కార్తీ,కామిడి,మ్యూజికకార్తీ,కామిడి,మ్యూజికస్క్రీన్ ప్లే ,డ్రాగ్డ్ నారేషన్,ఎడిటింగ్

సుదీర్(కార్తి) మరియు అతని స్నేహితుడు పరశురాం(ప్రేమ్గి అమరన్) మహీంద్రా కంపెనీ లో పని చేస్తుంటారు, పరశురాం కి ఏది నచ్చితే అదే నచ్చుతుంటుంది సుదీర్ కి, అలానే సుదీర్ ప్రియాంక(హన్సిక మోత్వాని) తో ప్రేమలో పడతాడు. కథ ఇలా సాగుతుండగా ఒకరోజు సుదీర్ మరియు పరశురంని మాయ(మ్యాండి థాకర్) లిఫ్ట్ అడుగుతుంది, ఆరోజు రాత్రి గడిచాక వారి ముగ్గురి జీవితాల్లో అనుకోని మార్పులు సంభవిస్తాయి.

ఆరోజు ఉదయం లేవగానే వారి పక్కన ఒక శవం ఉంటుంది, మాయ కనపడకుండా పోతుంది అసలు ఎం జరిగిందో అర్ధం కాని పరిస్థితిలోకి సుదీర్ మరియు పరశురామ్ వెళ్ళిపోతారు. ఇలాంటి పరిస్థితిలో సి బి ఐ అధికారి రియాజ్ అలీ(సంపత్) ఈ కేసు యొక్క పరిస్థితిని అంచనా వేస్తాడు, ఈ హత్యకి మరియు రాజకీనాయకుడు వరదరాజులు(నాజర్) కిడ్నాప్ కి ఏదో సంభంధం ఉందని నమ్మిన రియాజ్ అలీ ఆ దిశగా విచారణ కొనసాగిస్తాడు చివరకి ఏమయింది అన్నదే మిగిలిన కథ..

కార్తి ఈ చిత్రంలో ప్లే బాయ్ పాత్ర ధరించాడు, ఈ పాత్ర తనకోసమే రచించినట్టు అన్నట్టుగా ఉంది అయన నటన, హన్సిక నటనా పరంగా పెద్ద చెప్పుకోదగ్గ పాత్ర కాకపోవడంతో ఉన్నంతలో తనకు వచ్చినంత నటన ప్రదర్శించి వెళ్లిపోయింది. ప్రేమ్గి అమరన్ కొన్ని సన్నివేశాలలో బాగానే నటించినా కొన్ని సన్నివేశాల విషయానికి వచ్చేసరికి ఆకట్టుకోలేకపోయారు. మ్యాంది థాకర్ తన పాత్రకి ఉన్న పరిధి మేరకు చాలా బాగా ఆకట్టుకుంది. నాజర్ మరియు మధుమతి లు ఉన్నంతలో పరవలేధనిపించారు. ఇక సంపత్ సిబి ఐ అధికారి గా ఆకట్టుకున్నారు.

ఈ చిత్రంలో ప్రధాన భాగానికి చెందిన కథ "హాంగ్ ఓవర్" అనే చిత్రం నుండి ప్రేరణ పొందినది గా తెలుస్తుంది కాని ఆ కథకు తనదైన శైలిలో కథనాన్ని రచించడంలో వెంకట్ ప్రభు విజయం సాదించాడనే చెప్పుకోవాలి. క్లైమాక్స్ సన్నివేశాలను మరింత సున్నితంగా హేండిల్ చేసి ఉండాల్సింది. శశాంక్ వెన్నెలకంటి అందించిన డైలాగ్స్ జస్ట్ ఓకే అనిపించాయి. యువన్ శంకర్ రాజ అందించిన సంగీతం బాగానే ఉంది కాని ఒక్క పాట కూడా తెర మీద ఆకట్టుకోలేకపోయింది నేపధ్య సంగీతం బాగుంది. శక్తీ సరవనన్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది . ఎడిటర్ ఇంకాస్త పదునుగా సన్నివేశాలను కత్తిరించి ఉండాల్సింది. స్టూడియో గ్రీన్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఈ చిత్రంలో ప్రధాన విషయం అయిన సిస్టర్ సెంటిమెంట్ మరియు విచారణ వంటి విషయాలు ప్రేక్షకుడి కి చేరుకోలేకపోయాయి సీరియస్ సన్నివేశాలలో కామెడీ ని జొప్పించడంతో ఆయా సన్నివేశాల ఇంపాక్ట్ ప్రేక్షకుడి దాకా చేరలేదు. మంచి కాన్సెప్ట్ దర్శకత్వం వలన చెడిపోవడం అనే పరిస్థితికి ఈ చిత్రం నిలువెత్తు సాక్ష్యం, చూడటానికి రిచ్ గా ఉండే ఈ చిత్రం లో ప్రధానంగా ఏ పాయింట్ లేదు ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి సకల ప్రయత్నాలు చేసారు కాని ఏవి కూడా ఫలించలేదు, కథ కరెక్ట్ గ చెప్తే సరిపోతుంది అన్న విషయాన్ని మరిచిపోయారు దర్శకుడు, మొదటి పదిహేను నిముషాలు నవ్విన ప్రేక్షకుడు ఆ తరువాత నవ్వడానికి ఏడవడానికి మధ్యలో మిగిలిపోతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చిత్రం ఈ మధ్య కాలంలో వచ్చిన కార్తి చిత్రాలకన్నా బాగానే ఉన్నా 'బాగుంది' అని చెప్పుకోడానికి సరిపోయే చిత్రం అయితే కాదు ఇంకా చాలా బాగుందా గలిగిన చిత్రం వెంకట్ ప్రభు నేరేషన్ వలన జస్ట్ ఓకే చిత్రంగా మిగిలిపోయింది. ఒక్కసరయితే చూడగలం ఈ చిత్రాన్ని తరువాత మీ ఇష్టం

Karthi,Hansika Motwani,Venkat Prabhu,K. E. Gnanavel Rajaబిరియాని - ధమ్ కాదిది 'సాంబార్' బిరియాని

మరింత సమాచారం తెలుసుకోండి: