బాణం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో నారా రోహిత్. అయితే మనోడికి హీరోగా గుర్తింపు తెచ్చింది మాత్రం సోలో సినిమా. ఆ సినిమా హిట్ రోహిత్ కు ఊపందించినా కెరియర్లో సినిమాలైతే చేస్తున్నాడు కాని హిట్ బాట మాత్రం పట్టిచలేకపోతున్నాడు రోహిత్. లాస్ట్ ఇయర్ రౌడి ఫెల్లో, అసుర సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నారా రోహిత్ ఈసారి తుంటరిగా వస్తున్నాడు. 


సోలో వరకు సన్నగా ఉన్న రోహిత్ కాస్త లావెక్కే సరికి క్యారక్టర్స్ అన్ని సూటవ్వలేదని ఫీడ్ బ్యాక్స్ వచ్చాయి. అందుకే ప్రస్తుతం నటిస్తున్న తుంటరి సినిమాలో సిక్స్ ప్యాక్ దేహ దారుడ్యంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గుండెల్లో గోదారి, జోరు డైరెక్ట్ చేసిన కుమార్ నాగేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్ సరసన లతా హెగ్డె నటిస్తుంది.


తమిళ హిట్ మూవీ మాన్ కరాటే రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఆవారాగా తుంటరి పనులను చేసుకుంటూ తిరిగే ఓ కుర్రాడు సడెన్ గా బాక్సర్ గా మారి ఎలా తన రివేంజ్ తీర్చుకున్నాడనేది సినిమా కథ. సినిమా కోసం నారా రోహిత్ ఎక్కువ హోం వర్క్ చేస్తున్నాడని తెలిసింది. ప్రస్తుతం చేతిలో అరడజను సినిమాల దాకా ఉన్న రోహిత్ వాటన్నటిని హిట్ బాట పట్టించాలనే కసితో ఉన్నాడు. ఒక క్రేజ్ వచ్చేదాకా తప్పదని భావించిన రోహిత్ సినిమా కోసం తగినంత కృషి చేస్తున్నాడట.


రీసెంట్ గా రిలీజ్ అయిన తుంటరి సినిమా పోస్టర్స్ లో కొత్తగా కనపడుతున్న రోహిత్ ఈ సినిమాతో స్టైలిష్ ఇమేజ్ ని కూడా పొందుతాడనడంలో సందేహం లేదు. ఈ నెల చివరన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియో త్వరలో రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్. అసుర సినిమా పర్వాలేదనిపించినా జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. అందుకే ఈసారి తన సినిమాలను ఎక్కువ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు రోహిత్.


మరింత సమాచారం తెలుసుకోండి: