నిర్మాణ విలువలు ,ఆర్ట్ వర్క్ మరియు గ్రాఫిక్స్ నిర్మాణ విలువలు ,ఆర్ట్ వర్క్ మరియు గ్రాఫిక్స్ పాత్రల తీరు తెన్నులు ,కథనంలో కొత్తదనం లేకపోవడం ,ఎడిటింగ్ ,దర్శకత్వం, క్లైమాక్స్ క్రిష్ ( కే వి సతీష్) మరియు ఆనంది(దియా నికోలస్) ప్రేమించుకుంటూ ఉంటారు. కొన్ని అనుకోని కారణాల వాళ్ళ వీరిద్దరూ లుకేమియా కి మందు కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంటారు. కేరళలో ఉన్న సంజీవిని అనే పదార్థం ద్వారా లుకేమియా కి మందు కనుక్కోవచ్చు అని ఆనంది తెలుసుకుంటుంది. కాగా అగ్ని ప్రమాదంలో అడవి మొత్తం తగలబడిపోతుంది. ఈ మూలికల కోసం క్రిష్ మానస సరోవరానికి బయలుదేరుతాడు. కాని అనుకోని పరిస్థితులో అతని చేతికి భవిష్యవాణి వచ్చి చేరుతుంది. ఆ పుస్తకం తో తిరిగి వచ్చిన క్రిష్ లుకేమియా కి మందు కనుగొనడానికి ప్రయత్నిస్తుంటాడు. యముడు చిత్రగుప్తుడు భవిష్యవాణి కోసం భూమి మీదకి వస్తారు.. క్రిష్ ఆ మందు కనుగోన్నాడా? యముడు మరియు చిత్ర గుప్తుడు భూమి మీద ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి? అన్నదే మిగిలిన కథాంశం... ఈ చిత్రం మొత్తం ఇద్దరి వ్యక్తుల మీద కేంద్రీకృతమయ్యి నడుస్తుంది వైర్ద్దరు లేకపోతే ఈ చిత్రం గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా వ్యర్థమే అవుతుంది వారిద్దరూ ఎవరంటే ఒకరు మోహన్ బాబు మరొకరు బ్రహ్మానందం.. సతీష్ రెడ్డి నటన ఒక్క శాతం కూడా బాగాలేదు అయన మొదటి చిత్రం అయినా కూడా కనీసం భరించే పరిస్థితిలో కూడా అయన నటన లేదంటే అర్ధం చేసుకోవచ్చు. ఇది కాకుండా మరొక చిత్రాన్ని చెయ్యదలచుకుంటే మాత్రం అ ఆ లు నుండి నటనను నేర్చుకొని చిత్రం చేస్తే బాగుంటుంది.. డియ నికోలస్ పాత్ర హీరో కి కష్టమొస్తే నవ్వుతుంది హీరో ని చూసి నవ్వుతుంది అంతే కాని ప్రత్యేకమయిన పాత్ర అంటూ లేదు.. స్పెషల్ సాంగ్స్ లో సద మరియు నిషా కొఠారి లు అందాలతో ఆకట్టుకున్నారు.. కోట శ్రీనివాస రావు , రావు రమేష్ మరియు ఆశిష్ విద్యార్ధి వారి పాత్రలకు న్యాయం చేసారు. గబ్బర్ సింగ్ రౌడీ గ్యాంగ్ , తాగుబోతు రమేష్ మరియు పోసాని కృష్ణ మురళి ఆకట్టుకోలేకపోయారు..మొదటి చిత్రం ఎలా అయితే ఉంటుందో ఈ చిత్రం కూడా అలానే ఉంది కాని చిన్న చిన్న మార్పులు చేసారు. కథ మాత్రమే కాకుండా కథనం లో కూడా ఆ చిత్రం నుండి చాలా అంశాలను తీసుకొని ఇందులో ఉపయోగించుకున్నారు సమస్య అక్కడే వచ్చింది ఆ పాత్రకి సరిపడిన కొన్ని అంశాలు ఇందులో హీరో పాత్రకు అసలు సరిపడలేదు. చిత్రం మొదట బాగానే మొదలయినా కొంత సమయం తరువాత బాగా నెమ్మదిస్తుంది ఒకానొక సమయంలో చిత్రం ఎటువైపుకి కదలకుండా ఒక చోటనే ఉండిపోతుంది.. అంత దారుణమయిన కథనం ఉంది ఈ చిత్రంలో .. కృష్ణ రెడ్డి దర్శకత్వం కూడా పాత చిత్రాలను పోలి ఉంటుంది స్తైలిష్ గా ఉండాల్సిన టేకింగ్ చాలా పేలవంగా ఉంటుంది.. సంభాషణలు అంతంత మాత్రంగానే ఉన్నాయి చేపుకోదగ్గ డైలాగ్ ఒక్కటి కూడా లేదు.. సినిమాటోగ్రఫీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.. సంగీతం కూడా కృష్ణ రెడ్డి నే అందించారు సాహిత్యం బాగుంది కాని పాటలు ఆకట్టుకోలేదు.. నేపధ్య సంగీతం గుర్తించే స్థాయిలో కూడా లేదు.. ఎడిటింగ్ బాగాలేదు కాని కథనం లోని లోపాలు ఎడిటర్ చేతులు కట్టిపడేశాయి.. గ్రాఫిక్స్ మరియు ఆర్ట్ వర్క్ చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు చాలా బాగుంది...ఈ చిత్రంలో ఎం బాగుంది అన్న ప్రశ్నకి ఏమి బాగాలేదు అన్న సమాధానం ఎదురవుతుంది మొదటి చిత్రంలో అలీ నటన మరియు కథ కథనం కామెడీ ఇలా అని వేటికదే అద్భుతం అయ్యి కూర్చున్నాయి ఈ చిత్రం విషయంలో హీరో నటన , కథనం , సంగీతం , కామెడీ బలహీనమయ్యి చిత్రాన్ని దారుణంగా తాయారు చేసాయి. చిత్రం మొదలయిన కాసేపటికే బోర్ అనిపించేస్తుంది ఎందుకంటే తరువాత వచ్చే అన్ని ట్విస్ట్ లు తెలిసిపోతుంటాయి. ఈ చిత్రంలో చెప్పుకోవడానికి ఇంతకు మించి ఎం లేదు యమలీల చిత్రం నచ్చి ఈ చిత్రాన్ని చూస్తే మాత్రం దారుణంగా నిరాశ చెందుతారు. ఈ చిత్రానికి బదులు ఆ చిత్రాన్నే మరొకసారి చూసుకోవడం మంచిది..KV Satish,Diah Nicolas,Mohan Babu,SV Krishna Reddy.యమలీల -2 : యమబోరు

మరింత సమాచారం తెలుసుకోండి: