బాలీవుడ్ లో 100 కోట్లకు పైగా కలెక్షన్లు సంపాదించిన చిత్రాలు ఇటీవలి కాలంలో పెరిగాయి. సల్మాన్ పుణ్యమాని... బాలీవుడ్ లో పండగ మొదలైంది. వాంటెడ్, దబాంగ్... ఇప్పుడు ఆ జాబితాలో దబాంగ్ 2 కూడా చేరనుందని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. నిజానికి ఈ సినిమా 100నే కాదు... 200 కోట్ల మార్కునూ చేరుతుందంటున్నాయి కలెక్షన్లు. శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమా... ఈ మూడురోజుల్లోనే సుమారు 64 కోట్ల రూపాయలు వసూలు చేసిందట. ఈ జోరు ఇలాగే కొనసాగితే... ఈ వారాంతానికి సినిమా ఏకంగా వందా... నూట యాభైని కూడా క్రాస్ చేసేస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే... మూడు వారాలు గడిచేసరికి రూ.200 కోట్లు దాటడం ఖాయమని చెబుతున్నారు. అదే జరిగితే... భారతదేశంలో రూ.200 కోట్ల మార్కు దాటిన తొలి సినిమా ఇదే అవుతుంది. సో, సల్లూ భాయ్... తన రికార్డులను తానే బద్దలు కొట్టనున్నాడన్నమాట. అదే, జరిగితే... బాలీవుడ్ కి పండగ కి ముందే పండగ వచ్చినట్టే.  

మరింత సమాచారం తెలుసుకోండి: