చిత్ర మూల కథ,సినిమాటోగ్రఫీచిత్ర మూల కథ,సినిమాటోగ్రఫీకథను సరిగ్గా చెప్పలేకపోవడం, అసలు సంభంధం లేని సన్నివేశాలతో రాసుకున్న కథనం, ఎడిటింగ్

నాగునీడు(నాగినీడు)ని ఓడించి ముఖ్యమంత్రి అవుతాడు రఘురాం(వాసు), స్వతహా గా ఐపిఎస్ అయిన రఘురాం ఎన్నో అభ్యుదయ భావాలతో ఉంటాడు. అందరు చులకనగా చూస్తున్న యువత యొక్క ప్రాముఖ్యతను ఎలాగయినా తెలపాలి అని ఎన్జిఎఫ్(నెక్స్ట్ జనరేషన్ ఫోర్సు) ని స్థాపిస్తాడు. యువతను ఇందులోకి తీసుకొని పదిహేను వారాల పాటు శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ యొక్క ఉద్దేశం. ఈ సంస్థలో పోలీస్ అవ్వాలని బ్లాకు లో టికెట్ లు అమ్ముకునే అల్తాఫ్(క్రాంతి), సిద్దు(తనిష్క్), జాన్(క్రాంతి కుమార్) , బలరాం(శశి) లు చేరుతారు , ఇక్కడ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ తోట చక్రవర్తి(వెంకట్) నియమింపబడుతాడు.. కాని ఆ బ్యాచ్ మొత్తంలో ఈ ఐదుగురు మాత్రం వెనుకబడతారు. కాబట్టి చక్రవర్తి వీరిలో ఎవరు ఒకరు ఫెయిల్ అయిన అందరిని బయటకి పంపిచేస్తాను అని చెప్తారు. ఇదిలా ఉండగా నాగునీడు మరియు కృష్ణ మురళి(పోసాని కృష్ణ మురళి) ఎలాగయినా ఈ ఎన్జీఎఫ్ ని భూస్థాపితం చెయ్యడానికి ప్రయత్నిస్తారు. వీరు ఈ సంస్థను మూయించారా? లేదా? ఆ ఐదుగురు వారి శిక్షణ పూర్తి చేసి పోలీస్ అయ్యారా? అసలు వీరి జీవితాల వెనుక ఉన్న కథలు ఏంటి? కిరణ్మయి(అస్మిత సూద్) ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే చిత్రం చూడాల్సిందే.....

వెంకట్, ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ పాత్రలో నటించిన ఈ నటుడు శరీరాకృతి లో పోలీస్ లాగానే అనిపించినా అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం వలన ఈ పాత్ర సరయిన ఇంపాక్ట్ సృష్టించలేకపోయింది కావున వెంకట్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. నాగినీడు పాత్ర చిన్నదే అయిన ఉన్నంతలో విలన్ అన్న భావన కలిగించాడు. పోసాని కనిపించిన రెండు మూడు సన్నివేశాలలో నవ్వించారు. అస్మిత సూద్ అందంతో ఆకట్టుకున్న అభినయం మాత్రం చూపించలేదు. ఇక "ఆ ఐదుగురు" క్రాంతి కుమార్, కృష్ణ తేజ, శశి, తనిష్క్, క్రాంతి.. వీరి పాత్రలను భుజాల మీద మోసేయ్యడం లాంటి పనులు చెయ్యలేకపోయారు కాని పాత్రల స్వభావాలను అయితే నాశనం చెయ్యలేదు. వీరందరు ఉన్నంతలో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేసారు కాని ఆకట్టుకోలేకపోయారు. ఇక వీరి పక్కన నటించిన హీరోయిన్ బ్యాచ్ గురించి మాట్లాడుకునే అవసరం కూడా లేదు అన్నట్టు నటించారు. సుద్దాల అశోక్ తేజ గారు ఆకట్టుకోవాలి అని ప్రయత్నించినా ఆకట్టుకోలేదు. ఇక ప్రత్యేక పాత్రలో కనిపించిన ప్రేమ కుమార్ పాత్ర వ్యర్థం , నిరర్ధకం..

అనిల్ జేసన్ రాసుకున్న కథ కాస్త మలయాళం చిత్రం "పోలీస్ అకాడమీ" ని పోలి ఉంది కాని ఈ దర్శకుడు మరిచిపోయిన విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని నితిన్ "హీరో" అని ఎప్పుడో రీమేక్ చేసారు. కాని అది విఫలం అయ్యింది కాబట్టి ఈ విషయాన్నీ పక్కన పెడితే అసలు కథ విషయం లో దర్శకుడు బాగానే రాసుకున్నాడు కథకు తగ్గ సబ్ ప్లాట్స్ బాగానే రాసుకున్నా కూడా వాటిని సరిగ్గా ఎలివేట్ చెయ్యడానికి సరిపడే కథనం రాసుకోలేకపోయాడు అనిల్ జేసన్. సినిమా మొదటి నుండి టైం వేస్ట్ చెయ్యకుండా పాయింట్ లో కి వెళ్ళిపోయినా దర్శకుడుకి తన దగ్గర ఉన్న విషయాన్నీ ఎలా చెప్పాలో అర్ధం కాక తడబడ్డ్డాడు ఒక సన్నివేశాన్ని కామెడీ లాగా ప్రయత్నించడం అది ప్పూర్తి అవ్వకముందే ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలని ప్రయత్నించడం అది పూర్తవకుండానే ప్రేమ సన్నివేశం అది పూర్తవకుండానే సెంటిమెంట్ సన్నివేశం.. ఇలా ఒకటి పూర్తవకుండా మరొకటి మొదలుపెట్టి విషయాన్నీ పూర్తిగా చెప్పకుండా సగంలోనే క్లైమాక్స్ కి వచ్చేసాడు. అక్కడితో ఏదో చెప్పేయాలి అన్న హడావిడి లో ముగించేసాడు. క్లైమాక్స్ లో కి వచ్చాక ఎం చేసారో ఆయనకి, ప్రేక్షకుడికి ఇద్దరికీ క్లారిటీ ఉండదు.. ఇక మాటలు అందించిన సుద్దాల అశోక్ తేజ , మరి కాస్త పదునయిన సంభాషణలు అందించి ఉంటె మరింత బాగుండేది.. ఇక సినిమాటోగ్రఫీ అందించిన పిజి విందా తన పనిలో లోటు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. సంగీతం అందించిన "మంత్ర" ఆనంద్ పాటలు అంత గొప్పగా ఎం లేవు ఇంకా నేపధ్య సంగీతానికి సన్నివేశానికి సంభంధం లేకుండాపోయింది. ఎడిటింగ్ విషయానికి వస్తే చిత్రం అతుకుల బొంతలా కనిపించింది సన్నివేశాలను అతికించిన విధానం చాల స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కో సన్నివేశం లాగిపెట్టి ప్రేక్షకుడి మొహం మీద కొట్టినట్టు వచ్చి పడుతుంటాయి ఈ విభాగంలో చాలా జాగ్రత్త వహించి ఉంటె చాలా బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

"ఆ నలుగురు" చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ ప్రేమ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిచారు, ఈ ఒక్క విషయాన్నీ చూసి ఈ చిత్రానికి వెళ్తే అడ్డంగా దొరికిపోయినట్టే, ఎప్పటిలానే ఈ చిత్ర నిర్మాణ సంస్థ పేరుకి తగ్గట్టు గానే తగ్గట్టుగానే విభిన్నమయిన కథాంశాన్ని ఎంచుకొని సెట్స్ మీదకు వెళ్ళింది కాని ఈ చిత్రం బాగోలేకపోవడానికి కారణం మాత్రం దర్శకుడి అనుభవ రాహిత్యమే , లాజిక్ పరంగా ఈ చిత్రంలో చాలా బూతులు ఉన్నాయి. అసలు పేపర్ లో ఉన్న యాడ్ ని చూసి 40 మాత్రమే ఎందుకు వచ్చారు? సిద్దు కి ఇష్టం లేనప్పుడు ఎందుకు వచ్చాడు? నాగినీడు ఎన్జిఎఫ్ ని మూయించాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ఐదుగురితో పనేంటి? అసలు వీళ్ళ ప్లాన్ ఏంటో వాళ్ళకే తెలియదు ఇక ప్రేక్షకుడికి ఎలా చెప్పగలరు? పైపుల అనే పాత్రను కామెడీ గా చూపించడానికి ట్రైనింగ్ క్యాంపు లో డాక్టర్ లు ఇలానే ఉంటారు అన్నట్టు చూపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అభిమాన రాజకీయ నాయకుడి గురించి పదే పదే చెప్పడం ఏంటో? ఇలా ఈ చిత్రంలో చాలా ప్రశ్నలే ఉన్నాయి.. మొదటి అర్ధ భాగం రెండవ అర్ధ భాగం ఇలా తేడా లేకుండా రెండు ఇబ్బంది పెట్టినవే.. క్లైమాక్స్ కి ముందు ఒక పది నిమిషాల చిత్రం మాత్రం కాస్తో కూస్తో ఆసక్తికరంగా సాగింది. సెంటిమెంట్ కోసం ఈ చిత్రంలో చెయ్యని ప్రయత్నం లేదు కాని ఏదీ ఫలించకపోగా అన్ని బెడిసికొట్టాయి.. సినిమా కష్టాలు అంటే నిర్మాతకు డబ్బుల కష్టం, కథ రాయడానికి రచయిత పడే కష్టం, తెరకెక్కించడానికి దర్శకుడు పడే కష్టం ఇలా చాలా కష్టాలను కలిపి సినిమా కష్టాలు అంటారు కాని ఇలాంటి చిత్రాలకు మాత్రం థియేటర్ లో సినిమా చూడటానికి ప్రేక్షకుడు పడే కష్టాన్ని కూడా జత చెయ్యాలి.. ఇంత చెప్పాక మీరు చూడాలా వద్దా? అన్నది మీరే నిర్ణయించుకోండి..

Siddharth Rajkumar,Asmita Sood,Anil Gurudu,Sarita Patra,Anand.ఆ ఐదుగురు - కలిసి హింసించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: