సినిమాటోగ్రఫీ ,సంగీతంసినిమాటోగ్రఫీ ,సంగీతంకథనం ,నటీనటుల పనితీరు ,డైలాగ్స్ ,ఎడిటింగ్ ,దర్శకత్వం

అమెరికా నుండి అశోక ఇండస్ట్రీస్ ని సొంతం చేసుకోవడానికి వస్తాడు క్రిష్(వరుణ్ సందేశ్).. ఇండియా చేరుకోగానే అతనికి అనుకోని పరిస్థితిలో ఎదురుపడుతుంది మహాలక్ష్మి(పూర్ణ), కాని మహాలక్ష్మి పని చేసేది క్రిష్ ఆఫీస్ లోనే అని తెలుస్తుంది. మహాలక్ష్మి అప్పటికే గోపి అనే వ్యక్తిని ప్రేమిస్తుంటుంది. గోపి మహాలక్ష్మిని మోసం చేస్తాడు. ఈ విషయంలో బాధపడుతున్న మహాలక్ష్మిని తను ఇంకా పాత అమ్మమ్మ లాంటి అమ్మాయి అని అప్డేట్ అవ్వలేదని అవమానిస్తాడు క్రిష్.. దీంతో ఎలాగయినా క్రిష్ ని ఆకర్షించి తను అన్న మాటలు తప్పు అని నిరూపించాలి అని నిర్ణయం తీసుకుంటుంది మహాలక్ష్మి. తను క్రిష్ ని ఆకర్షించగలిగిందా? క్రిష్ తను అనుకున్నట్టుగా ఆ కంపెనీ ని సొంతం చేసుకున్నాడా? అన్నదే మిగిలిన కథ ...

వరుణ్ సందేశ్, ఈ నటుడు గత చిత్రాలలో లాగా కాకుండా విభిన్నంగా చెయ్యడానికి ప్రయత్నించారు. అదే ఈ చిత్రంలో ఈయన పాత్రకి పెద్ద మైనస్ ఎందుకంటే అతనికి ఎలా నటించాలో క్లారిటీ లేకపోయింది చాలా కృత్రిమంగా నటించాడని ప్రతి సన్నివేశంలో తెలిసిపోతుంది. పూర్ణ పాత్ర తీరు తగ్గట్టుగా నటించడానికి ప్రయత్నించినా ఆకట్టుకోలేకపోయింది. ధనరాజ్ పండించడానికి ప్రయత్నించిన కామెడీ పండలేదు.. వెన్నెల కిషోర్ కనిపించిన కాసేపు పరవలేదనిపించారు. ఉత్తేజ్, సన, శ్రీదర్ , గిరిధర్ మరియు ఇతర నటీనటులు అలా కనిపించి మాయం అయిపోయారు...

ఈ చిత్రానికి ప్రత్యేకించి కథ అంటూ ఏమి లేదు, కనిపించే సన్నని చిన్న పాయింట్ కూడా ఒక కొరియన్ చిత్రాన్ని పోలి ఉంటుంది. ఇక కథనం విషయానికి వస్తే మొదటి నుండి చిత్రంతో ప్రేక్షకుడికి సంభంధం ఉండదు చాలా వ్యతిరేక ధోరణిలో చిత్రం నడుస్తుంటుంది. చిత్రం ఆసాంతం ఒక్క సన్నివేశం కూడా ఆకట్టుకోదు అంటే అతిశయోక్తి కాదు. దర్శకత్వం విషయంలో త్రినాధ్ రావు ఘోరంగా విఫలం అయ్యారు పాత్రలకు తగ్గ నటనను రాబట్టుకోలేకపోయారు. సినిమాటోగ్రఫీ అందించిన జ్ఞానశేఖర్ ఈ చిత్రానికి చాలా పెద్ద ప్లస్.. ముఖ్యంగా కొన్ని పాటలలో ఈయన అందించిన సినిమాటోగ్రఫీ అమోఘం అని చెప్పుకోవచ్చు లొకేషన్ లను చాలా అందంగా చూపించారు. సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ చిత్రానికి మరొక హైలెట్.. అయన అందించిన పాటలు బాగుండటమే కాకుండా నేపధ్య సంగీతం కూడా బాగుంది..

వరుణ్ సందేశ్ సినిమాలు అన్ని ఒకేలా ఉంటాయి అన్న ముద్ర పడిపోయాక కూడా వరుణ్ సందేశ్ అటువంటి చిత్రాలనే చేస్తున్నారు అన్న ముద్ర కూడా పడిపోయింది కాగా ఇలాంటి చిత్రాలే తన వద్దకు వస్తుండటంతో కాస్త పంథా మార్చి సీరియస్ పాత్రలో నటించడానికి ప్రయత్నించాడు కాని ఘోరంగా విఫలం అయ్యాడు. పూర్ణ అందంతో ఆకట్టుకోలేదు నటన కూడా ఆకట్టుకోలేదు. దర్శకుడిగా త్రినాధ్ కూడా ఆకట్టుకోలేకపోయారు. ఈ చిత్రం గురించి చెప్పాలంటే ఒక ప్రేక్షకుడు ఎలాంటి చిత్రాన్ని అయితే చూడకూడదు అనుకుంటాడో అటువంటి చిత్రం ఇది.. మొదటి సన్నివేశం నుండి ఒక్క సన్నివేశం కూడా ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వదు ప్రేక్షకుడు కనెక్ట్ అయినప్పుడే కదా నవ్వించినప్పుడు నవ్వుతాడు సెంటిమెంట్ సన్నివేశాలలో ఏడుస్తాడు అలా కాకుండా ప్రేక్షకుడు కనెక్ట్ అయినా అవ్వకపోయినా అనవసరం అనుకుంటూ పోతే చిత్రం లో పాత్రలు ఫీల్ అవుతుంటాయి కాని ప్రేక్షకుడికి అవేమి పట్టనట్టు ఉంటుంది. ఈ చిత్రాన్ని చూడాలి అనుకుంటే ఉన్న కారణాలు జ్ఞానశేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ మరియు సాయి కార్తీక్ అందించిన సంగీతం.. మిగిలినవన్నీ ఎందుకు చూడకూడదో చెప్పే అంశాలు... మీరు వరుణ్ సందేశ్ వీరాభిమాని అయితే టీవీ లో వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు చూడండి...

Varun Sandesh,Poorna,Trinadha Rao Nakkina,Induri Rajasekhar Reddy,Sai Karthik..చివరగా : నువ్విలా నేనిలా : ప్రేక్షకుడికి పీడకల

మరింత సమాచారం తెలుసుకోండి: