క‌మ‌ల్ కూతురు అనే ట్యాగ్‌లైన్ మీద ఉన్న గౌర‌వం కాపాడుకోవడానికి ఇన్నాళ్లూ కాస్త ప‌ద్ధ‌తిగానే క‌నిపించింది శ్రుతి హాస‌న్. ఇప్పుడిప్పుడే తాను గీసుకొన్న గీత‌ను దాటేస్తోంది. ఇటీవ‌ల ఓ ఇంగ్లీషు మ్యాగ‌జైన్ ముఖ చిత్రానికి హాట్ హాట్ పోజులిచ్చి.. అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది శ్రుతి. క‌మ‌ల్ కూతురేంటి?  మ‌రీ ఇలా రెచ్చిపోయింది??  అని ముక్కున వేలేసుకొన్నారు.

ఇప్పుడు వెండి తెర‌పైనా అంతే వేడి పుట్టించ‌బోతోంది. త‌న పాత్ర‌ల‌కు కాస్త స్పైసీ యాడ్ చేయండ‌ని.. ద‌ర్శ‌కుల‌కు స‌ల‌హా ఇస్తోంద‌ట‌. అంటే.. క‌మ‌ల్ కూతురు రూటు మార్చిన‌ట్టే క‌దా?  క‌థానాయిక‌గా త‌న బండి జెట్ వేగంతో దూసుకుపోవాలంటే ఇలా రెచ్చిపోవ‌డం త‌ప్ప‌ద‌ని.. భావించిందేమో. ఒక్క‌సారిగా మోతాదు పెంచేసింది. శృంగార ప్రియుల‌కు ఇక పండ‌గే.

మరింత సమాచారం తెలుసుకోండి: