‘ఒంగోలు గిత్త’ సినిమాలో కీలకమైన సన్నివేశాలన్నీ గుంటూరు మిర్చీ యార్డులో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఆ షూటింగ్ కూడా గత ఏడాది వేసవిలో మూడు వారాలపాటు సాగింది. ఓ రెండు రోజులు షూటింగ్ జరగ్గానే... షూటింగ్ స్పాట్ ని హైదరాబాద్ మార్చేద్దాం, అక్కడే సెట్ వేసుకుందాం అని చిత్ర నిర్మాత అన్నారట. అప్పుడు దర్శకుడు భాస్కర్... ‘అవసరం లేదు సార్. ఎలాగోలా ఇక్కడే ముగించేద్దాం అని చెప్పాడు. అసలే వేసవి,యార్డులో అడుగుపెట్టగానే రెండంటే రెండే గంటల్లో అందరూ డీలాపడిపోయేవారు. కళ్లు మంటలు, ముక్కు మంటలు. మరో పక్క ఎండ తీవ్రత. ఓ స్థాయిలో అనవసరంగా ఇక్కడ షూటింగు పెట్టుకున్నామేమో అనిపించేది. అయితే, ఇప్పుడు తెరపై ఆ ద్రుశ్యాలన్ని చూస్తుంటే మా శ్రమ ఊరకే పోలేదు అనిపిస్తోంది’ అని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఒంగోలు గిత్త చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఫిబ్రవరి 1న విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: