క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ లో పవన్ కళ్యాణ్ ని మించిన వాళ్ళు లేరు అని పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నిరూపించింది. ఈ సినిమా కోసం టికెట్ల విషయంలో జనాలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. థియేటర్ లకి థియేటర్ లు విడుదల చేసినా ఇంకా టికెట్ ల కోసం కొట్టుకున్నారు జనం. తొలి షో నుంచే నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవ్వడం తో ఈ సినిమాబాక్స్ ఆఫీస్ దగ్గర  పెద్దగా రాణించలేదు . వీకెండ్ ల కలక్షన్ విషయం లో ఇప్పటికే టికెట్ లు బుక్ అయిపోయి ఉండడం తో కలక్షన్లు బాగానే లాగేసింది కానీ సోమవారం నాటికి సినిమా ని చాలా చోట్ల ఊపిరి , సావిత్రి లతో రీప్లేస్ చేసి పారేశారు. 

 

 

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అయితే ఏకంగా నాలుగు పేరుగాంచిన పెద్ద థియేటర్ లలో సర్దార్ ని విడుదల చేసేసారు కానీ రెండవ రోజుకే ఒక థియేటర్ తీసేశారు, సోమవారం నాటికి ఇంకోటి పీకేశారు. మిగితా రెండు థియేటర్ లలో కూడా ఫాన్స్ తప్ప ఎవ్వరూ సినిమా చూడడానికి ఆసక్తి చూపించక పోవడం తో కలక్షన్ లు అంతంత మాత్రంగా ఉన్నాయి. సినిమా ఫస్ట్ వీక్ నలభై కోట్ల దాకా షేర్ కలక్ట్ చేసింది ఫుల్ రన్ లో మరొక 10 కోట్లు రావచ్చు కానీ బయ్యర్లు మాత్రం దాదాపు ముప్పై కోట్లకి మునిగిపోయారు. బాహుబలి రికార్డులు కూడా మొదటి రోజున తుడిచేసిన పవన్ కళ్యాణ్ చివరకి నష్టాల విషయం లో కూడా భారీ రికార్డు కొట్టేలా ఉన్నాడు. ప్లాప్ అయినా యాభై కోట్ల మార్క్ అందుకున్న తొలి తెలుగు సినిమా ఇదే .


మరింత సమాచారం తెలుసుకోండి: