బాహుబలి సినిమాతో హీరో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. తెలుగు సినిమా లోనే యావరేజ్ గా క్రేజ్ ఉండే ప్రభాస్ కి బాహుబలి సినిమా దెబ్బతో దేశ వ్యాప్తంగా ఫాన్స్ విపరీతంగా పెరిగిపోయారు. ప్రభాస్ కి బాహుబలి మొదటి భాగం విపరీతమైన డబ్బుని అందించింది అంటున్నారు. మనకి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ తన సన్నిహితులకి భారీగా పార్టీలు ఇస్తున్నాడు. అది కూడా అత్యంత ఖరీదైన గెస్ట్ హౌస్ లలో అత్యంత ఖరీదైన పార్టీలు. వారి బట్టలకీ, లిక్కర్ కీ మ్యూజిక్ కీ ప్రభాస్ దారుణంగా ఖర్చు పెడుతున్నాడు. దాదాపు ఒక నెలలో ముప్పై లక్షల రూపాయలకి పైగా ప్రభాస్ ఖర్చు పెడుతున్నాడు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.




పుట్టిన రోజు వేడుకలూ, ఇంట్లో వారి వ్యవహారాల పండగలూ అయితే ఈ ఖర్చు డబల్ అవుతోంది. నీళ్ళ లాగా డబ్బులు ఖర్చు పెడుతున్న ప్రభాస్ దగ్గర వారి సలహాలు కూడా పట్టించుకోవడం లేదు అంటున్నారు. ప్రభాస్ ఒక మంచి స్నేహితుడు అందరికీ. తన సొంత ఇంటి నుంచి భోజనం వండించి మరీ హైదరాబాద్ లో బాహుబలి 2 షూటింగ్ లో ఉన్న ప్రముఖ సభ్యులు అందరికీ స్వయంగా వడ్డిస్తున్నాడు అంటున్నారు. లక్షలకి లక్షలు పార్టీల మీద, డిన్నర్ ల మీద స్పెండ్ చేస్తున్న మనోడుకి బాహుబలి ఇచ్చిన డబ్బులే ఇలా వృధా చేస్తున్నాడు అంటున్నారు. ఏదైనా ఇన్వెస్ట్ చేసుకుంటే పెరుగుతుంది కానీ ఎందుకు ఇలా వృధా చేస్తున్నాడు అని వాపోతున్నారు కొందరు.

మరింత సమాచారం తెలుసుకోండి: