మెగా ప్రొడక్షన్స్ లో ఒకటిగా ఉన్న నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్.. నాగబాబు సారధ్యంలో నడిచే ఆ సంస్థలో తీసిన సినిమాలన్ని ఫ్లాపే అని చెప్పాలి. ఒక్క బావగారు బాగున్నారా తప్ప అన్ని నాగబాబుకి లాస్ తెచ్చినవే. ఇక మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ఆరెంజ్ తో ఆ నిర్మాణ సంస్థ కష్టాల్లో మునిగింది.


అయితే ఒక మనసుతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్ ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో ఒకవేళ హీరోయిన్ కాకపోతే మీరు ఏం చేసేవారనగా.. తండ్రి స్థాపించిన అంజనా ప్రొడక్షన్ నుండి సినిమాలు నిర్మించే పని చేస్తా అన్నది. సో తండ్రికి తగ్గ తనయురాలే అని మరోసారి ప్రూవ్ చేసుకుంది నిహారిక.


ముందు బుల్లితెర మీద ఆ తర్వాత వెబ్ సీరీస్ తో నెటిజెన్లను ఆకట్టుకున్న నిహారిక ఒక మనసుతో మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమా మధురా శ్రీధర్, టివి-9 కలిసి నిర్మించారు. ట్రైలర్స్, సాంగ్స్ సినిమా ఓ మంచి ప్రేమకవ్యంగా ఉండబోతుందని తెలుస్తుంది.


మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు దర్శకుడు రామరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి సినిమా హిట్ అయ్యి నిహారిక హీరోయిన్ గా సూపర్ సక్సెస్ అయినా సరే తండ్రి స్థాపించిన అంజనా ప్రొడక్షన్స్ నుండి మళ్లీ సినిమాలు చేసేందుకు సిద్ధం అంటుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: