కాన్సెప్ట్, రెండవ అర్ధ భాగం,నటీనటుల పనితీరు,నేపధ్య సంగీతంకాన్సెప్ట్, రెండవ అర్ధ భాగం,నటీనటుల పనితీరు,నేపధ్య సంగీతంఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగడం

కార్తీక్ (సచిన్) మరియు అదితి (పార్వతి మీనన్) ప్రేమించుకుంటూ ఉంటారు , కార్తీక్ కి తను ఎంతగానో ఇష్టపడే జర్నలిస్ట్ ఉద్యోగం వస్తుంది, హీరో అయిన గౌతం కృష్ణ(ప్రకాష్ రాజ్) నటించిన చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది, లంచం తీసుకొని పట్టుబడిన సత్యమూర్తి (చేరన్) తిరిగి ఉద్యోగంలో చేరడానికి సిద్దమవుతాడు. కార్తీక్ కి గౌతం కృష్ణ చిత్రం విడుదల సందర్భంగా ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుంది దాని కోసం వెళ్తున్న కార్తీక్ యాక్సిడెంట్ అవుతుంది. ఇదిలా ఉండగా గౌతం కృష్ణ కూతురు అయిన రియకి గుండె మార్పిడి చెయ్యవలసి వస్తుంది.

అదితి,కార్తీక్ తల్లిదండ్రులను ఒప్పించి కార్తీక్ గుండె ను రియ కి ఇచ్చేలా ఏర్పాటు చేస్తుంది కాని హైదరాబాద్ లో ఉండే కార్తీక్ గుండె కోదాడలోని హాస్పిటల్ కి గంటన్నరలో తీసుకెళ్ళాలి ఈ పనిని ట్రాఫిక్ కమిషనర్ అయిన సుందర పాండియన్ (శరత్ కుమార్)కి అప్పగిస్తారు. అక్కడ నుండి ఈ మిషన్ మొదలవుతుంది ఈ మిషన్ కోసం డ్రైవర్ గా సత్యమూర్తి వెళ్తాడు అదే వాహనంలో డాక్టర్ గా రాబిన్ (ప్రసన్న) కూడా వెళ్తాడు ఇలా మిషన్ మొదలవగానే చోటుప్పల్ దగ్గర వాహనం మిస్ అవుతుంది. వాహనం ఏమయ్యింది? గుండె అనుకున్న సమయానికి హాస్పిటల్ కి చేరుకుందా? లేదా? అనేది తెర మీద చూడవలసిన అంశాలు ..

పోలీసు కమీషనర్ పాత్రలో శరత్ కుమార్ చాలా బాగా నటించారు. ఆ పాత్రకు కావలసిన బలం అయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగా సమకూర్చింది. రాధిక శరత్ కుమార్ , ఒక స్టార్ నటుడి భార్య పరిస్థితి ఎలా ఉంటుందో కళ్ళకు కటినట్టు చూపించారు. కానిస్టేబుల్ పాత్రలో నటించిన చేరన్ తనదయిన శైలిలో ఆకట్టుకున్నారు.పశ్చాతాప పడుతున్న పోలిస్ ఆఫీసర్ పాత్రలో అయన సరిగ్గా సరిపోయారు. ప్రసన్న డాక్టర్ పాత్రలో చాలా బాగా నటించారు. అదితి పాత్రలో కనిపించిన పార్వతి మీనన్ సెంటిమెంట్ సన్నివేశాలలో చాలా బాగా నటించింది. ప్రత్యేక పాత్రలో వచ్చిన సూర్య చిత్రం లో రెండు నిముషాలు మాత్రమే కనిపించడం నిజంగా నిరాశపరిచే విషయం. ఇంకా ఈ చిత్రంలో నటించిన పలువురు నటులు వారి పాత్రలకు తగ్గ ప్రదర్శన కనబరిచారు.

మలయాళ చిత్రం అయిన ట్రాఫిక్ ని తమిళ్ లో రీమేక్ గా చేసారు షహీద్ ఖాదర్, చాలా కొత్తరకమయిన ప్లాట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం కోసం బాబి మరియు సంజయ్ అందించిన కథనం చాలా వేగంగా సాగుతుంది మొదటి అర్ధ భాగం కథేంటో చెప్పడానికి చాలా సమయం తీసుకొని నెమ్మదిగా సాగినా ఒక్కసారి కథలోకి ప్రవేశించాక ఎక్కడ కథనం వేగం తగ్గలేదు. ఎడిటింగ్ చాలా బాగుంది కాని మొదటి అర్ధ భాగంలో కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటె మరింత బాగుండేది. సినిమాటోగ్రఫీ పరవాలేదు. మెజో జోసెఫ్ అందించిన పాటలు అంతగా ఆకతుకొలెకపొయినా అయన నేపధ్య సంగీతం చాలా బాగుంది కొన్ని సన్నివేశాలకు కావలసినంత బలం చేకూర్చింది ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం దగ్గర అయన పనితీరు ప్రశంసనీయం. నిర్మాణ విలువలు బాగానే ఉన్న డబ్బింగ్ విషయం లో మరింత అంటే చాలా జాగ్రత్త వహించి ఉండవలసింది.

ఈ చిత్రం మాతృక "ట్రాఫిక్" కన్నా తమిళంలో వచ్చిన "చేన్నయిల్ ఒరు నాల్ " చిత్రం చాలా బాగుంది అలానే ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ కాకుండా రీమేక్ చేసి ఉంటె చాలా బాగుండేది అప్పుడు ఇలా రెండు నిముషాలు మాత్రమే ఉండే సూర్య ని చూపెట్టి ప్రచారం చేసుకునే అవసరం వచ్చి ఉండేది కాదేమో. అంతే కాకుండా ఇలాంటి డబ్బింగ్ చిత్రాలు ఎన్ని రోజులు థియేటర్ లో ఉంటాయో అందరికి తెలిసిందే ఇలాంటి మంచి కాన్సెప్ట్ మరియు మంచి కథనం ఉన్నటువంటి చిత్రాలు అల వెళ్ళిపోకుండా ఉండాలంటే రీమేక్ చెయ్యడమే మంచి పని.. ఇక చిత్ర విషయానికి వస్తే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ నటీనటుల పనితీరు ఒక్కో నటుడు కనబరిచిన పనితీరు చాలా అద్భుతం. దర్శకుడు మొదటి అర్ధ భాగం మొత్తం కథ ని వివరించే పనికి కేటాయించి చాలా నెమ్మదిగా కదిపాడు అసలు కథ అయిన రెండవ అర్ధ భాగం చాలా వేగంగా నడిపించాడు మధ్యలో కాస్త నెమ్మదించినా క్లైమాక్స్ వచ్చేసరికి "థ్రిల్లింగ్ ఫాక్టర్" తిరిగి చిత్రంలో కి ప్రవేశిస్తుంది.

నిజానికి చివర్లో సూర్య చేత మెసేజ్ చెప్పించాల్సిన అవసరం లేదు ఆ సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెట్టినా మంచి ఎవరు చెప్పిన మంచిదే కదా అనుకోని చూడవలసిందే, కొత్తదనం కోరుకునేవారికి చాలా కొత్తదయినా ప్లాట్ తో నడిచే ఈ చిత్రం కచ్చితంగా సంతృప్తి ని ఇస్తుంది. మీరు కొత్త రకమయిన చిత్రాలను చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడవలసిన చిత్రం "ట్రాఫిక్" మంచి చిత్రాలు అప్పుడప్పుడే వస్తుంటాయి మిస్ అవ్వకుండా చూడాలి అనుకునేవాళ్లు దగ్గరలోని థియేటర్ కి వెళ్ళిపొండి. ...

Sarath Kumar,Prakash Raj,Shahid Khader,Tummalapalli Rama Satyanarayana,Radhika Sarathkumar.మంచి ఉద్దేశంతో వచ్చిన మంచి థ్రిల్లర్ ...

మరింత సమాచారం తెలుసుకోండి: