సినిమా ఇండస్ట్రీ లో పైకి రావడానికి బ్యాక్ గ్రౌండ్ గానీ గాడ్ ఫాథర్ గానీ లేకుండా రాణించడం చాలా కష్టమైన విషయం. అప్పట్లో అది పాజిబుల్ అయ్యింది కానీ ఇండస్ట్రీ కబంద హస్తాలలోకి వెళ్ళిపోయాక జరిగే పనైతే కాదు, ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా దారుణంగా ఫెయిల్ అయిన హీరోలు కూడా ఉన్నారు దానికి పెర్ఫెక్ట్ ఉదాహరణ దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు గారి పుత్ర రత్నం దాసరి అరుణ్. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేకుండా అతను దాదాపు పదేళ్ళ క్రితమే ఇండస్ట్రీ లోంచి వెళ్ళిపోయాడు .



 

 ప్రస్తుతం నిర్మాత అయ్యే ఆలోచనలో ఉన్న ఇతను ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురుకొంటున్న వారిని పిలిచి తనతో సినిమా తీయాలి అని కోరుతున్నాడు అంటున్నారు. నిర్మాణానికి అయ్యే ఖర్చు తానే పెట్టుకుని నిర్మాతగా మాత్రం అవతలి వ్యక్తి పేరు వేస్తాడు అంటే ఇదొక షాడో ప్రొడ్యూసర్ , గోస్ట్ నిర్మాతగా చేసే పని అనమాట. డబ్బులు తనవే అయినప్పుడు తన పేరే వేసుకోవచ్చు కానీ ఇక్కడ ఒక కిటుకు ఉంది. నిర్మాతలు తనతో సినిమాల కోసం వెంట పడుతున్నారు అనే ఫీలింగ్ జనాలలో సృష్టించడం కోసం అరుణ్ ఈ రకమైన ప్లాన్ వేసాడు. ఇంతకీ ఇతని స్కెచ్ వర్క్ అవుతుందో లేదో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: