ప్రస్తుతం కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా వినిపిస్తున్న న్యూస్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ గురించి. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్స్ ప్రకారం, దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..‘అట్టకత్తి, మద్రాస్’ వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ పా రంజిత్. ఈ డైరెక్టర్ తాజాగా రజనీకాంత్ తో‘కబాలి’ చిత్రాన్ని తెరకెక్కించి మరింత పాపులర్ అయ్యాడు.


ఈ మూవీకి కలెక్షన్స్ భారీగా వచ్చినప్పటికీ..ఫ్యాన్స్ కి సైతం మూవీ నచ్ఛకపోవటం అనేది కొంత ఆశ్ఛర్యాన్సి కలిగించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ డైరెక్టర్ మరో రియలిస్టిక్ కథతో ముందుకు వెళుతున్నాడు. ఇందుకు స్టార్ హీరోకి సంబంధించిన డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులోని భాగంగానే కోలీవుడ్ కి చెందిన కొందరి స్టార్ హీరోలకి డైరెక్టర్ పా రంజిత్ తాజాగా తన కథని వినిపించారంట.


అందరూ పా రంజిత్ చెప్పిన కథని కొంత పెండింగ్ లో పెట్టారు. ఇక ఒక స్టార్ హీరో మాత్రం పా రంజిత్ కథని వినటానికి అంతగా ఆసక్తి చూపటం లేదు. హీరోగారూ తన ఆఫీస్ లో ఉన్నారని తెలుసుకొని వెళ్ళిన పా రంజిత్ కి...హీరోగారి ఆఫీస్ బాయ్స్ నుండి తిరస్కారం ఎదురయింది. హీరో ఆఫీస్ లో ఉన్నప్పటికీ...ఆఫీస్ బాయ్య్  “హీరో ఆఫీస్ లో లేరు” అంటూ డైరెక్టర్ పా రంజిత్ ని వెనక్కి పంపటంతో అది తనని బాగా హర్ట్ చేసిందట.


అయితే  ఈ విధంగా చేసిన హీరో విజయ్ అని ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. గతంలో విజయ్ కి డైరెక్టర్ పా రంజిత్ ల మధ్య మంచి పరిచయాలే ఉన్నప్పటికీ....గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య సరైన మాటలు లేవని అంటున్నారు. అందుకే పా రంజిత్ ని దూరంగా పెట్టడం కోసం విజయ్ ఈ విధంగా చేశాడనేది కోలీవుడ్ లో వినిపిస్తున్న టాక్స్.



మరింత సమాచారం తెలుసుకోండి: