కంప్యూటర్ గురించి తెలిసిన వారికి స్టీవ్ జాబ్స్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆపిల్ సంస్థ వ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ జీవిత కథ ఆధారంగా హాలీవుడ్ లో ఒక చిత్రం రూపొందుతుంది. ‘జాబ్స్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రను అస్టన్ కుట్చెర్ పోషిస్తుండగా, ఈ సినిమాకు జోషా మైఖైల్ స్టెర్న్ దర్శకత్వం వహిస్తున్నాడు. 1955 సంవత్సరం కాలిఫోర్నియాలో జన్మించిన జాబ్స్ 2011లో మరణించారు. అతని జీవితంలో ముఖ్యసంఘటనలను, టెక్నాలజీపై అతనికి ఉండే ఆసక్తిని,  అపిల్ సంస్థ అంతర్జాతీయంగా పేరుతెచ్చుకోవడంలో జాబ్స్ పాత్రను ఈ చిత్రంలో చూపిస్తున్నారు. ఈ జాబ్స్ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: