నందమూరి బాలకృష్ణ వరుసగా డిజాస్టర్స్ ని అందుకుంటున్న సమయంలో ఆపద్భాందవుడిలా వచ్చి వరుస సక్సెస్ లను ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ విషయాన్ని ఏ ఒక్కరూ కాదనలేరు. సింహా మూవీ సక్సెస్ తరువాత బాలకృష్ణ సినిమాలకి మళ్ళీ ఊపిరి వచ్చినట్టు అయింది.  ఆ తరువాత నుండి వస్తున్న సినిమాలు అన్నీ బాలకృష్ణ కి విజయాన్ని చేకూరుస్తూ వస్తున్నవే.

ఇలాంటి సమయంలో ఇప్పుడు బాలకృష్ణ 100వ సినిమా హాట్ టాపిక్ గా మారింది. అయితే బాలకృష్ణ 100వ సినిమాకి డైరెక్టర్ ఎవరు అన్నదానిపై ఓ క్లారిటి వచ్చిన తరువాత కూడ...ఈ విషయంలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాత్రం హీరోపై కోపంగానే ఉన్నాడని అంటున్నారు. దర్శకుడు క్రిష్, బాలకృష్ణ 100వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడంటూ ఇప్పటికే ఇండస్ట్రీలో న్యూస్ కన్ఫర్మ్ అయింది.

ఇక దీని గురించి అధికారికంగా ప్రకటన రావటమే ఆలస్యం. బాలయ్య – క్రిష్ కాంబినేషన్‍లో తెరకెక్కే సినిమాను ఉగాది కానుకగా ఏప్రిల్ 8న పూజా కార్యక్రమాలను జరుపుకోనుందని అంటున్నారు. అలాగే ఏప్రిల్ 22 నుంచి ఈ సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు.

అయితే బాలకృష్ణ తనని కాదని మరో డైరెక్టర్ కి అవకాశం ఇవ్వటంతో బోయపాటి శ్రీను... బాలకృష్ణ కి దాదాపు గత 3 నెలల నుండి దూరంగా ఉంటున్నాడని అంటున్నారు. బాలకృష్ణ ఫోన్ కాల్ కి సైతం తను సరిగా ఆన్సర్ చేయటం లేదని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: