అల్లరి నరేష్ నటన,పాటల చిత్రీకరణ,భూమిక నటన.అల్లరి నరేష్ నటన,పాటల చిత్రీకరణ,భూమిక నటన.కథ,కథనం,మాటలు ,దర్శకత్వం, కామెడీ, ఇంకా చాలా.

స్థూలకాయంతో బాధ పడుతున్న లడ్డు బాబు(అల్లరి నరేష్) మీద అందరు జోక్ లు వేస్తుంటారు. కాని వాటన్నింటినీ నిశ్శబ్దంగా భరిస్తూ ఉంటాడు లడ్డు బాబు. లడ్డు బాబు తండ్రి కిష్టయ్య (కోట శ్రీనివాస రావు)కు తమ పూర్వీకుల ఆస్తులను గెలుచుకోవాలంటే లడ్డు బాబు కి పెళ్లి చెయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. కిష్టయ్య ఆ ప్రయత్నాలు చేస్తూ విఫలం అయిపోతుంటాడు. ఇదే సమయంలో లడ్డు బాబు కి మూర్తి(అతులిత్) పరిచయం అవుతాడు. అదే సమయంలో లడ్డు బాబు మాయ(పూర్ణ) తో ప్రేమలో పడతాడు. మాయ కోసం ఎలాగయినా తను బరువు తగ్గాలని నిర్ణయించుకుంటాడు లడ్డు బాబు. లడ్డు బాబు బరువు తగ్గి మాయ ప్రేమను గెలుచుకున్నాడా? లేదా? మూర్తి ఎవరు ? ఎందుకు లడ్డు బాబు తో స్నేహం చెయ్యాలని అనుకుంటాడు అన్నది మిగిలిన కథ ..

ఈ చిత్రానికి గల ప్రధాన ఆకర్షణ అల్లరి నరేష్ , అతని స్థాయిని మరొక మెట్టు పైకి ఎక్కించే ప్రదర్శన ఇది. దాదాపుగా 25కేజీల మేకప్ వేసుకోడానికి ప్రతి రోజు ఆరు గంటల పాటు కష్టపడ్డారు అల్లరి నరేష్ ఆ కష్టం అంతా తెర మీద కనిపిస్తుంది. నిజానికి ఈ బరువునే కాకుండా చిత్రం మొత్తాన్ని కూడా తన భుజాల మీద వేసుకొని నడిపించారు. ఇక పూర్ణ పాత్ర చాలా బాగుంది దానికి తగ్గట్టుగానే తన నటన కూడా చాలా ఆకట్టుకుంది. చాలా రోజుల తరువాత తెర మీద మెరిసిన భూమిక కూడా ఆకట్టుకుంది. కోట శ్రీనివాస రావు పాత్రకు తగ్గ ప్రదర్శనకనబరిచారు . అలీ, వేణు మాధవ్, బ్రహ్మానందం , ఏ వి ఎస్ , కృష్ణ భగవాన్, ఎం ఎస్ నారాయణ మరియు జయప్రకాష్ పాత్రలు మరియు ఆ పాత్రలు చేసిన కామెడీ రెండు ఆకట్టుకోలేదు...

ఈ సినిమా స్టొరీ లైన్ మన చిన్నప్పటి రోజులది.. 1990 లలోని స్టొరీని తీసుకొని దానిలో రెగ్యులర్ గా కాకుండా ఒక లావుగా ఉండే వ్యక్తిని హీరోగా పెట్టి, కాస్త సెటైరికల్ గా చెప్దాం అని చేసిన ప్రయత్నమే 'లడ్డుబాబు'. లిమిటెడ్ బడ్జెట్ వల్ల డైరెక్టర్ కూడా కాస్త గందరగోళంలో పడ్డట్టు ఉన్నాడు. ఇదే స్టొరీని డైరెక్ట్ గా సింపుల్ గా చెప్పేసి ఉంటే బాగుండేది. ఇది కామెడీ సినిమానా అనే అనుమానాన్ని మనకు కలుగజేసే ఈ సినిమాలో అల్లరి నరేష్ లుక్, అతని ఎనర్జీ ప్రేక్షకులను నవ్వించలేకపోయింది. దాంతో ఈ సినిమాకి వచ్చిన ఆడియన్స్ ఎంటర్ టైన్ ఫీల్ అవ్వకపోగా కాసేపు కునకు తీస్తారు. అల్లరి నరేష్, భూమిక స్క్రీన్ ప్రెజన్స్ లేకపోతే లడ్డుబాబు సినిమా పూర్తిగా వాష్ అవుట్ అయ్యే సినిమా. నివాస్ రాసిన డైలాగ్స్ అంత ఎఫెక్టివ్ గా లేవుఅలాగే పంచ్ లు కూడా లేవు. సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ లన్నీ చాలా సునాయాసంగా ఊహించేవిధంగా ఉన్నాయి. పాటలు బాగున్నాయి, అలాగే వాటిని షూట్ చేసిన విధానం ఇంకా బాగుంది కానీ పాటలు వచ్చిన సందర్భమే బాగాలేకపోవడం వాళ్ళ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాకి కూడా 143 నిమిషాల నిడివి ఉండడం వల్ల ప్రేక్షకుల సహానానికి పెద్ద పరీక్ష అవుతుంది. ఎడిటింగ్ ఓకే. సినిమాటోగ్రఫీ కూడా నీట్ గా ఉంది. ఆర్ట్ డైరెక్టర్ సాంగ్స్ కోసం వేసిన సెట్స్, అలాగే ఇంటి సెట్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.

అల్లరి నరేష్ అంటే మినిమం గ్యారంటీ హీరో అని పెరోచ్చేసింది దానికి తగ్గట్టుగానే అతను చేస్తున్న చిత్రాలు కూడా ఉంటున్నాయి కాని ఈ మధ్య కాలంలో ఈ నటుడు హిట్ కొట్టలేదు. అన్ని ఒకే రకమయిన పాత్రలు చేస్తే హిట్ కొట్టలేమని అనుకున్నారేమో ఒక విభిన్న లుక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లడ్డు బాబు వరకు బాగా డిజైన్ చేసుకున్న రవి బాబు కథనం విషయం లో మరింత జాగ్రత్త వహించాల్సింది. నిజానికి ఈ చిత్రంలో విషయం చాలా చిన్నది ఒక్క అల్లరి నరేష్ పాత్రా తప్ప మిగిలిన కథ కథనం మొత్తం తొంభై లలో వఛ్చిన సినిమాలను పోలి ఉంటుంది . ఈ చిత్రంలో అల్లరి నరేష్ నటన భూమిక ప్రదర్శన పక్కన పెడితే చిత్రంలో చెప్పుకోదగ్గ అంశాలు ఏవీ మిగలవు అంటే పరిస్థితి అర్ధం చేసుకోండి రవిబాబు అంటే విభిన్న చిత్రాల దర్శకుడు అనే పేరుంది కాని ఈ చిత్రం చూసాక అసలేంటి ఈయన ఇలా తీసారు అన్న ఫీలింగ్ వస్తుంది. మొదటి అర్ధ భాగం ఏదో అల అలా సాగిపోయినా రెండవ అర్ధ భాగం చాలా నెమ్మదిగా నడిపించి ప్రేక్షకుడికి చిరాకు వచ్చి నిద్రపోయేలా చేసారు. ఈ చిత్రాన్ని చూడాలా వద్ద అని అడిగితే ఎండాకాలం ఎండలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవల్లే టికెట్ తీసుకొని థియేటర్ లో కి వెళ్లి హ్యాపీ గా నిద్రపోవచ్చు, అందులోనూ ఏసి థియేటర్ లకు వెళ్ళండి సుమీ... ఇది కాకుండా ఈ చిత్రాన్ని చూడటానికి మరొక్క రీజన్ కూడా లేదు. ఎప్పుడయినా టీవీ లో వేసినప్పుడు అల్లరి నరేష్ కోసం ఒకసారి చూడండి..

Allari Naresh,Bhoomika,Poorna,Ravi Babu,Rajendra Tripuraneni.లడ్డు బాబు - జిడ్డు బాబు ..

మరింత సమాచారం తెలుసుకోండి: