కేవలం 2 గంటలు మాత్రమే ఆడియన్స్ ని హింసించడం..కేవలం 2 గంటలు మాత్రమే ఆడియన్స్ ని హింసించడం..తారకరత్న మూవీస్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలిసి కూడా సినిమాకి వెళ్ళడం,బోరింగ్ స్క్రీన్ ప్లే. లంగోటి వేసుకునే పిల్లాడుకూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది,ఏం డైలాగ్ చెబుతాడు అని ఊహించగలడు. నటీనటుల వీక్ పెర్ఫార్మన్స్, ఇంకా చాలా ఉన్నాయి...

అలెగ్జాండర్(తారకరత్న) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ప్లస్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ . వైజాగ్ లో ఉన్న రౌడీలని అందరినీ ఎరిపారేస్తూ ఉన్న అలెగ్జాండర్ ని హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేసాడు. అలా హైదరాబాద్ వచ్చిన అలెగ్జాండర్ కి హైదరాబాద్ లో కోటప్ప(జయప్రకాశ్ రెడ్డి), జిన్నా భాయ్ (రవిబాబు) చేస్తున్న ఇల్లీగల్ బిజినెస్ ల గురించి తెలుస్తాయి. అలాగే అమ్మాయిలని ట్రాప్ చేసి బిజినెస్ చేస్తున్నారనితెలుస్తుంది. అలా తెలుసుకున్న ఆగడాలను అలెగ్జాండర్ ఎలా అరికట్టాడు? ఎలా ఆపగలిగాడు? అనేది మీరు వెండితెరపై చూడాలి.

ముందుగా హీరో తారకరత్న. ఆయన తీసిన వరుసగా సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద అట్టర్ ఫ్లాప్స్ అవుతున్నా సరే ఆశని వీడకుండా, ధైర్యంగా సినిమాలు తీస్తున్నందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ప్రతి సినిమాలోలానే ఈ సినిమాలో తారకరత్న పెర్ఫార్మన్స్ లో అసలు మార్పులేదు. ఎవరన్నా తారకరత్న పెర్ఫార్మన్స్ ఎలా ఉంది అంటే 'యాసిటీజ్ గా ఉంది. పాత సినిమాల కాపీ ఇస్తే ఏ ఎక్స్ ప్రెషన్ కావాలో అది తీసేసుకుంటారు సార్' అన్నట్టు ఉంది. తారకరత్నలో ఏమన్నా మార్పు ఉందా అంటే అది ఒక్క డైలాగ్ డెలివరీ మాత్రమే కొన్ని చోట్ల డైలాగ్ డెలివరీ బాగుంది. కోమల్ ఝా సినిమాలో పాటలో వస్తుంది పాట అయిపోగానే కనపడదు. కావున కోమల్ ఝా పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకోవడానికి ఏమీలేదు. రవిబాబు, జయప్రకాష్ రెడ్డిలు తమ పాత్రలకి జస్ట్ యావరేజ్ అనే నటనని చూపించారు. మిగిలిన నటీనటులు జస్ట్ ఓకే.

సాంకేతిక అంశాల్లో ఎవరి దగ్గర నుంచి మొదలు పెట్టి ఎవరితో ఎవరితో చెయ్యాలో అర్థం కావడం లేదు.. ముందుగా మూవీకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అంటారు కాబట్టి మొదలు పెడతా..రాజా రెడ్డి రాసుకున్న ఈ కథ మా నాన్నల కాలం నుండి చూస్తున్నాం. ఆ పాత చింతకాయ పచ్చడి లాంటి కథకి పై పై రంగులు కూడా వేయకుండా తీసిన సినిమా అలెగ్జాండర్. సరే కథ పాతది, స్క్రీన్ ప్లే అన్నా కొత్తగా రాసుకున్నాడా అంటే అదీ లేదు కొత్తగా రాయకుండా మరీ చెత్తగా రాయడం వల్ల సినిమా దొబ్బింది. ఇవి రెండూ సరిగా చేయలేక హుస్సేన్ సాగర్లో కలిపేసినా నటీనటుల నుండి పెర్ఫార్మన్స్ కూడా రాబట్టుకోలేకపోయాడు. దాంతో నిర్మాత ఈ చిత్రం కోసం పెట్టిన మనీ అంతా బూడిదలలో పోసిన పన్నీరులా మారింది దానివల్ల నిర్మాత నెత్తిన గుడ్డ వేసుకున్నాడు. చివరిగా డైరెక్టర్ తను చెప్పాలనుకున్న మెసేజ్ ని ఆడియన్స్ కి చెప్పలేకపోయాడు.

ఇక సినిమాకి ముఖ్యమైనవి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ మరియు మ్యూజిక్ డైరెక్టర్. ముందుగా సినిమాటోగ్రఫీ అస్సలు బాలేదు, వైజాగ్ లో షూట్ చేసాం కాబట్టి అన్ని ఏరియాలు చూపించాలి, హైదరాబాద్ అంటే అన్ని మెయిన్ ప్లేస్ లు చూపించాలి అని తాపత్రయ పడిన సినిమాటోగ్రాఫర్ ఫ్రేమ్స్ మీద కూడా శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది. ఎడిటర్ నే వ్యక్తి నిద్రపోతుంటే మధ్యలో లేపి ఈ సినిమాకి ఎడిటింగ్ చేయమన్నట్టు ఉన్నారు. అందుకే తూగుతూ సీన్స్ ని అతికించేసాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జోష్యభట్ల గురించి చెప్పాలంటే.. ఆయన కథ విని డైరెక్టర్ పాత కథలన్నీ కలిపి ఈ కథ రాసాడు నేను మాత్రం కొత్తగా ఎందుకు కొత్తగా కొట్టాలి పాట హిట్ సినిమాల మ్యూజిక్ కొడితే సరిపోతుంది కదా అనుకున్నట్టు ఉన్నాడు. అందుకే పాటలు, నేపధ్య సంగీతాన్ని మున్నా,ఖలేజా మరియు మణిశర్మ సంగీతం అందించిన సూపర్ హిట్ మూవీస్ లోని మ్యూజిక్ ని యాసిటీస్ గా కొట్టేసాడు. చింత శ్రీనివాస్ రాసిన కొన్ని డైలాగ్స్ బాగుంటే కొన్ని డైలాగ్స్ లో భూతు మిగతా ఏం కనపడలేదు. ఇక మిగతా డిపార్ట్ మెంట్స్ వారు కూడా తమ పనిని సరిగా నిర్వర్తించలేదు. అంతా కలిసికట్టుగా చేసిన ఏకైక పని ఏంటంటే నిర్మాతని నట్ట నడి సముద్రంలో ముంచేయడం.

ఈ అలెగ్జాండర్ పోలీస్ స్టొరీతో డైరెక్టర్ చెప్పాలనుకున్న విషయం ఒకటే.. యువకులారా ప్రేమ అనే మత్తులో పడి మంచి వైపు కాకుండా చెడు వైపు అడుగేస్తున్నారు ఆ చెడు పని చేసేటప్పుడు మీ తల్లి తండ్రుల గురించి ఒక సారి ఆలోచించండి అని చెప్పాలనుకున్నాడు. కానీ ఆ మెసేజ్ ని కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. డైరెక్టర్ అనుకున్నది చెప్పలేనప్పుడు సినిమా ఫ్లాప్ లిస్టులో చేరిపోయినట్టే.. తారకరత్న ఫేస్ లోని కొన్ని ముడతలు కనపడకూడదని, అలాగే ఇంకా కలర్ఫుల్ గా కనపడాలని చేసిన కలర్ గ్రేడింగ్ అస్సలు సెట్ అవ్వలేదు. ఒక సినిమాకి వచ్చే ఆడియన్ కోరుకునే ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ సినిమాలో లేదు. కావున మీరు థియేటర్ కి వెళ్లి టికెట్ తీసుకొని చూసేంత ఈ సినిమాలో అయితే ఏం లేదు. ఒక వేల మీరు తారకరత్నకి భీభత్సమైన అభిమాని అయితే ఈ సినిమాకి వెళ్ళకుండా తను నటించిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏదన్నా పెట్టుకొని ఇంట్లోనే చూడండి. ఈ వేసవి కాలంలో అది మీ హల్త్ కి చాలా మంచిది. కాదు కూడదు అన్నారా మీ మర్డర్ అటెంప్ట్ కి మీరే మర్డర్ ప్లాన్ చేసుకున్నారని తరువాత మీరు ఫీలైనా మేము ఏమీ చెయ్యలేం.

Tarakaratna,Kumkum,Raja Reddy,PLK Reddy.అలెగ్జాండర్ - ప్రేక్షకులకి హింస హింస హింస..

మరింత సమాచారం తెలుసుకోండి: