రామ్ చరణ్ ' రచ్చ' విషయంపై వివరణ ఇచ్చేందుకు సీన్ లోకి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం తాజ్ బంజారా ఎదురుగా జరిగిన ఘటనకు సాక్ష్యాలు ఆ స్పాట్ లో తీసిన  ఫోటోలు.. ఆ రోజు ఏం జరిగిందో ఎవరు ఎవర్ని తన్నారో ఆ ఫోటోస్ లో చాలాస్పష్టంగా ఉంది. ఫోటోస్ లో ఉన్న దానికి తాజాగా రామ్ చరణ్ చెబుతున్న దానికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది.

సాఫ్ట్ వేర్ ఉద్యోగులపై సెక్యురిటీ సిబ్బంది దాడి చేసిన నాలుగురోజుల తర్వాత చరణ్ మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చాడు. అయితే రామ్ చరణ్ చెబుతున్న దానికి ఘటన జరిగిన రోజు మీడియాలో వచ్చిన ఫోటోస్ కి చాలా తేడా కనిపిస్తోంది. తనసలు కారే దిగలేదని చరణ్ అంటున్నారు.. అంతా తన సెక్యూరిటీయే చూసుకున్నారని చరణ్ చెప్పుకొచ్చాడు.

ఆ రోజు చరణ్ కారు దిగకపోతే  మరి ఆ చిత్రాల్లో కారు పక్కనుంచి వెళ్తున్నదెవరు? కారే దిగని ఆయన అక్కడెందుకున్నట్టు? ఇది ఆ ఫోటోస్ చూసిన వారికి కామన్ గా తలెత్తే సందేహం. అయితే ఫోటోలను మార్ఫింగ్ చేశారంటూ దానికి కూడా బదులిచ్చేశాడు. తన ఫోటోని మార్ఫింగ్ చేసి పేపర్ లో ప్రచురించారంటున్నాడు. ఘటన జరిగిన రోజు  ఓ ఫోటోగ్రాఫర్ తనను బ్లాక్ మెయిల్ చేశాడని కూడా చెర్రీ ఆరోపిస్తున్నాడు.

తన ఫోటోని మార్పింగ్ చేయాల్సిన అవసరం 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రికకు ఎందుకొచ్చిందో రామ్ చరణ్ చెప్పి ఉంటే బాగుండేది. కాని రామ్ చరణ్ ఆ పని చేయలేదు. అంతేకాదు తనను బ్లాక్ మెయిల్ చేసిన ఆ ఫోటోగ్రాఫర్  పేరు కూడా వెల్లడించలేదు. చట్టంపై తనకు గౌరవముందని చెబుతున్న చరణ్ బ్లాక్ మెయిలర్ పై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న సందేహం తలెత్తకమానదు.

ఇదిలా ఉంటే  సాఫ్ట్ వెర్ ఉద్యోగులే తనపై దాడిచేశారని రామ్ చరణ్ ఆరోపిస్తున్నారు. తనపట్ల దురుసుగా ప్రవర్తించినప్పటికీ సెలబ్రిటీ హోదాలో ఉన్న తను చాలా డిగ్నిటీగా వ్యవహరించాని చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ చెబుతున్నట్లు ఆయన సెక్యూరిటీపై ఆ ఇద్దరు దాడిచేస్తే  సెక్యూరిటీకి దెబ్బలు ఎందుకు తగల్లేదు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి చొక్కానే ఎందుకు చిరిగింది. వాళ్లే ఫైట్ స్టార్ట్ చేస్తే వారే ఎందుకు కిందకు పడ్డారు.

మొత్తమ్మీద రామ్ చరణ్ 'రచ్చ' ఎపిసోడ్ లో సాక్ష్యాలుగా ఉన్న ఫోటోస్ కి ఆయన చెబుతున్న కథనానికి ఎక్కడా పొంతన లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: