అక్కినేని నట వారసుడు నాగార్జున తాజాగా నటించిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన. ప్రస్తుతం థియోటర్స్ వద్ద సోగ్గాడే చిన్ని నాయన మూవీ హల్ చల్ చేస్తుంది. ఎంతలా అంటే సోగ్గాడే చిన్ని నాయన మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ఈ మూవీ రిలీజ్ సమయంలో తక్కువ థియోటర్స్ లో రిలీజ్ అయింది. తరువాత హిట్ టాక్ ని తెచ్చుకొని...చిన్నగా థియోటర్స్ ని పెంచుకుంటుంది.


ఇక నైజాంలో ఈ మూవీ కి బిజినెస్ బాగా జరుగుతుంది. కలెక్షన్స్ నిలకడగా ఉండటం విశేషం. ఇక నైజాం లో ఈ మూవీ సాధించిన కలెక్షన్స్ వివరాలను చూస్తే.. అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయంలో చేసిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘సోగ్గాడే చిన్ని నాయనా’. మొదటి షో నుంచే సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ అనే టాక్ ని కూడా సొంతం చేసుకుంది.


నైజాంలో ఈ మూవీ ఇప్పటి వరకూ అంటే మొదటి 6 రోజుల్లో 5 కోట్ల 30 లక్షల షేర్ ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ నైజాం మార్కెట్ లో 7కోట్ల మార్క్ ని ఈజీగా టచ్ చేస్తుందని అంటున్నారుఓవరాల్ గా ఈ మూవీ విడుదల అన్నీ సెంటర్స్ నుండి మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ విధంగా సోగ్గాడే చిన్ని నాయన మూవీ నైజాంలో సత్తా చాటుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: