నారా రోహిత్ ,సినిమాటోగ్రఫీ ,డైలాగ్స్ ,సంగీతం నారా రోహిత్ ,సినిమాటోగ్రఫీ ,డైలాగ్స్ ,సంగీతం కథనం ,ఎడిటింగ్ ,సన్నని కథ,రెండవ అర్ధ భాగంలో కొన్ని సన్నివేశాలు

"అహం" మనిషిలో ఉండే అత్యున్నత భావం , "పురాణాలు అన్నీ ఈగో ప్రోబ్లెంసే" , ఇలాంటి సిద్దాంతాన్ని నమ్మే రానా ప్రతాప్ జయదేవ్(నారా రోహిత్) విదేశాలలో చదువుకొని తిరిగి భారత దేశానికి వస్తాడు. తన అహాన్ని త్రుప్తి పరచడం కోసం ఎంత దూరమయిన వెళ్ళే వ్యక్తి రానా ప్రతాప్, అంతే కాకుండా ఒక మనిషిని కాపాడటానికి ఎన్ని రూల్స్ అయిన బ్రేక్ చెయ్యచ్చు అని కూడా నమ్ముతుంటాడు. ఒక సందర్భంలో నగరంలో జరుగుతున్న దుర్గ ప్రసాద్(రావు రమేష్) చేస్తున్న రాజకీయ ప్రచారంలో గాయపడిన ఒక వ్యక్తిని కాపాడుతాడు రానా ప్రతాప్, ఆ విషయంలో పవన్(ఆహుతి ప్రసాద్) రానా ప్రతాప్ అహాన్ని దెబ్బ తీస్తాడు. దాంతో అవినీతి మార్గంలో రానా పోలీస్ అవుతాడు. పోస్టింగ్ ఏలూరు లో వస్తుంది , ఆ నగరంలో దుర్గ ప్రసాద్ చాలా అవినీతి కార్యక్రమాలు చేపడుతు ఉంటాడు, జనాన్ని భయపెట్టి తన అవినీతి కార్యక్రమాలను యదేచ్చ గా చేపడుతు ఉంటాడు. రానా , దుర్గ ప్రసాద్ వ్యాపారాలకు అడ్డు పడుతూ ఉంటాడు , అదే సమయంలో హెడ్ కానిస్టేబుల్ భార్య(తాళ్లూరి రామేశ్వరి) రానా నోటిసుకి ఒక సమస్యని తీసుకొస్తుంది. ఆ సమస్య ఏంటి? రానా అహం ఎలా తృప్తి చెందింది? అన్నదే మిగిలిన కథ ...

ఈ చిత్రం మొత్తం నారా రోహిత్ పాత్ర చుట్టూ తిరుగుతుంది, గత చిత్రాలతో పోలిస్తే నారా రోహిత్ నటనలో చాలా పురోగతి కనిపించింది , ఈ చిత్రంలో హైలెట్స్ లో నారా రోహిత్ నటన కూడా ఒకటి ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో వచ్చే సన్నివేశం మరియు స్వేచ్చ గురించిన సన్నివేశంలో అతని నటన చాలా బాగుంది. అంతే కాకుండా పోలీస్ కాస్ట్యూమ్ లో చాలా స్టైలిష్ గా కనిపించారు... విశాఖ సింగ్ కి ఇది మొదటి తెలుగు చిత్రం ఆమె నటన పాత్రకి తగినట్టు ఉంది కాని ఆమె పాత్ర పూర్తి స్థాయిలో ఉండదు. నారా రోహిత్ మరియు విశాఖ సింగ్ మధ్యలో కెమిస్ట్రీ కూడా సరిగ్గా కుదరలేదు. ప్రతినాయకుడి పాత్రలో చేసిన రావు రమేష్ మరోసారి తనదయిన శైలిలో ఆకట్టుకున్నారు. అజయ్ కూడా తన పాత్రలో ఆకట్టుకున్నారు. తాళ్లూరి రామేశ్వరి నటన ఆకట్టుకుంది. గొల్లపూడి మారుతీ రావు గారి పాత్ర చిన్నది అయినా ఆసక్తికరంగా ఉంది. భాను అవిర్నేని, పరుచూరి వెంకటేశ్వర రావు మరియు ఆహుతి ప్రసాద్ తదితరులు పాత్రకి తగ్గ నటన కనబరిచారు. పోసాని కృష్ణ మురళి చేత చేయించిన కామెడీ సరిగ్గా వర్క్ అవుట్ అవ్వలేదు....

మొదటి చిత్రమే అయినా కూడా దర్శకుడు కృష్ణ చైతన్య ఆకట్టుకున్నాడు , స్టైలిష్ గా తెరకెక్కించారు.. సందేశాత్మక అంశానికి యదార్థ సంఘటనలను జతపరిచి కథను సిద్దం చేసుకున్నారు కాని ఈ చిత్రం స్టైలిష్ గా ఉంది మరియు విజువల్ గా బాగుంది కాని చిత్రంలో విషయం మాత్రం చాలా తక్కువ కథనం కాస్త పగడ్భందీ గా రాసుకోవల్సింది. చిత్రంలో చాలా చోట్ల చిత్రం బాగా నెమ్మదిస్తుంది.. మొదటి అర్ధ భాగం ఆసక్తి కరంగా సాగిన రెండవ అర్ధ భాగం చాలా నెమ్మదిస్తుంది. సంభాషణలు చాలా బాగున్నాయి కథలోని ఇంటెన్సిటీ ని చిత్రం ఆసాంతం ఉంచడంలో సంభాషణలు ఉపయోగపడ్డాయి. దర్శకుడు కృష్ణ చైతన్య కి ఇది మొదటి చిత్రం , స్టైలిష్ గా ఉంది కాని కథనం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి.. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది .. సన్నీ అందించిన పాటలు వినద్దనికే కాకుండా చూడటానికి కూడా బాగుంది. నేపధ్య సంగీతం కూడా చిత్రంలో సన్నివేశాలకి ప్రాణం పోసింది అని చెప్పుకోవచ్చు చిత్రానికి ఉన్న హైలెట్స్ లో ఇది కూడా ఒకటి.. ఎడిటింగ్ అసలు బాగాలేదు , రెండవ అర్ధ భాగంలో వచ్చే చాలా సన్నివేశాలను కత్తిరించి ఉండవచ్చు. ఫైట్స్ పరవలేధనిపించారు, సినిమా 5 మరియు మువీమిల్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి..

చిత్రంలో సందేశం ఇవ్వచ్చు కాని సందేశం ఇవ్వడానికి చిత్రాన్ని తియ్యకూడదు ఒక్కసారి సందేశం ఏంటో అర్ధం అయిపోయాక చిత్రం లో ఆసక్తి తగ్గిపోతుంది. ఈ విషయం దగ్గరే "రౌడీ ఫెలో" చిత్రం వెనుకబడింది ఎందుకంటే రెండవ అర్ధ భాగంలో రావు రమేష్ , నారా రోహిత్ అహాన్ని దెబ్బ తీసాక అసలు కథ మొదలవుతుంది కాని అదంతా ఒక్క నిమిషం లో అయిపోతుంది దాన్ని కాస్త విశదీకరించి చూపించి ఉంటె చాలా బాగుండేది.. "నేను సాయం చెయ్యను న్యాయం చేస్తాను" , "చరిత్ర ఎప్పుడు చెడ్డ వాడినే గుర్తు పెట్టుకుంటుంది" , "మనిషి గురించి ఆలోచించే ప్రతి వాడు పిచ్చోడే" లాంటి సంభాషణలు చాలా బాగున్నాయి. ఈ చిత్రంలో చెప్పడానికి మంచి పాయింట్ ఉన్న దర్శకుడు కథనం మీద కాస్త దృష్టి కేంద్రీకరించి ఉంటె మంచి చిత్రం అయ్యేది.. అహాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చు వంటి సందేశాన్ని చెప్పడంలో దర్శకుడు సఫలీకృతుడు అయ్యాడు.. ఈ చిత్రం మొదటి అర్ధభాగం ఆసక్తికరంగా సాగినా కూడా రెండవ అర్ధభాగం కాస్త నెమ్మదిస్తుంది.. ఒకవేళ మీరు నారా రోహిత్ అభిమానులు అయితే తప్పకుండ చూడవలసిన చిత్రం ఇది .. కాకపోతే ఒకసారి ప్రయత్నించదగ్గ చిత్రం...

Nara Rohit,Vishakha Singh,Krishna Chaitanya,T. Prakash Reddy,Sunny M.R.చివరగా : రౌడీ ఫెలో : సందేశం ఎక్కువ విషయం తక్కువ ..

మరింత సమాచారం తెలుసుకోండి: