సినిమాటోగ్రఫీ,సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ,సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కీన్ ప్లే,డైరెక్షన్, కొంతమంది నటీనటుల పెర్ఫార్మన్స్, నో ఎంటర్టైన్మెంట్

కామెడీ పీస్ లాంటి ఇద్దరు ఈ కథని మొదలు పెడతారు. వాళ్ళే పవన్(ధన్ రాజ్), ప్రశాంత్(వేణు). ముందు ప్రశాంత్ విషయానికొస్తే... మొదటి ప్రేమకథ షురూ - సూర్య(రాజ్ అర్జున్)-శ్రీ లక్ష్మీ(కృతిక సింగాల్)లు ఐదు సంవత్సరాలుగా ప్రెమించుకుంటుంటారు. కానీ పెళ్లి దగ్గర మాత్రం సూర్య తన చెల్లికి అయ్యాకే చేసుకుంటానని అంటుంటాడు. మరో వైపు శ్రీ లక్ష్మీకేమో వాళ్ళ పారెంట్స్ వరుసగా సంబందాలు చేస్తుంటారు. అదే సమయంలో ఓ చిన్న కారణం వల్ల సూర్య - శ్రీ లక్ష్మీ విడిపోతారు.

కట్ చేసి పవన్ విషయానికి వస్తే.. రెండవ ప్రేమకథ షురూ - అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ డైరెక్టర్ అవ్వాలనుకునే సంతోష్ (రోహిత్) అనుకోకుండా కలిసిన కాస్ట్యూమ్ డిజైనర్ దివ్య(నేహ దేశ్ పాండే)తో ప్రేమలో పడతాడు. తను ఎదుర్కొన్న ఓ సమస్య వల్ల దివ్యని దూరం చేసుకుంటాడు.

ఇలా విడిపోయి ఉన్న వీరి జీవితాల్లోకి సడన్ గా బిగ్గెస్ట్ అండ్ రిచ్ ఇండస్ట్రియలిస్టు అయిన తిలక్(నాగబాబు) ప్రవేశిస్తాడు. అక్కడి నుండి వారి జీవితాలు ఎలా టర్న్ అయ్యాయి? అసలు ఈ తిలక్ ఎవరు? చివరికి సూర్య - శ్రీ లక్ష్మీ, సంతోష్ - దివ్య ప్రేమ కథలు ఎలా ముగిసాయి? మొదటి నుంచి ఈ ప్రేమకథలను చెబుతున్న పవన్, ప్రశాంత్ లకి ఈ కథతో సంబంధం ఏమిటి అనేది తెలియాలంటే మేరు సినిమా చూడాల్సిందే.

ఈ చిత్రంలో నటించిన హీరో, హీరోయిన్స్ కొత్తవారే.. కావున ఒక్కొక్కరు ఏ రేంజ్ లో చేసారో ఇప్పుడు చెప్తా.. ఇద్దరు హీరోస్ లో మొదటగా చెప్పుకోవాల్సింది రోహిత్ గురించి. ఇతను చూడటానికి స్టైలిష్ గా ఉన్నాడు. అలాగే నటన కూడా పరవాలేదనిపించాడు. ఇతనికి ఇంకాస్త పదును పెడితే ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక మరో హీరో రాజ్ అర్జున్.. ఇతనికి యాక్టింగ్ లో ఇంకా అ,ఆ లు కూడా రాకపోవడంతో నటనలో అతను చూపించిన విశ్వరూపం ప్రేక్షకులను భయపెట్టిందనే చెప్పాలి. అతను 90% ఒకటే ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు కానీ ఆడియన్స్ మాత్రమే అతను నవ్వాడు, ఏడ్చాడు, కోప్పడ్డాడు ఇలా పలు రాకల ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవాలి.

ఇది ఆడియన్స్ కి అగ్ని పరీక్షే అనిచెప్పాలి. ఇక హీరోయిన్స్.. కృతిక సింఘాల్.. ఈ అమ్మాయి చూడటానికి బాగానే ఉంది. గ్లామర్ పై పెట్టిన శ్రద్ధ కాస్త ఎక్స్ ప్రెషన్స్ పై కూడా శ్రద్ధ పెట్టుంటే బాగుండేది. నేహ దేశ్ పాండే నటన పరంగా, లుక్స్ పరంగా బిలో యావరేజ్ అని చెప్పాలి. ఇక నాగబాబు తన పాత్రకి న్యాయం చేసాడు. ఇక ధన్ రాజ్, వేణులు నవ్వించకపొగా కొన్ని చోట్ల కాస్త చిరాకు పెట్టారు. మిగిలిన నటీనటులు ఓకే పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

నటీనటుల విభాగంలో చెప్పుకోవడానికి ఏం లేకపోయినా సాంకేతిక అంశాల్లో మాత్రం చెప్పుకోవడానికి రెండు డిపార్ట్ మెంట్స్ ఉన్నాయి. మొదటిది సినిమాటోగ్రఫీ.. ప్రతి ఫ్రేం ని ఆడియన్స్ ఫ్రెష్ గా ఫీలయ్యేలా తన వంతు తానూ కృషి చేసాడు. మొత్తం హైదరాబాద్ లోనే షూట్ చేసినా గానీ కొత్త ప్లేస్ అన్నట్లు చూపించాడు. ఇక రామ్ నారాయణ్ అందించిన మ్యూజిక్. రెండు పాటలు బాగున్నాయి, సీన్ అనుకున్న స్థాయికి లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మంచి రేంజ్ కి కొట్టాడు. ఎడిటర్ ఏమో సినిమా రెండు గంటలే ఉంది దాన్ని ఇంకా కత్తిరిస్తే చిన్నదై పోతుందనుకున్నాడేమో ఎక్కడా కత్తెర వాడలేదు.

కనీసం రిపీటెడ్ గా అనిపిస్తున్నాయి అన్న సీన్స్ అన్నా కత్తిరించి ఉండొచ్చు గా అనేది ఆడియన్స్ బాధ. ఇక డైలాగ్స్.. ఒక్కటికూడా ఆకట్టుకునేలా లేదు. శేఖర్ కమ్ముల దగ్గర శిష్యరికం చేసిన తుమ్మ కిరణ్ ఆయన ఫార్మాట్ లోనే సినిమా చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆయన క్రియేట్ మ్యాజిక్ ని ఇతను క్రియేట్ చేయలేకపోయాడు. కథలో కూడా కొత్తదనం ఏమీ లేదు. స్క్రీన్ ప్లే ఏమో మొదలైన చోటే ఉంది పోయింది ఎంత గుంజినా ముందుకు కదలకపోవడంతో సినిమా మరింత స్లో అండ్ బోరింగ్ గా తయారైంది. ఇక డైరెక్టర్ గానే కొన్ని చోట్ల పరవాలేదనిపించాడు. నిర్మాణ విలువలు ఓకే.

శేఖర్ కమ్ముల అసిస్టెంట్ అని చెప్పుకుంటూ తెర మీదకు వచ్చిన దర్శకుడు ఆయన స్థాయిలో పది శాతం అయినా ఆకట్టుకోలేకపోయాడు నటీనటులు కొత్త వాలు కాని వాళ్ళ నుండి ఆ ఫ్రెష్ ఫీల్ రాబట్టుకోలేకపోయాడు. వీరి నటనా విశ్వరూపం చూడలేక ప్రేక్షకులు కళ్ళు మోసెసుకున్నరు కొన్ని సన్నివేశాలలో సన్నివేశం అర్ధం కాకా హావ భావం అర్ధం కాక ప్రేక్షకుడు తల గోక్కున్నాడు. రెండవ అర్ధ భాగంలో వచ్చే ట్విస్ట్ లను మొదటి అర్ధ భాగంలో పసిగట్టేయచ్చు ఇక కథనం ఎంతకీ కదలదు జోడెద్దు బండికి కట్టినట్టు కదిలే కథనం ఆసక్తికరంగా ఉండకపోగా ప్రేక్షకుడికి జో కొట్టి పడుకోబెడుతుంది. అప్పటికే తెలిసిపోయిన ట్విస్ట్ ని చివర్లో చెప్పేసి అయిపోయింది అనిపించేసి దర్శకుడు ఎం సాదించాలి అనుకున్నాడో ఆయనకే తెలియాలి .. ఈ చిత్రాని ఎందుకయినా చూడాలి అనుకుంటే సినిమాటోగ్రఫీ మరియు నేపధ్య సంగీతం కోసం మాత్రమే చూడాలి ఎందుకు చూడకూడదు అంటే చాలా కారణాలే ఉన్నాయి... తరువాత మీ ఇష్టం ...

Raj Arjun Reddy,Abha singhal,Thumma Kiran,Raja Reddy,Neha Deshpande రొటీన్ అండ్ బోరింగ్ లవ్ స్టోరీస్

మరింత సమాచారం తెలుసుకోండి: