ఏమి లేవు ఏమి లేవు చాలా ఉన్నాయి

కేరళలో నివసించే తెలంగాణా శకుంతలకి నలుగురు కొడుకులు. తన నలుగురు కొడుకులని తన బంధువులకే ఇచ్చి పెళ్లి చేస్తే తన ఆస్తి ఎక్కడికీ పోదని కొడుకుల పెళ్లిల్లన్ని బంధువులతోనే చేస్తుంది. అందరిలానే తన మనవడు కార్తీక్(విష్ణు ప్రియన్)ని తన తమ్ముడి కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయిస్తుంది. కానీ మన కార్తీక్ మాత్రం అమ్మాయిలన్నా, పెళ్లి అన్నా ఆమడ దూరంలో ఉంటాడు.

కార్తీక్ బామ్మ ఓ రోజు పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తుంటే కార్తీక్ తనకి ఆ పెళ్లి ఇష్టం లేదని, తను ఎప్పుడో పెళ్లి చేసుకున్నానని చెప్తాడు. దాంతో కార్తీక్ ఇంట్లో వాళ్ళు తన భార్యని ఇంటికి తీసుకొని రమ్మంటారు. దాంతో కార్తీక్ చేసేదేమీ లేక వేశ్య అయిన మధుమతి(ఉదయ భాను)ని డబ్బు ఇస్తామని చెప్పి ఒప్పించి తన భార్యగా ఇంటికి తీసుకెళతాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగిన మార్పులేంటి? చివరికి మధుమతి వేశ్య అని ఇంట్లో వాళ్ళకి తెలిసిందా? లేదా అన్నది మీరు వెండి తెరపైనే చూడాలి..

ఉదయభాను పాత్ర చుట్టూ ఈ కథ తిరుగుతుంది కాని పాత్రకు తగ్గ స్థాయిలో ఉదయభాను నటించలేకపోయింది. కాని ఉదయభాను ని ఎందుకయితే ఎంచుకున్నారో ఆ కారణం సఫలం అయ్యింది. తెలంగాణా శంకుతల తనదయిన శైలి లో నటించి ఆకట్టుకుంది. ఇక విష్ణు ప్రియన్ నటన జస్ట్ పరవాలేదు. దీక్ష పనత్ జస్ట్ ఎక్స్ పోసింగ్ కి మాత్రమే ఉపయోగించుకున్నారు. ఆమె కూడా అలానే నటించింది. మిగిలిన అందరు నటులు ఏదో ఉన్నాం అనిపించారు... దర్శకుడు రాజ్ శ్రీధర్ ఏ ఒక్క విభాగంలో కూడా సఫలం కాలేకపోయాడు కథ పాతదే కథనంలో కొత్తదనం లేదు. ఇలాంటి చిత్రానికి ప్రాణం అయిన డైలాగ్స్ అసలు బాగోలేదు. అసలు ఈ సినిమాలో ఒక్క సన్నివేశానికి కూడా అర్ధం లేదు. సినిమాటోగ్రఫీ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. మ్యూజిక్ ఏ మాత్రం ఆకట్టుకోలేదు నేపధ్య సంగీతం కూడా బాలేదు. ఎడిటింగ్ కూడా అందరిలానే బాలేదు. నిర్మాణ విలువలు యావరేజ్.

వేశ్య పాత్ర చెయ్యడం అంటే ఛాలెంజ్ ఈ మధ్య కాలంలో కనుమరుగయిన కొంతమంది నటీమణులు ఇదే ఆయుధంగా ఉపయోగిస్తున్నారు అదే పంథాలో మన ముందుకి వచ్చింది బుల్లి తెర ప్రముఖ యాంకర్ ఉదయభాను. పాత్ర అయితే చాలెంజింగ్ ఉంది కాని నటన కూడా అదే స్తాయిలో ఉండాలి కాని ఒక్కరి నటన కూడా ఆ స్థాయిలో ఉండదు. అసలే చిత్రం అదోలా ఉందంటే ఇక సెన్సార్ బ్లర్ సీన్స్ సగటు ప్రేక్షకుడిని చిరాకు పెట్టిస్తుంది.

ఇక ఈ చిత్రం గతంలో చుసిన చాలా చిత్రాలను పోలి ఉండటం మరో మైనస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మైనస్ లే వస్తాయి ఈ చిత్రంలో ఏదయినా ప్లస్ చెప్పుకోవాలంటే ఒక్క ఉదయ భాను గురించి మాత్రమే చెప్పుకోవాలి. ఉదయ భాను ఉందన్న ఒక్క కారణంతోనే ఈ చిత్రాన్ని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక ఈ సినిమా ఏ సెంటర్ లో చూడటం కష్టం బి మరియు సి లలో మాత్రమే చూడగలిగే చిత్రం ... మీరు ఏ వర్గానికి చెందిన వారో మీకు తెలిసే ఉంటుంది కాబట్టి చూడటం చూడకపోవడం మీ ఇష్టం ....

Udaya Bhanu,Vishnu Priyan,Raj Sridhar,Rani Sridharమధుమతి - మతి "పోయింది"

మరింత సమాచారం తెలుసుకోండి: