బాహుబలి కంక్లూజన్ మరో సంవత్సరంలో రిలీజ్ అవుతున్న ఈ సందర్భంలో మొదటి పార్ట్ కు సంబందించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు సినిమా స్టామినాను ప్రపంచస్థాయిలో చాటిన బాహుబలి మొదటి పార్ట్ తోనే ఎన్నో సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమా గురించి ఎవరేం మాట్లాడినా అదో సెన్షేషనే.. అందుకే పాప్ సింగర్ స్మిత మొన్నామధ్య కిలికి సాంగ్ రిలీజ్ చేసింది.    


ఇప్పుడు అదే క్రేజ్ తో కేరళకు చెందిన అంజూ జోసెఫ్ ఇప్పుడు బాహుబలిలోని ధీవర సాంగ్ ట్రిబ్యూట్ తో సరికొత్త సంచలనాన్ని సృష్టిస్తుంది. బాహుబలిలోని ధీవర సాంగ్ ఎంత సూపర్ హిట్ అనేది మనకు తెలుసు ఇప్పుడు ఆ సాంగ్ ను అంజు జోసెఫ్ అండ్ టీం సరికొత్త ప్రయత్నంగా దీన్ని పాడి ట్రెండ్ సృష్టిస్తుంది. కేరళకు చెందిన ఈ టీం ఇకనుండి ఇలాంటి ట్రెండ్ క్రియేటెడ్ సాంగ్స్ తో రీమిక్స్ చేసి యూట్యూబ్లో పెట్టనున్నారట.


అంతేకాదు మొదటగా బాహుబలి సాంగ్ చేసిన వీరు ప్రేక్షకుల నుండి ఆదరణ లభించాలని కోరుకుంటున్నారు. సింగర్ గా ఉన్న అంజు ఇప్పుడు ఈ సరికొత్త రీమిక్స్ పాప్ ఆల్బమ్స్ కు శ్రీకారం చుట్టింది. పాట సినిమాలో ఎంత హిట్టో ఆ ఫీల్ని మిస్ చేయకుండా ఇంకా అదరగొట్టేలా మిక్స్ చేశారు అంజు జోసెఫ్ అండ్ టీం.   


మరి ఇంకెందుకు ఆలస్యం అంజు జోసెఫ్ ఆలపించిన ధీవర సాంగ్ ఎలా ఉందో మనము చూసేద్దాం రండి. వైట్ అండ్ వైట్ లుక్స్ తో.. గ్రాండ్ లొకేషన్స్ లో షూట్ చేసిన ఈ సాంగ్ ట్రిబ్యూట్ తో తమ సత్తా ఏమిటో చాటారు ఈ యువత. టీం మొత్తం ఈ పాటలో పాటిస్పేట్ చేసినట్టు కనిపించింది. మరి శ్రోతలను అలరించేందుకు కొత్త ప్రయోగాలతో వస్తున్న ఈ టీం కు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. 



మరింత సమాచారం తెలుసుకోండి: