కోలీవుడ్లో సూపర్ ఫాంలో ఉన్న నయనతార అప్పుడప్పుడు తెలుగు మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేస్తుంది. లేటెస్ట్ గా తెలుగులో బాబు బంగారంతో హిట్ అందుకున్న నయన్ క్రేజ్ ఇంకా పెరిగిందని చెప్పాలి. అయితే కొద్దిరోజులుగా నయన్ మీద వస్తున్న రూమర్స్ గురించి ఎట్టకేలకు గుట్టు విప్పేసింది నయనతార. ఇంతకీ అమ్మడు ఏ విషయం మీద క్లారిటీ ఇచ్చేసింది అంటే సినిమా ప్రమోషన్స్ విషయంలో నలుగురు నాలుగు రకాలుగా తన గురించి మాట్లాడుతున్నారు. ఇక ఇలానే ఉంటే బాగోదని నయనతార నోరు తెరచి తను ప్రమోషన్స్ కు రాకపోడానికి గల కారణాలు చెప్పింది.


సినిమా ఎలా ఉన్నా రిలీజ్ ముందు ప్రమోషన్స్ తో చేసే హడావిడి ఆ సినిమా రిలీజ్ అయిన మొదటి వారం కలక్షన్స్ మీద బాగా పడుతుందని దర్శక నిర్మాతల గట్టి నమ్మకం. అందుకే సినిమా అవుట్ పుట్ ఎలా ఉన్నా ప్రమోషన్స్ తో ఆడియెన్స్ కు పిచ్చెక్కేలా చేస్తారు. అయితే ఏదైనా సినిమాకు హీరోయిన్ గా నయనతార సెలెక్ట్ అయితే ఆ దర్శక నిర్మాతలకు ముందే తాను ప్రమోషన్స్ కు వచ్చేది లేదని తెగేసి చెబుతుంది. అయితే ఓ పక్క బిజీ షెడ్యూల్ తో ఉంటున్న నయన్ తమ సినిమాల్లో నటిస్తేనే హ్యాపీ అనుకునే వారు కొందరైతే నయనతార ప్రమోషన్స్ కు రావట్లేదని గొడవ చేసే వారు కొందరు.


ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తను సినిమాల ప్రమోషన్స్ రాకపోడానికి గట్టి కారణం ఉందంటుంది నయనతార. తాను ఏదైతే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటానే ఆ సినిమా తుస్ మనడం ఖాయమని చెబుతుంది. ప్రమోషన్స్ విషయంలో తనది ఐరన్ లెగ్ అని అందుకే దర్శక నిర్మాతలు నొచ్చుకున్నా తాను ప్రమోషన్స్ కు వచ్చేది లేదని చెప్పేస్తానని అన్నది. మరి అమ్మడు చెప్పింది నిజమేనా అని ఒక్కసారి గత సినిమాల ఫలితాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న నయనతార ప్రమోషన్స్ కు రాకపోడానికి ఇది అన్నమాట కారణం. 


అయితే ఇది అర్ధం చేసుకోక కోట్లు డిమాండ్ చేస్తుంది కాని ప్రమోషన్స్ మాత్రం రాదు అంటూ నయనతారం మీద చాలా కామెంట్స్ వినపడ్డాయి. ఈ మధ్య ఆ గొడవ ఇంకాస్త పెద్దది కావడం చేత నయనతార తన మనసులోని మాట బయట పెట్టేసింది. ప్రస్తుతం విక్రం హీరోగా ఇరుమగన్ సినిమాలో నటించిన నయన్ ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనట్లేదు. మరి నిర్మాతకు డబ్బులు రావాలంటే ఆమెను ప్రమోషన్స్ కు పిలవకపోవడమే బెటర్ అనేసుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: