నాచురల్ స్టార్ నాని జెంటిల్ మన్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. అయితే ఆల్రెడీ ఓవర్సీస్ లో ప్రీమియర్స్ నుండి వస్తున్న టాక్ చూస్తుంటే సినిమాలో నాని ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడట. కాని ఓవరాల్ గా మాత్రం సినిమా నిరాశ పరచిందని అంటున్నారు. సినిమాలో ట్విస్ట్ లు బాగున్నాయంటూనే వాటిని రివీల్ చేసే విధానంలో దర్శకుడు ఫ్లాట్ గా చెప్పాడని అంటున్నారు.


అంతకుముందు అయోమయంగా ఉన్న నాని కెరియర్ ఎవడే సుబ్రమణ్యం సినిమాతో గొప్ప చేంజ్ తీసుకుంది. అది మల్టీప్లెక్స్ సినిమా అన్న టాక్ వచ్చినా నానికి అకౌంట్లో హిట్ అన్నట్టే. ఇక ఆ తర్వాత వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా నాని కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. చిన్న సినిమా పెద్ద విజయం సాదించిన భలే మగాడితో నాని నాచురల్ స్టార్ గా అవతారమెత్తాడు.


ఇక కృష్ణగాడి వీర ప్రేమగాథ కూడా మంచి ఎంటర్టైనింగ్ ఇచ్చింది. ఇక ఎన్నో ఆశలతో వచ్చిన జెంటిల్ మన్ సినిమా ఆ రేంజ్ హిట్ ఇవ్వడంలో వెనుక పడ్డదట. సినిమా మొత్తం స్క్రీన్ ప్లే బేస్డ్ గా నడిచిందంటున్నారు. ఇక కథలో ట్విస్ట్ లు కూడా సర్ ప్రైజ్ చేసేలా ఉన్నా ఏదో వెలితి కనిపిస్తుందట. సినిమా ఇంతకుముందు నాని సినిమాల కాన్నా యావరేజ్ టాక్ తెచ్చుకుంటుంది అంటున్నారు.


మరి నాని చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందో లేదో మన దగ్గర షోలు పడ్డాక తెలుస్తుంది. ఇప్పటివరకు ఎక్కడ విన్నా యావరేజ్ అంటున్నారు సో ఒకవేళ అదే క్లిక్ అయ్యి సూపర్ సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయనుకోండి. ఏది ఏమైనా నాని మార్క్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో జెంటిల్ మన్ కాస్త వెనుకపడ్డదని వస్తున్న రిపోర్ట్స్ ను బట్టి చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: