అవసరాల శ్రీనివాస్ (నటుడిగా),కొన్ని కామెడీ సన్నివేశాలు ,సంగీతం ,సినిమాటోగ్రఫీ అవసరాల శ్రీనివాస్ (నటుడిగా),కొన్ని కామెడీ సన్నివేశాలు ,సంగీతం ,సినిమాటోగ్రఫీ అవసరాల శ్రీనివాస్ (దర్శకుడిగా) ,ఎడిటింగ్ ,బాగా పొడవయిన ఫస్ట్ హాఫ్ ,హీరో హీరోయిన్ మధ్యలో బంధాన్ని సరిగ్గా చూపించకపోవడం ..

వెంకటేశ్వర రావు ( నాగ శౌర్య) ఒక రిపోర్టర్ , పెద్ద యాంకర్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు, అక్కడి నుండి వైజాగ్ వెళ్ళిన వెంకటేశ్వర రావు తన మావయ్య (రావు రమేష్) ని కలుస్తాడు. ఇదిలా సాగుతుండగా ఢిల్లీ నుండి వచ్చిన అమ్మాయి శ్రీ సాయి శిరీష ప్రభావతి (రాశి ఖన్న) ని కలుస్తాడు. సిరిష మరియు వెంకి దగ్గరవుతున్న సమయంలో వెంకి , శిరీష కి ప్రపోజ్ చేస్తారు కాని శిరీష ఒప్పుకోదు. కొంతకాలం తరువాత శిరీష ఉదయ భాస్కర్ (అవసరాల శ్రీనివాస్) ని కలుస్తుంది. యూబీ టివి కి హెడ్ అయిన ఉదయ భాస్కర్ , శిరీష ను ఆకర్షించడానికి వెంకయ్ సహాయం కోరతాడు , కాని ఉదయ్ ప్రేమిస్తున్నది శిరీష ను అని వెంకి కి తెలిసాక కథ మలుపు తిరుగుతుంది. తరువాత ఉదయ్ కి వెంకి సహాయపడ్డాడా? శిరీష ఎవరిని ప్రేమించింది? అన్నది మిగిలిన కథ ...

నాగ శౌర్య గొప్ప నటుడు కాకపోవచ్చు కాని అతని స్క్రీన్ ప్రేజేన్స్ బాగుంది అంతే కాకుండా పక్కింటి కుర్రాడు అనే ఫీలింగ్ కలిగేలా చేసాడు. రాశి ఖన్న అందంగా కనిపించింది , ఈ చిత్రంలో ఆమె పాత్ర ఇంతకు మించి చెయ్యడానికి ఎం లేదు, ఈ చిత్రానికి ప్రధాన హైలెట్ అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా కాదు కాని నటుడిగా అయన పనితనం చాలా బాగుంది. రావు రమేష్ మరియు ప్రేమ ఆకట్టుకున్నారు. వీరి మధ్య సన్నివేశాలు బాగున్నాయి. మిగిలిన అందరు నటులు కూడా వారి స్థాయి మేరకు రాణించి ఆకట్టుకున్నారు.

ఊహలు గుస గుస లాడే అనే ఈ రొమాంటిక్ చిత్రం ఫ్రెంచ్ చిత్రం అయిన "సైరన్నో దే బెర్జేరాక్" అనే చిత్రం నుండి తీసుకుంది. శ్రీనివాస్ అవసరాల రాసుకున్న కథ బొత్తిగా ఆకట్టుకోలేదు. కథ చెప్పిన విధానం కూడా చాలా తేలిగ్గా ఉండటంతో ప్రేక్షకుడిని కట్టి పడేయలేకపోయింది. మొదటి అర్ధ భాగం అంతా అయిపోయాక కూడా చిత్రం లో ఏముంది అన్న ప్రశ్న కు సమాధానం దొరకదు.. రెండవ అర్ధ భాగం కన్నా మొదటిదే నయం అనిపిస్తుంది అంటే ఇదెలా ఉందొ ఊహించుకోండి. కథానాయకుడు మరియు కథానాయిక మధ్యన ప్రేమేను సరిగ్గా చుపించాలేకపోయాడు దర్శకుడు ఈ చిత్ర క్లైమాక్స్ కూడా హడావిడిగా ముగిసినట్టు ఉంటుంది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలలో కామెడీ చాలా బాగా పేలింది.

సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలం , కళ్యాణ్ కోడూరి అందించిన సంగీతం చాలా సన్నివేశాలకు తగ్గట్టుగా ఉంది అంతే కాకుండా చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఈ చిత్రం చాలా పొడవుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎడిటర్ ఈ చిత్రాన్ని మరో 20 నిముషాలు అయినా కత్తిరించే అవకాశం ఉంది. డైలాగ్స్ పరవలేధనిపించాయి. ఈ చిత్రంలో కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. వారాహి చలన చిత్ర వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఊహలు గుస గుస లాడే, ఇది ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం అని చెప్పుకోడమే కాని ఈ చిత్రంలో రొమాన్స్ లేదు కామెడీ లేదు, హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ ని సరిగ్గా చుపించలేకపోయాడు, కామెడీ ని సరిగ్గా పండించాలేకపోయాడు ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ అని ఎందుకు అన్నారో అర్ధం కాదు. హీరో పాత్రా హీరోయిన్ ని ప్రేమించడం చూపించారు కాని హీరోయిన్ ఎందుకు హీరో ని ప్రేమిస్తుందో చూపించలేదు. బ్లూ టూత్ కామెడీ సన్నివేశాలు తప్ప మిగిలినవి ఏవి ఫలించలేదు.మీరు రొమాంటిక్ కామెడీ చిత్రాల ప్రేమికులు అయితే ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ అని మీరు అనుకుంటే మీ ఊహలు తప్పు అయిపోతాయి. పరిగెత్తుకు వెళ్లి చూడవలసిన చిత్రం కాదు టీవీ లో వేసినప్పుడు తీరిగ్గా చూసుకోవచ్చు...

Nag Shouriya,Rashi Khanna,Srinivas Avasarala,Sai Korrapati,Kalyani Koduri.ఊహలు గుస గుస లాడే - రొమాన్స్ లేని రొమాంటిక్ చిత్రం ..

మరింత సమాచారం తెలుసుకోండి: