చెప్పుకునేంత హైలెట్ గా ఎం లేకపోవడంచెప్పుకునేంత హైలెట్ గా ఎం లేకపోవడంకథ,కథనం ,మాటలు ,దర్శకత్వం, ఎన్నికల ప్రకటనల వంటి రెండవ అర్ధ భాగపు సన్నివేశాలు, ఇంకా చాలా

రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ప్రతిపక్షం లో ఉంటున్న సమసమాజ్ పార్టీ ఈసారి అయినా గెలవడానికి ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో ఒక కాలేజీ లో చైతన్య(అజ్మల్), సంధ్య (అరుషి) మరియు చందు చదువుకుంటూ ఉంటారు. అలా చదువుకుంటున్న సమయంలో బాలరాజు అనే విద్యార్ధి ఐఐఎం లో సీట్ రాలేదని ఆత్మ హత్య చేసుకుంటాడు. వీరి ముగ్గురిని ఈ సంఘటన ఎంతగానో కదిలిస్తుంది తరువాత వారి చదువులు పూర్తయ్యాక సంధ్య సివిల్స్ కి ప్రిపేర్ అవుతుండగా చందుకి ఐఐఎం లో సీట్ వస్తుంది. సమసమాజ్ పార్టీలో కీలక పాత్ర పోషించే నాగ్య నాయక్(నాగబాబు) కొడుకు అయిన చైతన్య నాయక్ తండ్రి కోరిక మేరకు అదే పార్టీ కి యూత్ లీడర్ చేరుతాడు. మెయిన్స్ క్లియర్ చేసిన సంధ్య పిలవడంతో వాళ్ళ ఊరి జాతరకు వెళ్తారు స్నేహితులందరు , అక్కడ బాలరాజు తల్లిదండ్రుల పరిస్థితిని చూసి వారికి ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటారు. కాని అందుకోసం వారు చేసిన పోరాటంలో ఓడిపోవడంతో నిరాశ చెంది దీనంతటికీ కారణం జనం అని జనంలో మార్పు తీసుకుని రావాలని అనుకుంటారు. ఆ తరువాత చైతన్య రాజకీయాల్లో ఎదుగుతాడు , చందు బిజినెస్ లో మంచి పేరు తెచ్చుకుంటాడు. సంధ్య జాయింట్ కలెక్టర్ అవుతుంది. సమసమాజ్ పార్టీ ఈసారి ఎన్నికల పరిధిలోనే ప్రచారం చెయ్యాలని ప్రజలకు ఓటు విలువ తెలిసేలా కృషి చేద్దామని చైతన్య కోరతాడు, ఈ విధానానికి పార్టీ అధ్యక్షుడు ఒప్పుకోగా అదే పంథాలో తన ప్రచారం సాగిస్తాడు, చివరికి ప్రగతి పథం పార్టీ మీద గెలుపొందారా లేదా అన్నది మిగిలిన కథ...

సినిమాలో పాత్రలలో బలం ఉన్నా లేకున్నా కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్త వహించారు, నిజానికి ఈ చిత్రంలో అందరు అనుభవం ఉన్న నటీనటులే అని చెప్పుకోవచ్చు ఇక వారి ప్రదర్శన విషయానికి వస్తే, అజ్మల్ అక్కడక్కడా అవసరానికి మించి నటించేసి మార్కులు కొట్టేయాలని ప్రయత్నించారు కాని కొన్ని సన్నివేశాల వరకు బాగా హేండిల్ చేశారు. పంచి బోరా అనే అమ్మాయి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది... నటించిందా? ఏమో మరి అప్పుడప్పుడు తెర మీద తళుక్కుమంది.. నటించింది అనే అనుకోవాలి... అరుషి పాత్రకు నటనకు సంభందం లేకుండా పోయింది రెండు టోన్ ల మేకప్, రెండు లెవల్స్ నటన తగ్గించుకొని ఉంటె చాలా బాగుండేది. నిజానికి ఈ నటి కొన్ని సన్నివేశాలలో చాలా బాగా నటించింది కాని అవి చాలా కొన్ని సన్నివేశాలే కావడంతో ఆమెలో మేటర్ ఉన్నా పాత్ర వలన బయటకు రాలేదని అర్ధం అయిపోయింది. చందు చేసిన పాత్ర పరవాలేదు. ఇక నాగబాబు,బెనర్జీ, నాజర్, ఆహుతి ప్రసాద్ కోట, చలపతి రావు , గొల్లపూడి మారుతీ రావు ఇలా చెప్తుంటేనే ఆయాసం వచ్చేస్తుంది కాని వీరిలో ఒక్కరి పాత్ర కూడా ఆకట్టుకోలేకపోయింది అని చెప్పాలంటే బాధగానే ఉంది కాని ఒక్క పాత్రను కూడా ఆకట్టుకోలేని స్థాయిలో తీర్చి దిద్దారు దర్శకుడు. వారి పాత్రలకు తగ్గ ప్రదర్శన కనబరచడానికి వారు శత విధాలుగా ప్రయత్నించినా పాత్రకు పరిధి అంటూ ఏది లేకపోవడంతో అన్ని పాత్రలు, అందరి నటన గాల్లో కలిసిపోయింది.

కథ కథనం మాటలు దర్శకత్వం ఇలా నాలుగు విభాగాలను నెత్తి మీద వేసుకొని ఏదో చేసేద్దాం అని ప్రయత్నించారు దర్శకుడు భాస్కర్ రావు వెండ్రాతి. కథ విషయంకి వస్తే అయన ఎం అనుకున్నాడో అర్ధం అయితే కథ ఎలా ఉందో చెప్పవచ్చు, కాని ఆయనేం చెప్పాలని అనుకున్నాడో అన్న క్లారిటీ ఆయనకీ లేదు మనకి రాదూ. కథనం కోసం కొత్తగా ఏదయినా ప్రయత్నిస్తే బాగోదు అనుకున్నారేమో ఎన్నికల కమీషన్ ప్రదర్శించే ప్రకటనలని సన్నివేశాలుగా రాసేసుకున్నారు, టీవీ చానల్స్ చూసి చెప్తున్న పాయింట్ కి సంభందం ఉందా లేదా అన్న చిన్న ఆలోచన లేకుండా ఏది కనిపిస్తే అది సన్నివేశంగా రాసుకున్నారు అలానే ఏది వినిపిస్తే అది డైలాగ్ గా రాసేసుకొని మన ముందుకు వచ్చేసారు. దర్శకత్వం విషయంలో భాస్కర్ రావు దారుణంగా విఫలం అయ్యారు కనిపించే ప్రతి కొత్త నటుడు లేదా అనుభవం ఉన్న నటుడు ఇలా ఎవరు తెర మీద కనిపించినా అనవసరం అయిన ఓవర్ యాక్షన్ చేసారు. ఈ విభాగంలో పాజిటివ్ గా ఏదయినా చెప్పుకోవాలంటే ఆర్పీ పట్నాయక్ అందించిన సంగీతం మరియు నేపధ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్టుగా అయన అందించిన నేపధ్య సంగీతం బాగుంది అలానే అయన అందించిన పాటలలో రెండు పాటలు బాగున్నాయి. అలానే సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది ఉన్నంతలో చాలా అందంగా చూపెట్టారు. నిర్మాత కూడా దర్శకుడే కావడంతో నిర్మాణ విలువలు బాగుండేలా చూసుకున్నారు.

ఎన్నికల సమయం ఏదో ఒకటి చెప్పాలి అనుకున్నారేమో , చూసిన కొన్ని ప్రకటనలని కలిపి ఒక చిత్రంగా చేసి మన ముందుకు పట్టుకొచ్చారు. నిజానికి చిత్రం మొదటి నుండి ఒక పాయింట్ వైపు నడుస్తున్నట్టు ఎక్కడా అనిపించదు. ఇక నటీనటుల ఓవర్ యాక్షన్ సరే సరి, అసలు దర్శకుడికి ఒక క్లారిటీ లేనప్పుడు ప్రేక్షకుడికి ఎలా అర్ధం అయ్యేలా చెప్పగలడు. ఇంటర్వెల్ లో హీరో రాజ్యాంగాన్ని చదవడం మొదలెట్టగానే రెండవ అర్ధ భాగం ఏదో మంచి పాయింట్ మీద వర్క్ చేసుంటారు అని అనుకుంటారు ఇక రెండవ అర్ధ భాగం మొదలవగానే ఉంటుంది చూడండి ... అసలు రాజకీయ పార్టీ ఓటు హక్కుని వినియోగించండి అనే అజెండా తో రావడం ఏంటో విడ్డూరం... పాటలు ఎందుకోస్తాయో ఎవరికీ అర్ధం కాదు పాటలు వినిపిస్తున్నాయి కాబట్టి డాన్సు చెయ్యాలి అన్నట్టు తెర మీద పాత్రలు బిహేవ్ చేస్తుంటాయి. సినిమాలో కథ లేదు-కథనం బాలేదు, మాటలు బాలేదు-లాజిక్ కనపడలేదు , దర్శకత్వంలో పట్టు లేదు - నటనలో నాణ్యత లేదు, ఈ చిత్రం చూడటానికి కారణాలు లేవు - చూడవలసిన అవసరం లేదు. జనంలో చైతన్యం సృష్టించడానికి ఏదో చెయ్యాలన్న తపన కనిపిస్తున్నా అందులో క్లారిటీ లేదున , నిజానికి జనంలో చైతన్యం తీసుకురావాలన్న తపన మెచ్చుకోదగ్గ విషయమే అయినా విఫలం అయిన ప్రయోగం ఇది... ఇలాంటి చిత్రాలు చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తే బాగుంటుంది. ఈ చిత్రం చూడటం కన్నా ఇంట్లో న్యూస్ చానల్స్ లో వచ్చే ఎన్నికల కమిషన్ యాడ్స్ ని వరుసగా చూడవచ్చు...

Ajmal, Sandesh,Aarushi,Panchi Bora,Nazar,Naga Babu,Kota Srinivasa Rao, నిర్మాత వృధా ప్రయత్నం, ప్రేక్షకుడికి వ్యథా ప్రయత్నం...

మరింత సమాచారం తెలుసుకోండి: