టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గత కొద్ది కాలంగా చూస్తే సక్సెస్ రేటు అనేది ఎక్కువుగానే ఉంది. ఇండస్ట్రీలో వస్తున్న మార్పులకి చిత్ర నిర్మాతలు భారీగా లాభాలను అందుకుంటున్నారు. చిత్ర నిర్మాణంపై అవగాహన ఉన్న నిర్మాతలు, అలాగే కథని నమ్ముకొని వస్తున్న దర్శకులు రావటంతో చిత్ర పరిశ్రమకి సక్సెస్ లు ఎక్కవుగా వస్తున్నాయి.


అలాగే ప్రొడక్షన్ లని నమ్ముకోకుండా కథలని మాత్రమే నమ్మకున్న హీరోలు సైతం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువుగా ఉండటంతో...మంచి చిత్రాలు ఇండస్ట్రీకి అందుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ బాక్సాపీస్ వద్ద సక్సెస్ ని అందుకున్న చిత్రం జ్యో అచ్యుతానంద.  ‘ఊహలు గుసగుసలాడే’తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్.. ‘జ్యో అచ్యుతానంద’ మూవీతో మరో హిట్ ని అందుకున్నాడు.


కుటుంబ కథా చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం...అవసరాల శ్రీనివాస్ మార్క్ ని చూపించింది. ‘జ్యో అచ్యుతానంద’ మూవీలో అవసరాల శ్రీనివాస్ స్టోరీని చెప్పిన తీరుని చూస్తే...ప్రేక్షకులకి త్రివిక్రమ్ తరహా స్టైల్ గుర్తుకువచ్చింది. దీంతో అవసరాల శ్రీనివాస్ ని అందరూ జూనియర్ త్రివిక్రమ్ అంటూ కామెంట్స్ స్టార్ట్ చేశారు. తాజాగా త్రివిక్రమ్ సైతం ‘జ్యో అచ్యుతానంద’ మూవీని చూసి ఇంప్రెస్ అయ్యాడంట.


కచ్ఛితంగా అవసరాల శ్రీనివాస్ కి మంచి ఫ్యూచర్ ఉంటుందని త్రివిక్రమ్ కామెంట్ చేయటం ఇక్కడ విశేషం. ఇక కలెక్షన్స్ పరంగా ఈ మూవీ థియోటర్స్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే యుఎస్ మార్కెట్ వద్ద ఈ మూవీ హాఫ్ మిలియన్ మార్క్ ని చేరుకోవటంతో సినిమా ఏరేంజ్ లో సక్సెస్ అయిందే...దీన్ని బట్టే తెలుస్తుంది. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్ రమణ అందించిన మ్యూజిక్ చిత్ర విజయానికి బాగా కలిసొచ్చిందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: