అవును, మీరు చదువుతున్నది నిజమే. కాకపోతే ఇది సినిమా ఏడుపు కాదు. నిజంగానే ఏడ్చాడు మహేష్. తెలుగుదేశం అంటే సంప్రదాయాలూ అనుబంధాల లోగిలి. ఇటీవలి కాలంలో వాటన్నింటినీ చూపిస్తూ వచ్చిన చిత్రం సీతమ్మ వాకిట్లో. తెలుగు ప్రేక్షకులకు మళ్లీ మన అనుబంధాలూ ఆప్యాయతలను గుర్తుచేసిందీ చిత్రం. అంతేకాదు, ఓ భారీ మల్టీస్టారర్ గా కూడా అందరి హృదయాలనూ దోచుకుంది. ఈ చిత్ర ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ నిన్న జరిగింది. ఆ సందర్భంగా ప్రముఖ గీత రచయిత సీతారామశాస్త్రిగారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమానూ దీనికి కలిసి పనిచేయడానికి ముందుకొచ్చిన వెంకటేష్, మహేష్ బాబులనూ ఆయన మెచ్చుకున్నారు. ఆ తరవాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడాడు. నాలుగేళ్లపాటు కష్టపడి చేసిన సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు శ్రీకాంత్. వీళ్లిద్దరూ మాట్లాడుతున్నప్పుడు... మహేష్ బాబు భావోద్వేగానికి గురయ్యాడు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబే వేదిక మీద చెప్పాడు. మహేష్ లాంటి యాక్షన్ మాస్ హీరోకూ కళ్లు చెమర్చాయంటే... సీతమ్మ వాకిట్లో ఎంత హిట్టయ్యిందో అర్థం చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: