ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గామారిన న్యూస్ బాహుబలి2. ఇండియా వ్యాప్తంగా ఎవ్వరూ ఊహించినంతగా ఈ పీరియాడికల్ ఫిల్మ్ రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. ప్రస్తుతం దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో..బాహుబలి2 మూవీకి సంబంధించిన పనులు సెట్స్ మీద జరుగుతున్నాయి. ఇండియా వ్యాప్తంగా ఈ మూవీ 600కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చెయ్యడమే కాకుండా... మూవీని చూపిన ప్రతి ఒక్కరిని సీక్వెల్ పై ఆసక్తిని పెంచేలా చేశాయి.


ఇదిలా ఉంటే, తాజాగా రాజమౌళి బాహుబలి కి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పై కామెంట్స్ చేశాడు. ‘బాహుబలి విషయంలో గర్వంగా ఫీల్ అయ్యే విషయం ఒకటి ఉంది. వేల మిలియన్ డాలర్స్ పెట్టి హాలీవుడ్ మూవీలకి విజువల్ ఎఫెక్ట్స్ చేస్తారు. కానీ నేను కేవలం 22 కోట్లతో ఈ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇవ్వడం అనేది గర్వంగా ఫీలయ్యేలా చేసిందని’ రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఈ మూవీకి సంబంధించని విజువల్ ఎఫెక్ట్స్ ని మకుట గ్రాఫిక్స్ వారు చూస్తున్నారు.


ఇక బాహుబలి2 సంబంధించని విజువల్ గ్రాఫిక్స్ ని మరో సంస్థకి రాజమౌళి ఇవ్వాలని కొన్ని నెలల క్రితం చూశాడంట. ఆ సమయంలో రాజమౌళి కి ఓ ప్రముఖ హాలీవుడ్ సంస్థ దిమ్మతిరిగే రేటు చెప్పింది. బాహుబలి2 సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ కోసం దాదాపు 80 కోట్ల రూపాయలను చార్జ్ చేస్తాం అని చెప్పుకొచ్చింది. ఇదే వర్క్ ని పాత టీంతో చేయిస్తే కేవలం 30 కోట్ల రూపాయలలోనే పూర్తవుతుంది. ఇంత వేరియేషన్ వచ్చేసరికి రాజమౌళి, గ్రాఫిక్స్ కంపెనీని  మార్చే ప్రయత్నాన్ని మానుకున్నాడు.


కానీ నిర్మాతలు మాత్రం క్యాలీటి కోసం ఖర్చు ఎంత పెరిగినా ఇబ్బంది లేదన్నట్టుగా రాజమౌళికి ఫుల్ ఆర్డర్స్ ఇచ్చారంట. మొత్తంగా రాజమౌళి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నప్పటికీ...అనవసరమైన ఖర్చులను మాత్రం నిర్మాతలపై రుద్దడని నమ్మకం అందరిలో ఉంది. దీంతో రాజమౌళి నిర్ణయం మార్చుకోవటం వల్ల దాదాపు 50 కోట్ల రూపాయలను సేవ్ అయినట్టే అని నిర్మాతలు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: