Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Dec 17, 2018 | Last Updated 12:00 am IST

Menu &Sections

Search

ఎవడే సుబ్రమణ్యం : రివ్యూ

- 2/5
ఎవడే సుబ్రమణ్యం : రివ్యూ ఈ సినిమా రివ్యూ ను తెలుగులో చదవండి

What Is Good

  • సంగీతం
  • సినిమాటోగ్రఫీ
  • అక్కడక్కడా కొన్ని కామెడీ సన్నివేశాలు

What Is Bad

  • డెడ్ స్లో నేరేషన్
  • ఎమోషన్ కనెక్ట్ కాని పాత్రలు
  • ఎడిటింగ్
  • సాగదీసిన సెకండాఫ్
  • సింపుల్ స్టొరీ లైన్
  • డైరెక్షన్
Bottom Line: చివరగా : ఎవడే సుబ్రహ్మణ్యం - మార్కులు శూన్యం.!

Story

సుబ్రహ్మణ్యం (నాని ) ఒక వ్యాపారవేత్త , ఎన్నో ఆశయాలతో ముందుకి సాగుతుంటాడు. " లైఫ్ లో నువ్వు ఎవరు అనేది నీ బ్యాంకు బ్యాలెన్స్ తో నే తెలుస్తుంది" అని నమ్మే వ్యక్తి సుబ్రహ్మణ్యం. పశుపతి(నాజర్) కంపెనీ లో పని చేస్తుంటాడు సుబ్రహ్మణ్యం, ఎలాగయినా రామయ్య(కృష్ణం రాజు) కంపెనీ లో షేర్లు అన్ని కోనేయాలని పశుపతి కల, ఆ కల నెరవేర్చడంలో సుబ్రహమణ్యం కీలక పాత్ర వహిస్తాడు. అతని పనితీరు చూసి కష్టపడే తత్వం నచ్చి రియా సుబ్బు ప్రేమను అంగీకరించి పెళ్లి చేసుకోవలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో గోవా నుండి వచ్చిన రిషి(విజయ్) ఎలాగయినా సుబ్బుని దూద్ కాశి( ఆకాశ గంగ)కి తీసుకు వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు. కాని రామయ్య తిరిగి తన కంపనీలో అధిక షేర్లను స్వంతం చేసుకోవడంతో సమస్య మొదలవుతుంది. ఇది సుబ్బు వల్లనే జరిగింది అని పశుపతి నిందిస్తాడు, తను అమెరికా వెళ్ళేలోపు ఈ సమస్యని పరిష్కరించమని చెప్తుంది రియా . కాని కొద్ది రోజుల తరువాత సుబ్బు అనుకోకుండా ఆనంది(మాళవిక నాయర్) తో కలిసి ధూద్ కాశి బయలుదేరుతాడు. అసలు ఆనంది ఎవరు? సుబ్బు సమస్య నుండి ఎలా బయటపడ్డాడు అన్నదే మిగిలిన కథ ..

Star Performance

ఈ చిత్రం మొత్తాన్ని నాని తన భుజాల మీద నడిపించాడు, అతను పాత్రను మలచిన తీరు అందులో అయన నటించిన విధానం చాలా బాగుంది. తెలివయిన వాడి పాత్రలో మొదటి కొన్ని సన్నివేశాలలో నే అతని పాత్ర మీద ఒక అవగాహన కల్పించాడు . మాళవిక నాయర్ కొత్తగా నటించడానికి ప్రయత్నించింది అంతే కానీ ప్రోమో లో చూపించిన స్థాయిలో ఆమె పాత్ర కొత్తగా లేకపోవడంతో ఆ పాత్ర దారుణంగా తేలిపోయింది. మాళవిక మాత్రం ఈ పాత్రకు న్యాయం చెయ్యడానికి చాలా ప్రయత్నించింది. విజయ్ పాత్రకు తగ్గ ప్రదర్శన ఇచ్చాడు, రీతు వర్మ ఉన్న కాసేపు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి వెళ్లిపోయింది. నాజర్ మరియు పవిత్ర లోకేష్ లు పాత్రకి మరియు వారి స్థాయికి తగ్గ ఇంపాక్ట్ సృష్టించలేకపోయారు.

Techinical Team

ఆకాశ గంగ దాక చేసే ప్రయాణంలో జీవితం అర్ధాన్ని తెలుసుకోవడం ఈ చిత్ర కథ, ఆలోచన అయితే మంచిదే కాని అందుకోసం ఎంచుకున్న కథనం దారుణం - బలహీనం - అసమన్వయం , నాని మరియు విజయ్ లా మధ్య జరిగే వాదన బొత్తిగా ఆసక్తికరంగా సాగదు అసలు వారి వాదన మీద వారికయినా ఒక అవగాహన ఉందో లేదో ప్రేక్షకుడికి అవగాహన రాదూ.. మాళవిక మరియు నాని ట్రాక్ కూడా లేని అనాసక్తిని కలుగజేస్తాయి. అసలు చిత్రంలో సమస్య ఎక్కడ ఉందంటే చిత్రం మొదలయిన పది నిమిషాల్లోనే జరిగింది జరిగేది జరగబోయేది అన్నింటి మీద ఒక అవగాహన వచ్చేస్తుంది. సాధారణ ప్రేక్షకుడు ఎవరయినా తరువాత ఎం జరుగుతుందో ఊహించేయ్యగలడు. ఈ చిత్రం కనీసం ఒక్క సన్నివేశంలో కూడా ప్రేక్షకుడిని చిత్రంలో లీనం అవ్వనివ్వలేదు. నాని పాత్ర నచ్చినా కూడా అతని పాత్రకు కనెక్ట్ అవ్వడం చాలా కష్టం అతని వ్యక్తిత్వం అతని నిర్ణయాలు భావాలు పాత్రను తీర్చి దిద్దిన విధానం చిత్రానికి ప్రధాన లోపం ఏ స్థాయిలో కూడా అతని పాత్ర మీద ప్రేక్షకుడికి ఒక అభిప్రాయం కలగదు చివర్లోకి వచ్చేసరికి చిత్రం చాలా సాధారణంగా తయారవుతుంది. కథ చెప్పిన విధానం కూడా చాలా సాదా సీదాగా సాగడంతో అనాసక్తిగా తయారయ్యింది చిత్రం. కృష్ణం రాజు గారి పాత్ర వలన చిత్రానికి ఒరిగిందేమీ లేదు. సాంకేతికంగా కూడా ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ అంశాలు పెద్దగా లేవు, సినిమాటోగ్రఫీ ఏదో అలా అలా సాగిపోయింది. కాశ్మీర్ అందాలను మరింత అందంగా చూపించి ఉండాల్సింది అనిపించింది. రథన్ అందించిన సంగీతంలో ఒక పాట వినడానికి మరియు చూడటానికి కూడా బాగుంది. నేపధ్య సంగీతం చాలా బాగుంది. మిగిలిన పాటలు వినడానికి పరవలేధనిపించినా తెర మీద ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ విషయంలో మరి కాస్త కటువుగా వ్యవహరించి మరిన్ని సన్నివేశాలను కత్తిరించి ఉండాల్సింది ఈ చిత్రంలో ప్రధాన లోపం చిత్రం లో అనవసరమయిన లాగ్ లు.. చిత్రం ప్రతి నిమిషానికి రెండు సార్లు బ్రేక్ లు వేసిన ఫీలింగ్ వస్తుంది. స్వప్న సినిమాస్ వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

Analysis

ఆత్మ పరిశోధన , ప్రతి మనిషి ఏదో ఒక రోజు తనని తను ఆవిష్కరించుకుంటాడు అందుకోసం జరిగే ఆత్మ పరిశోధన ఏదో ఒక సమయంలో ఒక ప్రయాణం ద్వారానో లేదా పరిచయం ద్వారానో మొదలవుతుంది. ఈ చిత్రంలో ఉపయోగించారు కాని ఆ పాయింట్ ని సరయిన పద్దతిలో చెప్పలేకపోయారు. మనిషి అంతరాన్ని తెలపాలి అంటే మనిషి అంతరాన్ని తాకగల స్థాయి ఉన్న వాళ్ళ సన్నివేశాలను రాసుకోవాలి ఈ చిత్రంలో అవే కరువయ్యాయి. అలా అని చిత్రంలో అటువంటి సన్నివేశాలే లేవని కాదు అక్కడక్కడా కొన్ని కనిపిస్తాయి అవన్నీ కూడా ట్రైలర్ లో కనిపించేసిన సన్నివేశాలే అవ్వడంతో అవి కూడా ఆసక్తికరంగా అనిపించవు. బలమయిన ఆలోచన ఒకటి బలహీనమయిన కథనానికి బలి అయిపోయింది అనుకోవడం తప్ప చెప్పుకోడానికి ఎం లేదు ఈ చిత్రంలో, మీరు నాని ఫ్యాన్ అయితే లేదా చెయ్యడానికి ఏ పనీ లేకపోతే ఈ చిత్రాన్ని ప్రయత్నించండి..

Cast & Crew

4 / 5 - 794550
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS

Tollywood

View all
Odiyan Movie Review, Rating

Odiyan Movie Review, Rating

Aquaman Movie Review, Rating

Aquaman Movie Review, Rating

Kavacham Movie Review,Rating

Kavacham Movie Review,Rating

Kollywood

View all
Odiyan Movie Review, Rating

Odiyan Movie Review, Rating

Aquaman Movie Review, Rating

Aquaman Movie Review, Rating

2.0 Movie Review, Rating

2.0 Movie Review, Rating

Bollywood

View all
Aquaman Movie Review, Rating

Aquaman Movie Review, Rating

2.0 Movie Review, Rating

2.0 Movie Review, Rating