్ తో ఆకట్టుకోవడం. ఈ సినిమా రొమాంటిక్ థ్రిల్లర్ అనే జానర్ లో వచ్చినా ఆ రెండింటిలో ఏ ఫార్మాట్ ని ఫాలో అవ్వలేదు. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఎటూ కాకుండా పోయింది. స్క్రిప్ట్ లో స్ట్రాంగ్ నెస్ లేదు, పాత్రల డిజైనింగ్ లో క్లారిటీ లేదు, అంతకు మించి ఆన్ స్క్రీన్ లో ఏ విషయంలో మేజిక్ వర్కౌట్ అవ్వలేదు. కామన్ ఆడియన్ కోరుకునే ఎంటర్ టైన్మెంట్ అస్సలు లేదు. ఓవరాల్ గా కొరియర్ బాయ్ కళ్యాణ్ ఏ విషయంలోనూ ఆడియన్స్ ని సరిగా మెప్పించకపోవడం వలన చూసే ఆడియన్స్ బోర్ ఫీలవ్వడమే కాక ఇదొక పసలేని సినిమా అంటూ బయటకి వస్తారు.

కాస్ట్ అండ్ క్రూ

4 / 5 - 7815
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS

Bollywood

View all