సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ సినిమా ఇంకా షూట్ కు రెడీ అవ్వకముందే సాంగ్స్ రెడీ చేసి పెట్టాడట ఆ సినిమా మ్యూజిక్ డైరక్టర్ హారీస్ జైరాజ్.. మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, పారాస్ జైన్ లు కలిసి దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో రెండు సాంగ్స్ కూడా రికార్డ్ చేశారట.


మరి ముహుర్తం పెట్టకముందే సాంగ్స్ ఏంటి అంటే అదంతే అంటున్నాడు హారీస్ జైరాజ్. అంతేకాదు ప్రెస్టిజియస్ గా వస్తున్న ఈ సినిమా చేయడం తన అదృష్టమని అన్నారు. ఇంతకుముందు మహేష్ తో హారీస్ జైరాజ్ సైనికుడు సినిమాకు పనిచేయడం జరిగింది. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా సాంగ్స్ పరంగా కేక పెట్టించింది కాని సినిమా పూర్తిగా నిరాశ పరిచింది.


అయితే చాలా గ్యాప్ తర్వాత మహేష్ తో మళ్లీ హారీస్ జైరాజ్ పనిచేస్తున్నాడు. న్యాయ వ్యవస్థకు సంబందించిన కథతో ఈ సినిమా రాబోతుందని ఇప్పటికే అందరికి తెలిసిందే. ఇక సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ పరిణీతి చోప్రాను తీసుకుంటున్నారట. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ఎంతో హెల్ప్ అవనుంది.


మరి అన్ని హంగులతో పక్కా ప్లాన్డ్ గా వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. ఓ పక్క బ్రహ్మోత్సవం ఫ్లాప్ భారాన్ని వెంటనే ఓ బ్లాక్ బస్టర్ హిట్ తో కడిగేయాలనుకుంటున్నాడు మహేష్ మరి ఆ సినిమా ఇదే అవుతుందా లేదా అన్నది సినిమా వస్తేనే గాని చెప్పలేం. 



మరింత సమాచారం తెలుసుకోండి: