కొన్ని పాటల పిక్చరైజేషన్ , ఆకాష్ పూరి పెర్ఫార్మన్స్ , కొన్ని వన్ లైన్ డైలాగ్స్కొన్ని పాటల పిక్చరైజేషన్ , ఆకాష్ పూరి పెర్ఫార్మన్స్ , కొన్ని వన్ లైన్ డైలాగ్స్ఊహాజనితమైన స్క్రిప్ట్ , నత్తకన్నా స్లోగా సాగే నెరేషన్ , ఎడిటింగ్ , బలవంతంగా ఇరికించిన కామెడీ బిట్స్ , సెకండాఫ్ , డైరెక్షన్

ముందుగా ‘ఆంధ్రాపోరి’ సినిమా 2014లో మరాఠీలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ‘టైం పాస్’ సినిమాకి రీమేక్.. ఇక ఆంధ్రాపోరి కథలోకి వస్తే.. ఈ సినిమా 1990లో మొదలవుతుంది.. పేద కుటుంబంలో పుట్టి, ఎందుకు పనికిరాడు అనిపించుకునే నిజామాబాద్ నర్సింగ్ యాదవ్ (ఆకాష్ పూరి)కథే ఈ సినిమా. నర్సింగ్ యాదవ్ వాళ్ళ అమ్మ ఇచ్చిన టిఫిన్ బాక్స్ లను కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఎంప్లాయీస్ కి ఇవ్వడంలో ప్రతిసారి ఫెయిల్ అవుతుంటాడు, అలాగే 10వ తరగతిలో కూడా కంటిన్యూగా ఫెయిల్ అవుతూ ఉంటాడు. దాంతో వాళ్ళ అమ్మ ఇంటి నుంచి వెల్లగొడుతుంది. అలా బయట వచ్చేసిన నర్సింగ్ బతకడం కోసం వేణు గోపాల్ థియేటర్ లో పనికి చేరతాడు. అక్కడ నర్సింగ్ ఫ్రెండ్స్.. ప్రతి ఒక్కరి లైఫ్ లోనూ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలని, ’సక్సెస్ అయిన ప్రతి మగాడి వెనుక ఒక ఆడది’ ఉంటుందని చెబుతారు. దాంతో మన హీరో నర్సింగ్ యాదవ్ కళ్ళు అప్పర్ కాస్ట్ అమ్మాయి అయిన ప్రశాంతి(ఉల్కా గుప్త) మీద పడతాయి. చాలా త్వరగానే తనతో ప్రేమలో పడతాడు. ఇద్దరూ చాలా తక్కువ టైంలో ప్రేమలో పడటానికి దోహద పడిన విషయాలేమిటి.? అలా ప్రేమికులైన వారి మధ్య వచ్చిన సమస్యలేమిటి.? చిన్న వయసులోనే ప్రేమలో పడిన వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది.? వీరిద్దరి లైఫ్ లో వచ్చిన ట్విస్ట్ లు ఏంటి.? అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి.

ఆంధ్రాపోరి సినిమాలో అందరి పెర్ఫార్మన్స్ లు అటు ఇటు గా ఒకే స్టాండర్డ్ గా ఉన్నాయి. ఇకపోతే సినిమాలో చాలా ఎపిసోడ్స్ బాగా రిపీట్ గా అనిపిస్తాయి. సరిగా పాత్రలని ఎస్టాబ్లిష్ చెయ్యలేదు. ఇక నటీనటుల విషయానికి వస్తే ధోని, ది లోటస్ పాండ్, గబ్బర్ సింగ్, బుజ్జిగాడు సినిమాలతో చైల్డ్ యాక్టర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న ఆకాష్ పూరి సోలో హీరోగా చేసిన మొదటి సినిమా ఆంధ్రాపోరి. చూడటానికి ఆవారా లాగా కనిపించడంలో, అలాగే అమ్మాయిని చూడగానే లవ్ లో పడే అబ్బాయిగా ఆకాష్ పూరి బాగా చేసాడు. అక్కడి వరకూ బాగానే సెట్ అయ్యాడు. కానీ మెలోడ్రామా, హీరో పాత్రలో మైంటైన్ చెయ్యాల్సిన మానరిజమ్స్ విషయంలో ఇంకాస్త వర్కౌట్ చెయ్యాల్సిన అవసరం ఉంది. అలాగే డాన్సుల్లో ఇంకాస్త గ్రేస్ ఉండేలా చూసుకోవాలి. ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఉల్కా గుప్త(ఝాన్సీ కి రాణి టీవీ సీరిస్ ఫేం) విషయానికి వస్తే.. ఉల్కా గుప్త సినిమాలోని ప్రధాన పాత్రల ముందు క్యూట్ గా నవ్వడానికి తప్ప ఇకదేనికీ పెద్దగా ఉపయోగపడలేదు. మెయిన్ మెయిన్ సీక్వెన్స్ లలో తన డబ్బింగ్ కూడా లిప్ మూమెంట్ కి అస్సలు సింక్ అవ్వలేదు. ప్రశాంతి కోపిష్టి ఫాదర్ గా శ్రీకాంత్ అయ్యంగర్ నటన డీసెంట్. అనుకున్న స్థాయిలో అతని పాత్ర క్లిక్ అవ్వలేదు. మదర్ పాత్రలో ఈశ్వరి రావు మంచి నటనని కనబరిచింది. ప్రేమ ఇష్క్ కాదల్ ఫేం శ్రీముఖి మరియు అరవింద్ కృష్ణ అతది పాత్రల్లో తమ పాత్రలకు న్యాయం చేసారు. ఉత్తేజ్, డిఎంకె, డా.కృష్ణ స్వామి, అభినయ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించి వెళ్ళిపోయారు.   

పైన చెప్పినట్టు మరాఠీ సూపర్ హిట్ ఫిల్మ్ ‘టైం పాస్’ అనే సినిమాకి ఆంధ్రాపోరి రీమేక్.. ఇక ఈ రీమేక్ కథలోకి వస్తే... ఇదొక ఇద్దరు టీనేజర్స్ వాళ్ళ యుక్త వయస్సులో ఒకరికొకరు అట్రాక్ట్ అవ్వడమే ఈ సినిమా మేజర్ స్టొరీ లైన్. అది కూడా ఓ పెద్దింటి క్లాస్ అమ్మాయి, ఆవారాగా తిరిగే ఓ మాస్ అబ్బాయి. కట్ చేస్తే వీరిద్దరి మధ్యా ప్రేమ.. ఫైనల్ గా చిన్న చిన్న అడ్డంకులు.. ఇదే కథ.. ఈ సినిమా కథని ఇప్పటికే మనం చాలా.. చాలా అంటే చాలా సార్లు చూసేసి బోర్ కొట్టేసిన కథ. అలాంటి కథని అంతకన్నా బోరింగ్ గా, మరింత ఊహాజనితంగా తీసిన సినిమానే ‘ఆంధ్రాపోరి’. ఈ సినిమా విషయంలో ప్రధానంగా ఫెయిల్ అయ్యింది అంటే స్టొరీ నేరేషన్.. నేరేషన్ స్టార్టింగ్ నుంచి చివరి దాకా బోరింగ్ గా సాగడం ఆడియన్స్ ని బాగా చిరాకుపెట్టే విషయం.


అరవింద్ కృష్ణ – శైలజ సుప్రియ నటించిన ‘ఋషి’ సినిమాతో రాజ్ మదిరాజు డిరెక్టర్ గా తన ప్రయాణం మొదలు పెట్టాడు. ఆ సినిమాలో మెడికల్ స్టూడెంట్స్ యొక్క లైఫ్ ని మరియు ఓ మెడికల్ కేసు కోసం అరవింద్ కృష్ణ ఫైట్ చెయ్యడాన్ని చూపించాడు. కానీ రెండవ ప్రయత్నంగా తన ట్రాక్ మార్చి ఆంధ్రాపోరి అనే ఒక టీనేజ్ లవ్ స్టొరీతో మన ముందుకు వచ్చాడు. రాజ్ మదిరాజు సినిమా మొదట్లో మనల్ని నిరుత్సాహపరచలేదు. కానీ ఎప్పుడైతే కథలో ఒకేసారి రొమాన్స్, కామెడీ, బలవంతంగా ఎమోషన్స్ ని ఇరికించడం మరియు చివరికొచ్చే సరికి ఓ మెసేజ్ ఇవ్వాలనుకున్నాడో అప్పుడే అసలైన సమస్య మొదలైంది. ఆ సమస్య ఏమిటంటే పైన చెప్పిన వేటిలోనూ ప్రేక్షకుడు ఇన్వాల్వ్ కాకపోవడం.. పైన చెప్పిన ఎదో ఒక ఎమోషన్ కి ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యేలా చెప్పగలిగి ఉంటే బాగుండేది.

 

మరాఠీలో సక్సెస్ అయిన విషయం టీనేజ్ పాత్రల్లో కనిపించే అమాయకత్వంతో ప్రేక్షకులు ప్రేమలో పడతారు కానీ తెలుగు విషయానికి వచ్చే సరికి రైటర్స్ మరియు డైరెక్టర్ రెగ్యులర్ మరియు అనవసరమైన, నమ్మశక్యం కాని సీన్స్ ని కథలో జత చేసారు. అవన్నీ మనకి పాత్రల్ని ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యకుండా చేసాయి. కథకి సింక్ కానివి నాకు అనిపించిన కొన్ని పాయింట్స్ మీకు చెబుతాను.. 1990లలో అది కూడా కొత్తగూడెం లాంటి ప్లేస్ లో స్కూల్ కి వెళ్ళే అమ్మాయిని ఒక పోరడు నడి రోడ్లో ఆపడం, టీజింగ్ చెయ్యడం, అలాగే మెయిన్ రోడ్ లోనే తనకి ప్రపోజ్ చెయ్యడం, అది చూసి అక్కడ ఉన్న ప్రజలు ఎవరూ స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది. ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే ఇప్పట్లో ఇది పెద్ద మేటర్ కాకపోవచ్చు కానీ కథ ప్రకారం అది 1990.. ఆ టైంకి అది కరెక్ట్ కాదు. ఇక సెకండ్ పాయింట్ విషయానికి వస్తే.. మ్యూజిక్ టీచర్ సప్న(శ్రీ ముఖి) ఒక వ్యక్తి ప్రేమలో ఉండాలి అంటే మ్యూజిక్ లోని స్వరాలను ఫీలవ్వాలని చెబుతుంది. నా వరకూ చెప్పిన విధానం, ఆ పాయింట్ చాలా సిల్లీగా అనిపించింది. ఇక చివరిగా గోపాల్ రావు సమాజంలోని విలువలని నమ్ముతాడు.. కానీ ఆకాష్ – ఉల్కా గుప్తల మధ్య లవ్ ని బ్రేక్ చేస్తాడు, కానీ చివర్లో మాత్రం అరవింద్ – శ్రీ ముఖిలను కలిపి ఉంచుతాడు.

  

డా. జే మ్యూజిక్ సినిమాకి ఏ మాత్రం హెల్ప్ కాలేదు. పాటలు పెద్దగా కనెక్ట్ కాలేదు, అంతకన్నా దారుణంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ ఓకే అనేలా ఉంది. సినిమా చాలా ఫాస్ట్ గా తీయడం వలన యావరేజ్ గా విజువల్స్ ఉన్నాయి. ఈ సినిమా కథ ప్రకారం డైలాగ్స్ ఇంకాస్త ఆసక్తికరంగా ఉండాల్సింది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తన కత్తెరకి ఇంకాస్త పని చెప్పి ఉండాల్సింది. చాలా సింపుల్ స్టొరీ లైన్ కి 140 నిమిషాల రన్ టైం అనేది చాలా ఎక్కువ. సినిమాలో వచ్చే డ్రీం సీన్స్, కొన్ని పాటలని కత్తిరించేయాల్సింది. విజువల్ ఎఫెక్ట్స్ పెద్ద బాలేవు. ఎల్.వి ప్రసాద్ ప్రొడక్షన్స్ వారి నిర్మాణ విలువలు జస్ట్ ఓకే.

అనుకున్న దాని ప్రకారం అయితే ఆంధ్రాపోరి సినిమా ఓ ఇన్నోసెంట్ టీనేజ్ లవ్ స్టొరీ గా మిగిలిపోవాలి, అలాగే మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ సినిమా కూడా అవ్వాలి. కానీ మేకర్స్ ఎప్పుడైతే ఒరిజినల్ కథకి మన నేటివిటీకి మ్యాచ్ చెయ్యాలని ట్రై చేసారో అప్పుడు ఆ ఇన్నోసెంట్ టీనేజ్ లవ్ లోని మేజిక్ ని కాప్చ్యూర్ చెయ్యలేకపోయారు. దాంతో సినిమా తుస్సుమంది.  సినిమా స్టొరీ ఎంత రెగ్యులర్ అయినా అందులో మేజిక్ ని క్రియేట్ చెయ్యగలిగితే సినిమా సక్సెస్ అవుతుంది, ఆ కీ పాయింట్ ని ఇందులో మిస్ చేసారు, ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. ఎవరైతే రాజ్ మదిరాజు ‘ఋషి’ సినిమా చూసి ఓ మంచి సినిమా చేసాడని అనుకున్నారో వారు ఆంధ్రాపోరి సినిమా చూసి కచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఎందుకంటే రాజ్ మదిరాజు ఈ ఆంధ్రాపోరి సినిమాతో అటు రైటర్ గానూ, ఇటు డైరెక్టర్ గానూ ఫెయిల్ అయ్యాడు. చివరిగా ‘ఆంధ్రాపోరి’ సినిమా ఎవ్వరినీ ఎంటర్టైన్ చేయలేకపోయింది.

Aakash Puri,Ulka Gupta,Raj Mudiraju,Ramesh Prasad,Josyabhatla.పంచ్ లైన్ : ఆంధ్రాపోరి – వృధా ప్రయాసగా మిగిలిన మరో రీమేక్.

మరింత సమాచారం తెలుసుకోండి: